హోటల్ కాదు ‘ఫ్లోటల్’
వింతగా కనిపిస్తున్న ఈ నిర్మాణం ఏంటా అనుకుంటున్నారా.. ఇదో హోటల్. సముద్ర ఉపరితలంపై ఎంచక్కా తేలియాడుతూ.. పర్యాటక ప్రియులకు ఓ అందమైన అనుభూతిని పంచనుంది. దీన్ని ‘మార్ప్ హోటల్’ అని పిలుస్తారు. మధ్యలో హోటల్ ఉండి.. రెండు వైపులా బోట్లు ఉంటాయి. కస్టమర్లను ఒడ్డు నుంచి ఈ హోటల్‌కు తీసుకొచ్చేందుకు ఈ బోట్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. అంతేకాదు హెలికాప్టర్ ఆగేందుకు ఓ హెలీప్యాడ్, స్విమ్మింగ్ పూల్ వంటి సకల సదుపాయాలు ఈ హోటల్ సొంతం.
అయితే ఇది ఇంకా కార్యరూపం దాల్చలేదు. భవిష్యత్‌లో ఈ హోటల్ మన కళ్ల ముందుకు రానుంది. లండన్‌కు చెందిన గియాన్‌లుకా సాంటోసుసో ఈ డిజైన్‌ను రూపొందించారు. దీన్ని మనోడు ముద్దుగా ‘ఫ్లోటల్’ అని పిలుచుకుంటున్నాడు.