ఇంటిపై కుప్పకూలిన జెట్ విమానం
అమెరికాలో ఓ జెట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ కు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు ఓ జెట్ విమానం లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తూ జెట్ విమానం అదుపుతప్పింది. ఓ ఇంటిపై జెట్ ఫ్లైట్ కూలిపోయింది. ఈ ఘటన అరిజోనాలోని ఫోనిక్స్ లో చోటుచేసుకుంది. విమానం కుప్పకూలేముందు పైలట్, ఇతర సిబ్బంది పారాచూట్ సహాయంతో కిందకి దూకేయడంతో పెద్ద మొత్తంలో నష్టం జరగలేదు.
ఇంట్లోని వ్యక్తులకు ఎవరికి గాయలు కాలేదని, అయితే పైలట్ గాయాలు అయినట్లు అధికారి గిల్బర్ట్ వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జెట్ ఫైట్ లో స్కై డైవర్స్ ను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.