ఇటలీలోని మొబైల్ మ్యూజియంలో హిట్లర్ చిత్రీకరించిన పెయింటింగ్ (పక్కన హిట్లర్)
రోమ్ : ఇటలీలోని గోయా నుంచి బెకాన్ మధ్య కొనసాగుతున్న మొబైల్ మ్యూజియంలో ఇటీవల ఓ 40 ఏళ్ల యువకుడు నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ వేసిన ఆయిల్ పెయింటింగ్‌పై దాడి జరిపారు. ఈ పెయింటింగ్‌ను హిట్లర్ వేశాడని తెలియగానే సదరు వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ ఒక్కసారిగా స్క్రూడ్రైవర్‌తో దాడి చేశాడని ఈ మొబైల్ మ్యూజియంను నిర్వహిస్తున్న చిత్ర విమర్శకుడు, క్యూరేటర్ విక్టోరియో స్కార్బీ మీడియాకు తెలిపారు.
దాడి చేసిన వ్యక్తిని పట్టుకోబోతే పారిపోయాడని, పెయింటంగ్‌కు పెద్దగా నష్టం ఏమీ సంభవించలేదుకనుక, నిందితుడిపై కేసు పెట్టాలనుకోవడం లేదని కూడా ఆయన తెలిపారు. ఇలాంటి చిత్రాలు భావోద్వేగాలను కలిపించే మాట వాస్తవమేనైనా, సంయమనం పాటించడం మానవుడి విధిగా ఆయన మాట్లాడారు. వియన్నా ఆర్ట్స్ కళాశాలలో అడ్మిషన్ కోసం హిట్లర్ దరఖాస్తు చేసుకున్నప్పుడు పంపించిన చిత్రాల్లో ఒకటి ఈ పెయింటింగ్ అని తెలిపారు. ‘వియన్నా అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్’ కాలేజీలో అడ్మిషన్ కోసం హిట్లర్ రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఆయనకు అడ్మిషన్ లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment