ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ఫిలిప్పీన్స్: డ్రగ్ డీలర్స్ను కాల్చి పారేయండంటూ ఫిలిప్పీన్స్ కొత్త అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మత్తు పదార్థాల దొంగ రవాణాపై చర్యలు తీసుకునే విషయాన్ని తాను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నానని, ఈ విషయం ఎవరికి నచ్చదో వారికి తాను వీర అభిమానినంటూ వ్యాఖ్యానించారు. ఏ డ్రగ్ డీలర్ అరెస్టుకు సహకరించకుండా వ్యతిరేకిస్తాడో అతడిని ప్రజలే కాల్చిపారేయాలని, లేదంటే కొట్టి చంపేయాలని ఆయన బహిరంగా వ్యాఖ్యాలు చేశారు. గత నెలలో (మే) 9న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డ్యూటర్టీ విజయం సాధించారు. ఈ సందర్భంగా తొలిసారి పెద్ద సమూహం మధ్య మీడియా కవరేజ్ లో మాట్లాడిన ఆయన డ్రగ్స్ కట్టడిలో తనకు ప్రజలంతా సహకరించాలని డిమాండ్ చేశారు.
'ఈ విషయం(డ్రగ్స్ కట్టడి)లో అంతా స్వేచ్ఛంగా ఆలోచించండి. మాకుగానీ, పోలీసులకు గానీ ఫోన్ చేయండి. లేదా మీరే చేయండి.. మీ దగ్గర తుపాకీ ఉందా మీకు నా మద్దతు ఉంటుంది. డ్రగ్స్ డీలర్లను కాల్చిపారేయండి. మీ సహకారం అందిస్తే ఆరు నెలల్లో అవినీతిని అంతం చేస్తాను. నేరాలను తగ్గిస్తాను. డ్రగ్స్ మాఫియాను తేలికగా తీసుకుంటే అది ఫిలిప్పీన్స్ను ఆక్రమిస్తుంది. దీనికి నేను ఏమాత్రం అంగీకరించను. ఇప్పటికే మీరు డ్రగ్స్లోనే మునిగి ఉంటే మిమ్మల్ని చంపేస్తాను. ఇది మీరు జోక్ తీసుకోవద్దు. ఈ విషయం మీరు నవ్వేందుకు చెప్పడం లేదు.. చాలా తీవ్రంగా భావించి చెబుతున్నాను' అని ఆయన అన్నారు.