వణికిస్తున్న వరుస తుఫాన్లు | Typhoon Namtheun makes landfall in Japan | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న వరుస తుఫాన్లు

Published Mon, Sep 5 2016 10:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:25 PM

వణికిస్తున్న వరుస తుఫాన్లు

వణికిస్తున్న వరుస తుఫాన్లు

టోక్యో: జపాన్‍ను వరుస టైఫూన్(తుఫాన్‍)లు వణికిస్తున్నాయి. ఈ సీజన్‍లో ఇప్పటికే పదికి పైగా తుఫాన్లు జపాన్ను అతలాకుతలం చేయగా.. తాజాగా నామ్థియన్ తుఫాన్ జపాన్పై విరుచుకుపడుతోంది. ఈ శక్తివంతమైన టైఫూన్ సోమవారం నాగసాకీ పట్టణం సమీపంలో తీరం దాటిందని వాతావరణ సంస్థ వెల్లడించింది. తుఫాను ప్రస్తుతం ఉ‍త్తర ప్రాంతం దిశగా ప్రయాణిస్తుందని తెలిపారు.

నామ్థియన్ టైఫూన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని చోట్ల 150 మిల్లీమీటర్ల వర్షం సైతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతవారం లయన్రాక్ తుఫాను బీభత్సంతో రాత్రికి రాత్రే సంభవించిన వరదల్లో 10 మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement