లాహోర్(పాకిస్తాన్): పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ రంగస్థల నటిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా కాల్చి చంపారు. ముల్తాన్ నగరంలోని తన ఇంటి వద్ద నుంచి కారులో బయలుదేరిన షమీమ్ అనే నటిని దుండగులు కాల్చి చంపినట్లు ఆమె సోదరుడు సయీఫ్ ఉర్ రహమాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, తన సోదరికి కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అతడు పోలీసులకు తెలిపాడు. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తమ ఇంటి మెయిన్ గేట్ వద్దకు వచ్చిన ఆమెను దుండుగులు కాల్చగా అక్కడికక్కడే చనిపోయిందని చెప్పాడు.
ఆమె మాజీ భర్త ఈ ఘటనకు కారణమై ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అందరూ షమోగా పిలుచుకునే షమీమ్ మంచి నృత్యకారిణి కూడా. ఇప్పటి వరకు కిస్మత్ బేగ్ అనే రంగస్థల నటితో పాటు, నద్రా, నాగు, యాస్మిన్, నయినా, మార్వి, కరిష్మా, సంగం, ఆర్జూ తదితర నటీమణులు మాజీ భర్తలు, మాజీ ప్రియుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా లాహోర్, ముల్తాన్ ప్రాంతాలకు చెందిన వారే కావటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment