వాషింగ్టన్: అమెరికాలో హెచ్–1బీ వీసాపై ఉద్యోగాలు చేస్తున్న ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులేనని ఆ దేశం విడుదల చేసిన అధికారిక నివేదిక ఒకటి తెలిపింది. అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) లెక్కల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 5 నాటికి హెచ్–1బీ వీసాపై పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,19,637 కాగా, వారిలో భారతీయులే 3,09,986 మంది ఉన్నారు. అంటే హెచ్–1బీ వీసాలు పొందినవారిలో 74.3 శాతం మంది భారతీయులే.
ప్రపంచవ్యాప్తంగా హెచ్–1బీ వీసాలు పొందుతున్న వారిలో మహిళలు కేవలం 25 శాతం మాత్రమేననీ, అత్యధిక భాగం వీసాలు పురుషులకే దక్కుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో అయితే ఈ లింగ వ్యత్యాసం ఎక్కువగా ఉందనీ, వీసాలు పొందుతున్న భారతీయుల్లో మహిళల శాతం 20 మాత్రమేనని నివేదిక బయటపెట్టింది.
హెచ్–1బీ వీసా పొందిన 3,09,986 మంది భారతీయుల్లో పురుషులు 2,45,517 మంది ఉండగా, స్త్రీలు 63,220 మందే. భారత్ తర్వాత అధిక హెచ్1బీ వీసాలు దక్కించుకున్న దేశాల్లో కేవలం 11.2 శాతం వీసాలతో చైనా రెండో స్థానంలో నిలవగా.. కెనడా, ద.కొరియా చెరో 1.1 శాతం వీసాలు పొంది తర్వాతి స్థానా ల్లో ఉన్నాయి. మిగిలిన ఏ దేశానికీ ఒక శాతం కన్నా ఎక్కువ వీసాలు మంజూరు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment