న్యూఢిల్లీ: లండన్‌లోని కామన్వెల్త్ సెక్రటేరియట్‌లో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ప్రజాపతి త్రివేదికి ప్రతిష్టాత్మక ‘హ్యారీ హాట్రీ డిస్టింగ్యూష్‌డ్ పర్ఫార్మెన్స్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్ అవార్డ్’ దక్కింది. ప్రజాపాలన విభాగంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2019 ఏడాదికి ఈ అవార్డును ప్రజాపతికి బహూకరించారు. ఆదివారం వాషింగ్టన్‌లో జరిగిన వేడుకలో సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ (సీఏపీ), అమెరికన్ సొసైటీ ఫర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఏఎస్‌పీఏ) ఈ అవార్డును ప్రజాపతికి ప్రదానం చేశాయి.
ఈ అవార్డును ప్రతి ఏడాదీ ప్రజాపాలన విభాగంలో గణనీయ మార్పులు తెచ్చేందుకు కృషి చేసే వారికి ఇస్తారు. ఈ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు ప్రజాపతే. ఇప్పటి వరకు తాను పొందిన అన్ని అవార్డుల్లోకెల్లా ఈ అవార్డు తనకు ఎంతో విలువైనదని ప్రజాపతి తెలిపారు. 2009–14 మధ్య కాలంలో ప్రజాపతి భారత పీఎంవోలో శాశ్వత కార్యదర్శిగా పనిచేశారు. అంతకు ముందు ఆయన అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment