'బహుశా ప్రపంచంలోని ఏ అమ్మాయీ నాలా బాధపడి ఉండదేమో! వయసుతోపాటు నా జననాంగంలో పురుషాంగం కూడా పెరిగింది. నిజానికి నేను అమ్మాయినే. కానీ అది పెరిగాక ఇంట్లోవాళ్లుసహా ఎవ్వరూ నన్నలా చూడలేదు. స్నేహితులు ఏడిపించారు. స్కూల్లోనుంచి గెంటేశారు. కన్నవాళ్లూ ఆదరించలేదు. అందుకే ఇల్లొదిలి వచ్చేశా. ఏ దిక్కూలేని నాకు.. నెటిజన్లే దిక్కని నమ్మాను. నేను నేనుగా ఉండేందుకు సహాయం చేయమంటున్నా.. అంతులేని బాధతో నా గాథ చెప్పుకుంటున్నా..
22 ఏళ్ల కిందట పుట్టిన నాకు అమ్మానాన్నలు పెట్టిన పేరు సోఫియా. ఆ పేరంటే నాకు చాలా ఇష్టం. మాది న్యూసౌత్ వేల్స్ (ఆస్ట్రేలియా)లోని నోరా అనే ఊరు. ఆరేళ్ల వయసులో సంతోషంగా ఉన్న ఓ రోజు నా కటి భాగంలో నొప్పి మొదలైంది. నిమిషాల్లోనే తట్టుకోలేనంత తీవ్రమైంది. అమ్మానాన్నలు నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అనేక పరీక్షల అనంతరం డాక్టర్లు తేల్చిందేమంటే.. నా జననాంగం పైభాగంలో పురుషాంగం పెరగుతోందని! అప్పటికప్పుడు ఆపరేషన్ చేసే వీలులేదు. ఉన్నా అంత స్తోమతలేదుమాకు. పురుషాంగం రోజురోజుకూ పెద్దదవుతుండటంతో ఇంట్లోవాళ్లు నన్ను అమ్మాయిగా చూడటం మానేసి, అబ్బాయిలా ట్రీట్ చెయ్యడం మొదలుపెట్టారు. నా పేరును హారిసన్ గా మార్చి స్కూల్లో చేర్పించారు. నిజానికి స్కూల్ ఒక నరకం. ఎవ్వరూ నాతో ఆడుకునేవాళ్లుకాదు. ప్రతిసారి నా లోపాన్ని ఎత్తిచూపేవారు. ఏ టాయిలెట్ లోకి వెళతావు? అని వేధించేవారు. వాళ్ల మాటలు నన్ను తీవ్రంగా బాధపెట్టేవి. ఓసారి కోపం పట్టలేక నా క్లాస్ మేట్ ని కొట్టాను. అంతే, స్కూల్ నుంచి టర్మినేట్ చేశారు.
చదువుకు దూరమైన నాలో స్కూల్ అంటే అంతకంతా కోపం పెరిగింది. స్కూల్ కి వెళ్లి ఆఫీస్, క్లాస్ రూమ్ ల అద్దాలు పలగొట్టా.. మా స్కూలే కాదు ఊళ్లోని అన్ని స్కూళ్లకు వెళ్లి అదేపనిచేసేవాణ్ని. 11 ఏళ్లు వచ్చేసరికి నేనో చిన్నపాటి సైకోనయ్యా. ఊర్లోరెల్లా మోస్ట్ వాయిలెంట్ కిడ్ నేనే. అమ్మ నన్ను స్పెషల్ స్కూల్లో చేర్పిస్తాననేది. కానీ ఏ లోపమూ లేని నేను అక్కడెందుకు చదవాలని వాదించేదాన్ని. అలా కొన్నేళ్లు గడిచాక మేం సిడ్నీకి షిఫ్ట్ అయ్యాం. చదువులేదు. ఏ పనీ చేతకాదు. వయసు పెరుగుతోంది. బతకాలంటే ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితి. ఆడవాళ్లకు, మగవాళ్లకు ఉద్యోగాలు దొరుకుతాయికానీ నాలాంటి సమస్యలున్నవాళ్లకి ఉద్యోగం ఎవరిస్తారు? కొద్దోగొప్పో నన్ను అభిమానించే ఓ స్నేహితుడు సలహా ఇచ్చాడు.. 'నువ్ చాలా అందంగా ఉంటావ్.. మోడల్ గా ట్రైచెయ్యరాదూ'అని.
మోడలింగ్? నా స్నేహితుడు ఆ ఐడియా చెప్పిన సమయానికి నేనెంత రఫ్ గా ఉండేదాన్నో! పిచ్చిపిచ్చిగా తిరుగుతూ నా ముఖం, శరీరం సున్నితత్వాన్ని కోల్పోయాయి. మోడల్ అవ్వాలని డిసైడ్ అయ్యాక నా మేనుకు మునుపటి ఛాయను రప్పించుకునేందుకు తీవ్రంగా శ్రమించా. ఎన్నో కంపెనీల్లో అవకాశాలకోసం ప్రయత్నించా. కానీ అక్కడా నిరాశే ఎదురైంది. ప్రతిసారి నా శరీరంలోని లోపమే ఆటంకంగామారింది. మోడల్ గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో ఆపరేషన్ చేయించుకుందామనుకున్నా. కానీ పెద్దగా పనిదొరకట్లేదు. ఆపరేషన్ కు 60వేల డాలర్లు ఖర్చవుతుందన్నారు డాక్టర్లు. తెలిసినవాళ్లు, స్నేహితులు కొంత సర్దారు. 'నీ స్టోరీని నెట్ లో పెట్టు.. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో'అని కొందరు సలహా ఇచ్చారు. ఇంటర్నెట్ నన్ను ఆదరించింది. ఇప్పటివరకు 500 డాలర్లు విరాళంగా అందాయి. త్వరలోనే అమ్మాయిగా ఉండాలనుకునే నా కల నెరవేరుతుందనే నమ్మకం ఉంది.. నిజానికి నేను అమ్మాయినే'
అది పెరిగాక అమ్మాయివి కాదన్నారు
Published Sun, Apr 10 2016 4:45 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 PM
Advertisement