టోక్యో: రానున్న రెండేళ్లతో తమ దేశం నుంచి వెనక్కు వెళ్లిపోవాలని అమెరికా బలగాలను పిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె కోరారు. టోక్యోలో జరుగుతున్న ఆర్థిక సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో బరాక్ ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. తీవ్ర విమర్శలు రావడంతో మళ్లీ వెనక్కు తీసుకున్నారు. కాగా తమ భూ భాగంపై నుంచి ఇతర దేశాల సైన్యం వెళ్లిపోవాలని అమెరికాను ఉద్దేశించి అన్నారు. అలాగే అగ్ర దేశంతో రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునే అంశాన్నీ పరిశీలిస్తామన్నారు.
దశాబ్దాల క్రితం స్పానిస్ నుంచి పిలిప్పీన్స్‌ను కొనుగోలు చేసిన అమెరికా ఉగ్రవాదం పేరుతో ఇప్పటికీ ఆ దేశంలో మిలిటరీ బేస్ క్యాంప్‌లను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పతాక శీర్షికల్లో నిలవడం డుటెర్టెకు పరిపాటిగా మారింది.
అమెరికా బలగాలు వెనక్కువెళ్లాల్సిందే
Published Thu, Oct 27 2016 12:19 PM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement