ఈ మొక్క కనిపిస్తే పంట పండినట్లే! | Plant That Only Grows In Diamond-Rich Soil Found | Sakshi
Sakshi News home page

ఈ మొక్క కనిపిస్తే పంట పండినట్లే!

Published Sun, May 17 2015 3:15 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

ఈ మొక్క కనిపిస్తే పంట పండినట్లే!

ఈ మొక్క కనిపిస్తే పంట పండినట్లే!

నక్క తోక తొక్కితే లక్కు వస్తుందో లేదో తెలియదు గానీ.. ఈ మొక్కను చూస్తే మాత్రం కచ్చితంగా పంట పండుతుంది. ఎందుకంటే.. అతి విలువైన వజ్రాల గనులున్న ప్రాంతాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది మరి! ‘పాండనస్ కాండెల బ్రమ్’ అనే ఈ మొక్కను ఆఫ్రికన్ దేశం లైబీ రియాలో కనుగొన్నారు. సాధారణంగా ఎక్కడ కింబర్‌లైట్ శిలలు ఉంటాయో అక్కడ వజ్రాలు దొరుకుతాయి. అయితే, ఎక్కడ ఈ మొక్క కనిపిస్తుందో అక్కడ కింబర్‌లైట్ శిలలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం కింబర్‌లైట్ శిలల కోసం వెతికి, అవి ఉన్న చోటే వజ్రాల వేట మొదలుపెడుతుంటారు.
 
 ఇకపై ఈ మొక్కను వెతికి పట్టుకుంటే చాలు.. వజ్రాల గనులు దొరికినట్లేనని ఫ్లోరిడా ఇంటర్నేషనల్ వర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ హ్యాగర్టీ అంటున్నారు. భూ ఉపరితలం కింద ఉండే మాంటిల్ పొర నుంచి లావా ఎగజిమ్మినప్పుడు దానితో పాటు వజ్రాలు పైకి వస్తుంటాయని అంచనా. లావా ఎగజిమ్మినప్పుడు ఉపరితలంలో వందల మీటర్ల మేరకు లావా(కింబర్‌లైట్) గొట్టా లు ఏర్పడుతుం టాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా 6 వేల కిం బర్ లైట్ గొట్టాలుండగా, వాటిలో సుమారు 60 గొట్టాల్లోనే విలువైన వజ్రాలు ఉండవచ్చని, అందువల్ల దట్టమైన అడవుల్లో ప్రయాస పడటం కంటే ఏరియల్ సర్వే ద్వారా ఈ మొక్క ను వెతికితే చాలని హ్యాగర్టీ చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement