ఖాట్మండు: నేపాల్ మాజీ న్యాయశాఖ మంత్రి నీలాంబర్ ఆచార్య భారత్‌లో ఆ దేశరాయ బారిగా నియమితులయ్యారు. సుమారు ఏడాదిన్నరగా భారత్‌లో నేపాల్ రాయబారిని నియ మించలేదు. రాయబారిగా ఉన్న దీప్‌కుమార్ ఉపాధ్యాయ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లడంతో స్థానం ఖాళీ అయింది. ఆదివారం ఖాట్మండ్‌లో రాష్ట్రపతి బిద్యాదేవి భండారి నీలాంబర్ ఆచార్యతో ప్రమాణం చేయించారు. భారత్‌లో రాయబారిగా నియమితులవ్వడంపై ఆచార్యకు అభినందనలు తెలిపారు. గతంలో రాయబారిగా నియమితులైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించేవారు. ఆచార్య మాస్కో వర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మొదట్లో వామపక్ష భావజాలంతో ఉన్నా తర్వాత నేపాలీ కాంగ్రెస్‌లో చేరారు. 1990లో తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు, సామాజిక సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment