ప్యాంగ్యాంగ్: అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ధిక్కరిస్తూ ఉత్తర కొరియా ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఉత్తర కొరియా మరోసారి క్షిపణిని పరీక్షించింది. ఉత్తర కొరియా తూర్పు ప్రాంతంలో సముద్ర జలాల్లో సబ్మెరిన్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్టు దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.
అణ్వాయుధాలను తయారు చేస్తున్న ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఐక్యరాజసమితి నిషేధం విధించింది. అయినా ఉత్తర కొరియా ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తోంది. ఇటీవల వరుసగా క్షిపణి ప్రయోగాలు చేసినా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. తాజాగా మరోసారి పరీక్షించింది. ఉత్తర కొరియా బెదిరింపులకు కౌంటర్గా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించాలని అమెరికా, దక్షిణ కొరియా అంగీకరించాయి.
ఆంక్షలు ధిక్కరిస్తూ ఉత్తర కొరియా మరోసారి..
Published Sat, Jul 9 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
Advertisement
Advertisement