విమానంలో బాంబు అని ఊపిరాగే వేగంతో..
సిప్రస్: విమానాన్ని క్లీన్ చేసే మహిళ చేసిన పొరపాటుకు మొత్తం విమానయాన సంస్థ వణికిపోయింది. విమానంలో ఉన్న ఓ బొమ్మను బాంబుగా భ్రమపడి అధికారులకు చెప్పడంతో వాళ్లంతా భయంతో పరుగులు పెట్టారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించి విమానమంతా సోదాలు చేయించారు. చివరికు అది బాంబు కాదు బొమ్మ అని గుర్తించడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సంఘటన సిప్రస్లో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ కు చెందిన ది ఏజియాన్ ఎయిర్ లైన్స్ విమానం లార్నాకా నుంచి టెల్ అవీవ్ కు వెళుతూ సిప్రస్ లోని విమానాశ్రయంలో దించారు. అనంతరం అక్కడ క్లీనింగ్ సిబ్బంది క్లీన్ చేసేందుకు వెళ్లి అక్కడ ఒక బాక్స్ పై హిబ్రూ భాషలో బూబా అనే పేరు ఉంది. దీని అర్థం బొమ్మ. కానీ, ఆమె అది బాంబు అని తప్పుగా అర్ధం చేసుకొని అధికారులకు చెప్పడంతో వారు అప్పటికప్పుడు ఊపిరి ఆగిపోయేంత వేగంతో స్పందించి అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.