ఒక గ్రహం....మూడు సూర్యుళ్లు
వాషింగ్టన్ : భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని బరువు బృహస్పతికి నాలుగు రెట్లు. ఇది మూడు నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది. కాలాన్ని బట్టి ఇక్కడ ప్రతిరోజు మూడు సూర్యోదయాలు, మూడు సూర్యాస్తమయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఒక్కో రోజు మానవ జీవిత కాలం కన్నా ఎక్కువే. నక్షత్రాల గుంపు సెంటారస్‌లో గుర్తించిన ఈ గ్రహానికి హెచ్‌డీ 131399 ఏబీ అని పేరుపెట్టారు. అమెరికాలోని అరిజోనా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు.
ఈ గ్రహం వయసు 1.6 కోట్ల ఏళ్లని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కనుగొన్న అతి పిన్న ఎక్సో గ్రహాల్లో ఇది ఒకటట. ప్రత్యక్షంగాఫొటోలు తీసిన అతి కొద్ది గ్రహాల్లో ఇది ఉంది. దీనిపై ఉష్ణోగ్రత సుమారు 580 డి గ్రీలు. ఒక నక్షత్రం ఉద యిస్తున్నపుడు మరొకటి అస్తమిస్తుంది. ఇలా ఇక్కడ ఏడాదిలో 4వ వంతు స్థిరంగా పగలే ఉంటుంది.