2017 నాటికి కృత్రిమ రక్తం
లండన్: మూలకణాలతో ప్రయోగశాలలో ఉత్పత్తి చేసిన కృత్రిమ రక్తాన్ని మరో రెండేళ్లలో మనుషులకు ఎక్కించి పరీక్షించనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ‘ఎన్‌హెచ్‌ఎస్(నేషనల్ హెల్త్ సర్వీస్) బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్’ వెల్లడించింది. మూలకణాలతో కృత్రిమరక్తం ఉత్పత్తికి గాను యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు.. పెద్దల నుంచి, బొడ్డు తాడు నుంచి సేకరించిన మూలకణాలతో ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేశారు. తొలిదశలో ఈ రక్తాన్ని 20 మంది వలంటీర్లకు ఐదు నుంచి పది మిల్లీలీటర్ల చొప్పున ఎక్కించి పరీక్షించనున్నట్లు ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది.
కాగా, మూలకణాలతో ప్రయోగశాలలో తయారు చేసిన రక్తాన్ని మనుషులకు వీరు మార్పిడి చేస్తే ఇలాంటి రక్త మార్పిడి ప్రపంచంలో ఇదే తొలిసారి కానుంది. ఈ పద్ధతిలో కృత్రిమ రక్తాన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలిగితే గనక.. రక్తదానాలకు ఇక సరైన దాతల కోసం వేచిచూడాల్సిన అవసరం ఉండదు. తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే కొడవలి కణ రక్తహీనత, థలసీమియా వంటి వ్యాధిగ్రస్తులకూ ఈ పద్ధతి చాలా ప్రయోజనకరం కానుంది.