స్పూనే కదా అని తీసేస్తే..
కుర్రకారుకు బైకులంటే ఎంత ఇష్టమో...! మార్కెట్‌లోకి కొత్త మోడల్ బైక్ వచ్చిందంటే చాలు యువతకు పండుగే పండుగ.. ఈ ఫొటోలో ఉన్న బైక్ చూశారా.. కుర్రకారు మతి పోగొట్టేలా.. ఎలా మెరిసిపోతోందో..! జిగేల్‌మంటున్న ఈ బైక్‌ను కొనుక్కొని రయ్ రయ్‌మంటూ తిరిగేద్దామనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే అది నిజమైన బైక్ కాదు.
అమెరికాకు చెందిన జేమ్స్ రైస్ అనే ఆర్టిస్ట్ పూర్తిగా స్పూన్‌లతో రూపొందించాడు. అవును స్పూన్లను వంచి ఇలా బైక్‌ను తయారు చేశాడు. ఇప్పుడు ఈ బైక్‌లు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాదు ఇలాంటి వాటిని తయారు చేసి ఒక్కోదాన్ని దాదాపు రూ.20 వేల నుంచి రూ.30 వేల రేటుకు అమ్ముతున్నాడు కూడా.