సౌదీ కింగ్‌కు వింత అనుభవం | Saudi kings golden escalator gets stuck | Sakshi
Sakshi News home page

సౌదీ కింగ్‌ ఎస్కలేటర్‌పై నడవాల్సి వచ్చింది

Published Fri, Oct 6 2017 12:17 PM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

Saudi kings golden escalator gets stuck - Sakshi

మాస్కో : సౌదీ రాజు సల్మాన్‌ బిన్‌ అబ్దుల్ అజిజ్ బంగారపు ఎస్కలేటర్‌ ఒక్కసారిగా ఆగిపోయింది. చారిత్రక రాష్ట్ర మాస్కోను సందర్శించడానికి వెళ్లిన ఆయన తన జెట్‌ విమానంలో నుంచి ఎస్కలేటర్‌పై దిగుతుండగా అది పనిచేయకుండా పోయింది. ఏమైందోనని ఒక్కసారిగా షాకైన సౌదీ రాజు చేసేది ఏమీ లేక, మెల్లమెల్లగా నడుచుకుంటూ ఎస్కలేటర్‌ దిగిపోయారు. సౌదీ రాజు నడుచుకుంటూ ఎస్కలేటర్‌ దిగుతున్న వీడియో ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేస్తోంది. దీనిపై ట్విట్టరియన్లు ఫుల్‌గా జోక్స్‌ పేలుతున్నారు. 

నిరుపేద వ్యక్తి నడవాల్సి వచ్చింది అంటూ ఓ ట్విట్టరియన్‌ జోక్‌ చేశాడు. ''సౌదీ రాజు రష్యాలోకి చేరుకున్నారు. ఆయన మొదటిసారిగా చూసింది ఎస్కలేటర్‌ ఆగిపోవడమే, నిజంగా ఇది రాయల్‌ రిసెప్షన్‌'' అని మరో ట్విట్టరియన్‌ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నేపథ్యంలో సౌదీ కింగ్‌ రష్యా వెళ్లారు. ఆయన పర్యటన సందర్భంలో రెండు లగ్జరీ హోటల్స్‌ను ప్రభుత్వం బుక్‌ చేసింది. ఈ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, సౌదీ రాజు పలు ఒప్పందాలు చేసుకోనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement