అతడు తన మొబైల్ ఫోన్‌లో తీరిక లేకుండా ఉన్నాడు.. ఎంతలా ఓ పరధ్యానం.. బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్‌సెంట్ అంటారుగా అలా అన్నమాట. బహుషా ఫోన్‌లో తన గర్ల్‌ప్రెండ్‌తో చాటింగ్ చేస్తున్నాడో.. లేక ఏదైనా సీరియస్ విషయంపై ఎస్సెమ్మెస్‌లు పంపిస్తున్నాడో.. లేక ఏ వీడియోలు, ఫొటోలు చూస్తున్నాడో.. మొత్తానికి ఆదమరిచి ఓ వీధిలో పాదచారుల మార్గంపై కూర్చుండిపోయాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క కాస్త ముందుకు వెనుకకు కదిలి.. సరిగ్గా ఓ గోడను చూడగానే వెంటేనే అది ఎలా మూత్ర విసర్జన చేస్తుందో అతడిని చూడగానే అదే పనిచేసింది.
తాఫీగా తన కడుపులో భారాన్ని అతడి వీపుపై పోసి తీర్చుకోబోయింది. ఆ వ్యక్తికి టీషర్ట్ సగం తడిసిపోయిన తర్వాత గానీ, సోయి రాలేదు. వెంటనే వెనక్కి తిరిగి తనపై కుక్క చేస్తున్న నిర్వాహకానికి వేగంగా వెళ్లి దాన్ని ఒక్కతన్ను తన్నబోయాడు.. అది తప్పించుకుంది. ఇంతలో అతడు పెంచుకున్న కుక్క వచ్చి వాసన చూడటం మొదలుపెట్టింది. తనపై మూత్ర విసర్జన చేసిన కుక్కవైపు విసుగ్గా చూస్తూ తన టీషర్ట్ రోడ్డుపైనే విప్పేయగా ఆ కుక్క మాత్రం దూరంగా నిల్చొని పల్లికిలించినవ్వుతున్నట్లుగా ఓ లుక్కేసింది.
ఈ వీడియో చూస్తే మీరైనా సరే కడుపుచెక్కలయ్యేలా నవ్వకపోతే ఒట్టు.
Comments
Please login to add a commentAdd a comment