ప్రధాన వార్తలు

వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. జులై 9న (బుధవారం) వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్ జగన్ పర్యటనలో ‘పార్టీ శ్రేణులు 500 మందికి మించరాదు. రోడ్‌షో, పబ్లిక్ మీటింగ్ పెట్టకూడదు. హెలిప్యాడ్ వద్ద 30 మందికి మించి ఉండకూదు’అని ఎస్పీ మణికంఠ వెల్లడించారు.వైఎస్ జగన్ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల కష్టాలను తెలుసుకునేందుకు స్వయంగా వస్తుండటంతో కూటమి ప్రభుత్వం కంగారు పడుతోంది. ఇప్పటి వరకు మామిడి రైతులను ఆదుకోవడంలోనూ, వారికి మద్దతు ధర కల్పించడంలోనూ చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి, కూటమి పెద్దలు కుట్రలకు దిగారు. బంగారుపాళ్యం పర్యటనపై అనుమతులు ఇచ్చే విషయంలో పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. జగన్ జెండా వదిలేదే లేదు’
పల్నాడు: సత్తెనపల్లి పోలీసులు అమాయకులని, అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి పెడుతున్నారని కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై మండిపడ్డారు మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పేర్ని నానికి సత్తెనపల్లి పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఆయన ఈరోజు(జూలై 7) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘సత్తెనపల్లి పోలీసులు అమాయకులు. అధికార పార్టీ నాయకులు తప్పుడు కేసులు పెట్టమంటే పోలీసులు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొన్నందుకు నాపై కేసు పెట్టారు. పోలీసులు నిన్న మా ఇంటికి నోటీసు అంటించి వెళ్ళిపోయారు. 11 సెక్షన్లతో నామీద నేరం నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు మూడు కార్లు 100 మందిలో నేను ఒక వ్యక్తిని. నా మీద కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోతే బదిలీలు, సస్పెండ్ గాని చేస్తామని అధికార పార్టీ వారు బెదిరిస్తున్నారు. రాష్ట్రంలో సైకో పరిపాలన నరకాసుని పరిపాలన జరుగుతుంది. మహా అయితే బందర్ నుండి సత్తెనపల్లికి కేసులు పెట్టి తిప్పుతారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి జగన్ జెండా వదిలేదే లేదు’ అని పేర్ని నాని స్పష్టం చేశారు.

క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్ తర్వాత 626/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముల్దర్‌తో పాటు వెర్రిన్ (42) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది.

ఇక ఈ బ్యాంక్‌లోనూ మినిమమ్ బ్యాలెన్స్ అక్కర్లేదు..
పేదలు, సామాన్యులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒక్కొక్కటిగా ముందుకువస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే విధించే చార్జీలను రద్దు చేస్తున్నాయి. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ జాబితాలో చేరింది. ప్రామాణిక పొదుపు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఛార్జీలను తొలగించింది.బ్యాంక్ ఆఫ్ బరోడాలో మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల తొలగింపు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మార్పు ప్రీమియం ఉత్పత్తులు మినహా అన్ని సాధారణ పొదుపు ఖాతాలకు వర్తిస్తుంది.కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు ఇటీవలే పొదుపు ఖతాలకు కనీస బ్యాలెన్స్ ఛార్జీలు తొలగించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా అనుసరించింది. ఇక అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ ఆవశ్యకతలను ఎత్తివేస్తూ ఈ దిశగా చర్యలు తీసుకుంది.మినిమమ్ బ్యాలెన్స్ లేని ఖాతాలపై విధిస్తున్న జరిమానాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య చర్చలు కొనసాగుతున్న క్రమంలో ఈ మార్పు చోటు చేసుకుంది. చౌక కరెంట్, పొదుపు ఖాతాల డిపాజిట్ల వాటాలో తగ్గుదలను బ్యాంకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ అంశం దృష్టిని ఆకర్షించింది.

జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం.. అంతా మోహన్ లాల్ సినిమా వల్లే!
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జానకి వర్సెస్ స్టేర్ ఆఫ్ కేరళ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే చిక్కుల్లో పడింది. దీనికి ప్రధాన కారణం ఆ మూవీ టైటిల్. సినిమా టైటిల్లో జానకి పేరు ఉపయోగించడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవికి మరో పేరైన జానకి టైటిల్ మారిస్తేనే సెన్సార్ చేస్తామని నిర్మాతలకు సూచించింది. దీంతో ఈ పంచాయతీ కాస్తా కోర్టుకు చేరింది.అయితే ఈ వివాదంపై నిర్మాత సురేశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ చిత్రం ఎంపురాన్-2 పేరును ప్రస్తావించారు. ఆ సినిమా వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయని ఆరోపించారు. ఎంపురాన్ మూవీ విడుదల తర్వాత వివాదం తలెత్తడంతో సెన్సార్ బోర్డ్ మరోసారి సెన్సార్ చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే సెన్సార్ బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరించిందని.. ఈ సమస్య అంతా ఆ సినిమాతోనే ప్రారంభమైందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉన్నందున మాకు అనుకూలంగానే తీర్పు వస్తుందని భావిస్తున్నట్లు నిర్మాత జి సురేశ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. పృథ్వీరాద్ సుకుమారన్ డైరెక్షన్లో వచ్చిన ఎంపురాన్-2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

దర్శన్ కేసు స్ఫూర్తితో..! కర్ణాటకలో మరో దారుణం
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తన గర్ల్‌ఫ్రెండ్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టాడని ఓ యువకుడు.. మరో యువకుడిపై తన స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నెలమంగళ తాలుకా సోలదేవనహళ్లిలో జరిగిన ఘటన వివరాల్లోకి వెళ్తే.. కుశాల్ అనే కుర్రాడు గతంలో ఓ యువతిని ప్రేమించాడు. అయితే తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కాగా, ఆ యువతి మరో యువకుడితో రిలేషన్ మొదలుపెట్టింది. ఇది భరించలేని కుశాల్.. సదరు యువతికి అసభ్య సందేశాలు పంపాడు. ఈ విషయాన్ని సదరు యువతి తన తాజా ప్రియుడికి చెప్పింది. దీంతో రగలిపోయిన సదరు యువకుడు తన స్నేహితులతో కలిసి కుశాల్‌పై దాడికి పాల్పడ్డాడు. అయితే.. కుశాల్‌ను కిడ్నాప్ చేసి.. ఓ బహిరంగ ప్రదేశంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. పది మంది అతన్ని చుట్టుముట్టి కాళ్లతో, కర్రలతో తన్నారు. బట్టలు విప్పించి.. ప్రైవేట్ బాగాలపై దాడి చేస్తూ హింసించారు. దాడి సమయంలో ఆ యువతి కూడా అక్కడే ఉంది. దాడికి పాల్పడిన టైంలో ఆ గ్యాంగ్ మొత్తం కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి కేసు ప్రస్తావన తెచ్చి మరీ కుశాల్‌పై దాడికి పాల్పడింది. వీడు మరో రేణుకాస్వామి రా అంటూ ఒక్కొక్కరుగా కుశాల్‌ను చితకబాదారు. ఇది కూడా ఆ కేసులాగే ముగుస్తుందంటూ హెచ్చరించారు కూడా. జూన్ 30వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 10 మందిపై సోలదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటిదాకా 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, బెదిరింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.కన్నడనాట చాలెంజింగ్ స్టార్‌గా పేరున్న దర్శన్ నటి పవిత్రగౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో తన అభిమాని అయిన రేణుకా స్వామి అనే వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి.. అత్యంత దారుణంగా హింసించి చంపాడని తెలిసిందే. ఈ ఉదంతం కర్ణాటకను మాత్రమే కాదు.. యావత్ దేశాన్ని కుదిపేసింది. ప్రస్తుతం ఈ కేసులో దర్శన్ బెయిల్ మీద బయట ఉన్నాడు.

నటితో అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో ప్రముఖ నేత కుమారుడి వీరంగం
ముంబై: ముంబైలో కలకలం. మద్యం మత్తులో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) నాయకుడు జావేద్ షేక్ కుమారుడు రాహిల్ జావేద్ వీరంగం సృష్టించాడు. పీకల దాకా మద్యం సేవించి నటి రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కారును ఢీకొట్టి దూర్భలాడాడు. తనతో ఎందుకు ఇలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తే.. ఇదిగో కావాలంటే డబ్బులు తీసుకో అంటూ నటిని బెదిరిస్తున్న వీడియోలో వెలుగులోకి వచ్చాయి.గత ఆదివారం (జూలై 6న) ముంబైలోని అంధేరి ప్రాంతంలో రాహిల్ మోతాదుకు మించి మద్యం సేవించాడు. అంధేరి నుంచి మరో ప్రాంతానికి వెళుతుండగా.. మార్గం మధ్యలో నటి రాజశ్రీ మోరే కారును ఢీ కొట్టాడు. దీంతో రాజశ్రీ.. రాహిల్‌పై వాగ్వాదానికి దిగింది. అర్ధ నగ్నంగా ఉన్న రాహిల్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మా నాన్న ఎవరో నీకు తెలుసా? మహరాష్ట్ర నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు జావెద్ షేక్ అని బెదిరించాడు. ఇరువురి వాగ్వాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో రాహిల్ ఘర్షణకు దిగారు. తాజా సమాచారం ప్రకారం.. రాహిల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.ఇటీవల మరాఠీ భాషను బలవంతంగా తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తనని లక్ష్యంగా చేసుకున్నారని రాజశ్రీ ఆరోపించారు. ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The son of MNS leader Javed Shaikh abuses (in Hindi/Urdu, of course) a Marathi girl after hitting her car. He even mocks her Marathi surname.Let’s see whom the Thackeray brothers choose, a Marathi-speaking Maharashtrian or a Hindi-speaking Muslim. pic.twitter.com/xxamEFlTn7— Mr Sinha (@MrSinha_) July 7, 2025మహారాష్ట్రలో భాషా వివాదం మహారాష్ట్రలో భాషా వివాదం రాజుకుంది. ముంబైలో నివసించే వారు మరాఠీని తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సీనియర్ నాయకుడు సురేశ్ భయ్యాజీ జోషి చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన(యూబీటీ) శ్రేణులు నిరసనలు చేపట్టాయి. దీంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబైతోపాటు మహారాష్ట్ర భాషగా మరాఠీని ఆయన అభివర్ణించారు. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మరాఠీని నేర్చుకుని మాట్లాడి తీరవలసిందేనంటూ స్పష్టంచేశారు. మీ మాతృభాషను మీరు ప్రేమించి, గౌరవిస్తే ఇతర భాషల పట్ల కూడా మీరు అలాగే వ్యవహరిస్తారు అని ఫడ్నవీస్ చెప్పారు.నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలుఈ వివాదంపై నటి రాజశ్రీ మోరే స్పందించారు. మహరాష్ట్రలో మరాఠీ భాషను తప్పనిసరి చేయడంపై సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో.. మరాఠీలు ఎక్కడ ఉన్నా కష్టపడి పనిచేస్తారు. కానీ భాషను రద్దు ప్రయత్నం చేయడం వల్ల వలసదారులు నగరం విడిచిపెడతారని అన్నారు. అదే జరిగితే ముంబైలోని స్థానిక మరాఠీ సమాజం పరిస్థితి మరింత దిగజారిపోతుందని ఆమె హెచ్చరించారు. ఈ ప్రకటనల తర్వాత, నటి రాజశ్రీ మోర్సేపై విమర్శలు వెల్లువెత్తాయి.నేపథ్యంలో, రాజ్శ్రీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మరాఠా భాషపై స్పందించిన వీడియోను డిలీట్ చేశారు. ఎంఎస్ఎన్ మద్దతు దారులు సైతం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అవును.. నేను పాక్ ఆర్మీ ఏజెంట్‌నే: తహవూర్ రాణా
26/11 ముంబయి ఉగ్రదాడుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్ హుస్సేన్ రాణా తన నేరాన్ని అంగీకరించాడు. అంతేకాదు.. పాకిస్తాన్ ఆర్మీకి అత్యంత విశ్వసనీయమైన ఏజెంట్‌గానూ తాను పనిచేశానని విచారణలో వెల్లడించాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సోమవారం ఓ కథనం ప్రచురించింది. ముంబై ఉగ్రదాడుల కేసులో అమెరికా నుంచి అప్పగింత మీద వచ్చిన రాణా.. ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైలులో NIA కస్టడీలో ఉన్నాడు. అయితే ముంబై క్రైమ్ బ్రాంచ్ విచారణలో 2008 ముంబై ఉగ్రదాడుల్లో తన ప్రేమయం ఉన్నట్లు అంగీకరించాడు. అంతేకాదు తాను, తన మిత్రుడు డేవిడ్ హెడ్లీతో కలిసి లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ద్వారా పలు శిక్షణా శిబిరాల్లో పాల్గొన్నట్టు వెల్లడించాడు. లష్కరే తోయిబా కేవలం ఉగ్రవాద సంస్థ మాత్రమే కాదని ప్రధానంగా ఓ గూఢచార సంస్థలా పనిచేస్తుందని తహవూర్ రాణా వెల్లడించినట్లు తెలుస్తోంది. ముంబైలో ఇమ్మిగ్రేషన్ సెంటర్‌ను ఓపెన్ చేయాలన్న ఆలోచన తనదేనని, ఆ కార్యాలయం ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను వ్యాపార ఖర్చులుగా చూపించానని, 2008 నవంబర్‌లో జరిగిన ముంబయి దాడుల సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని, అది ఉగ్రవాదుల ప్రణాళికలో భాగమే అని అంగీకరించాడు. దాడులకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వంటి ప్రదేశాలను స్వయంగా పరిశీలించినట్టు తెలిపాడు. అంతేకాదు.. ఈ దాడులు పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) సహకారంతోనే జరిగాయని తాను నమ్ముతున్నట్లు తహవూర్ రాణా వెల్లడించాడు. ఈ మేరకు ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ముంబై దాడుల్లో తన ప్రమేయం లేదంటూ రాణా ఇప్పటిదాకా బుకాయిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ తాజా విచారణలో తన పాత్రను అంగీకరించడంతో పాటు పాక్ నిఘా వ్యవస్థ ప్రేమయం ఉండొచ్చన్న వ్యాఖ్యలు ఈ కేసును కీలక మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.

బ్రిక్స్‌తో పొత్తు ఉంటే.. ట్రంప్ లేటెస్ట్ వార్నింగ్
బ్రిక్స్ సదస్సు వేళ.. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన ప్రకటన చేశారు. బ్రిక్స్‌తో పొత్తు ఉంటే 10 శాతం అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. బిక్స్ విధానాలు అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆయన.. ఈ అడిషనల్ టారిఫ్‌ల విధింపులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల BRICS దేశాలపై గట్టి హెచ్చరిక జారీ చేశారు. BRICS కూటమి అమెరికా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని ట్రంప్ ఆరోపించారు. BRICSతో పొత్తు పెట్టుకునే ఏ దేశమైనా 10% అదనపు టారిఫ్‌కు గురవుతుందని ప్రకటించారు. ఈ విధానంలో ఏ దేశానికి.. ఎలాంటి మినహాయింపులు ఉండబోదు అని స్పష్టం చేశారు. అయితే బ్రిక్స్‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన ఎందుకు అభివర్ణించారో స్పష్టత లేనప్పటికీ.. .. బ్రెజిల్ రియో డి జనీరో వేదికగా BRICS 2025 సమ్మిట్ జరుగుతున్న వేళ.. ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. తాజాగా BRICS దేశాలు అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులను తీవ్రంగా ఖండించాయి. అమెరికా యుద్ధ చర్యలతో వాణిజ్య ఆంక్షలు వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. అంతేకాదు.. అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రస్తావించకుండానే.. ప్రతీకార సుంకాలు, బెదిరింపులను ఖండిస్తూ రియో డి జనీరో డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. ఇందులో.. BRICS నేతలు ఏకపక్ష టారిఫ్ విధానాలను తీవ్రంగా ఖండించారు ఈ సుంకాలు WTO నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నిర్ణయాలు.. ప్రపంచ వాణిజ్య స్థిరత్వాన్ని ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించారు.BRICS 2009లో ఏర్పాటైంది. భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేసియా, ఇరాన్.. సభ్య దేశాలుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం 11 సభ్య దేశాల కూటమి జనాభా.. ప్రపంచ జనాభాలో సుమారు 49.5% (దాదాపు 3.93 బిలియన్ మంది) కలిగి ఉంది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (GDP) సుమారు 40% వాటా కలిగి ఉన్నాయి. అంతేకాదు.. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 26% వాటా BRICS దేశాలదే.ట్రంప్ ఇప్పటికే 12 దేశాలకు టారిఫ్ నోటీసులు సిద్ధం చేశారని తెలిపారు. అమెరికా టారిఫ్ మినహాయింపు 90 రోజుల గడువు ముగుస్తుండడంతో.. ఈ నిర్ణయం జూలై 9న అమలులోకి వచ్చే అవకాశం లేకపోలేదనే చర్చ మొదలైంది. అయితే..ఆగస్టు 1 నుంచి నూతన వాణిజ్య సుంకాలు: అమెరికా నూతన సుంకాలు జులై 9 నుంచి అమల్లోకి వస్తాయని గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అవి ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తాజాగా అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలను నిర్ణయించే పనిలో ట్రంప్ నిమగ్నమై ఉన్నారని వెల్లడించారు.

జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది
అధిక బరువుకు కారణాలనేకం. జీవన శైలి, ఆహార అలవాట్లు, కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. అయితే ‘‘చిన్నప్పటినుంచీ నేనింతే’’ అని కొంతమంది సరిపెట్టుకుంటే, మరికొంతమంది మాత్రం భిన్నంగా ఉంటారు. అధిక బరువుతో వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా అయితేనే నేమి, అందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరికతోనేమి కష్టపడి శరీర బరువును తగ్గించు కుంటారు. అలా జిమ్ కెళ్లకుండానే 95 కిలోల వెయిట్ నుంచి 65 కిలోలకు చేరుకుందో యవతి. అదెలాగో తెలుసుకుందాం.ఇది ఉదితా అగర్వాల్ వెయిట్ లాస్ జర్నీ. బరువు తగ్గడం అనేది కష్టమైన ప్రయాణం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ బరువు తగ్గాల్సి వస్తే ఇంకా కష్టం. అందుకే కారణాలను విశ్లేషించుకుని నిపుణుల సలహాతో ముందుకు సాగాలి. అలా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అయిన ఉదితా అగర్వాల్ కేవలం ఫిట్నెస్ కోసం మాత్రమే కాకుండా తన ఆరోగ్యాన్ని మెరుగుపరచు కోవడానికి కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. అద్బుతమైన విజయాన్ని సాధించింది.ఇదీ చదవండి: 300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లుఉదితా చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడేది. దీనికి తోడు పిగ్మెంటేషన్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, విపరీతంగా జుట్టు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద అన్వాంటెడ్ హెయిర్ ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమయ్యేది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలికి మారడం ద్వారా 8 నెలల్లో 30 కిలోల బరువు తగ్గింది. అదీ జిమ్‌కు వెళ్లకుండానే 95 కిలోల బరువున్న ఉదితా 65 కిలోలకు చేరుకుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. View this post on Instagram A post shared by Udita Agarwal (@udita_agarwal20) తన వెయిట్ లాస్ జర్నీ గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది. శుభ్రమైన ఆహారాలు తినడం ద్వారా ఆమె సహజంగానే 30 కిలోల బరువు తగ్గింది. ముఖ్యంగా "బరువు తగ్గడంలో జంక్ ఫుడ్‌ను మానేయడమే అది పెద్ద చాలెంజ్’’ అని ఆమె చెప్పుకొచ్చింది.చదవండి: చిన్నతనం నుంచే ఇంత పిచ్చా, పట్టించుకోకపోతే ముప్పే : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ఉదిత వెయిట్ లాస్లో సాయపడిన అలవాట్లుడీటాక్స్ వాటర్: ప్రతిరోజూ డీటాక్స్ వాటర్ తీసుకునేది. ముఖ్యంగా జీరా, అజ్వైన్, సోంపు, మెంతిని నీటిలో మరిగించి తాగేది. ఇది ఉబ్బరాన్ని నివారించి జీర్ణక్రియకు సహాయపడుతుంది.ఆహారంపై దృష్టి: అప్పుడప్పుడు చీట్ మీల్ తీసుకున్నా.. ఆరోగ్యకరమైన ఆహార నియమాన్ని కచ్చితంగా పాటించేది.ఒక్కోసారి వెయిట్ పెరిగినా నిరాశపడలేదు: ప్రతీ రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండేది. ఒకసారి బరువు పెరిగినా నిరుత్సాహ పడేది కాదు,అసలు ఆ హెచ్చుతగ్గులను పట్టించుకోలేదు.ఇంటి ఫుడ్: ఇంట్లో ఉన్నా, బయటికెళ్లినా, ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినేది. చియా సీడ్ వాటర్: చియా విత్తనాలను అర లీటరు నీటి నాన బెట్టి రోజుకు 3-4 లీటర్ల చొప్పున రోజంతా తాగేది. రోజుకు ఒకసారి టీ, మైదా ఫుడ్‌కు దూరంగా ఉంటూ అతిగా తినకుండా ఉండటానికి ఉదిత ప్రతి భోజనానికి ముందు నీరు త్రాగేది.
విండీస్ ఆటగాడి ఉగ్రరూపం.. 52 బంతుల్లో సుడిగాలి శతకం
‘ఏపీలో ఏడాదిలోనే 5 వేల స్కూళ్లు మూసివేశారు’
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం.. అంతా మోహన్ లాల్ సినిమా వల్లే!
పులివెందులలో వైఎస్ జగన్
ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు
శివభక్తుడు 'కన్నప్ప'ది ఏ ఊరో తెలుసా..?
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఆ మహానుభావుల విలువ తగ్గించకండి సార్!
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
కొడుకు వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
అనంతపురం : గూగూడులో కుళ్లాయిస్వామి ఉత్సవాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా
ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం
జిడ్డు ఆముదమే కానీ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా..! (ఫొటోలు)
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ
భూమిపైకి కుసుమ ఖడ్గం
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
విండీస్ ఆటగాడి ఉగ్రరూపం.. 52 బంతుల్లో సుడిగాలి శతకం
‘ఏపీలో ఏడాదిలోనే 5 వేల స్కూళ్లు మూసివేశారు’
సొంతంగా ఫ్లైఓవర్ కట్టుకుంటున్న రియల్ఎస్టేట్ కంపెనీ
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వివాదం.. అంతా మోహన్ లాల్ సినిమా వల్లే!
పులివెందులలో వైఎస్ జగన్
ఓటీటీలో 'శారీ' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్ర
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
300కు పైగా రైతులకు సాధికారత : తొలి ఏడాదిలోనే రూ. 8.7 కోట్లు
శివభక్తుడు 'కన్నప్ప'ది ఏ ఊరో తెలుసా..?
'మా అమ్మ ప్రెగ్నెన్సీ'.. వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ
ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్నా.. నా బిడ్డలకు తండ్రి లేడు : నటి భావోద్వేగ పోస్ట్
జియో కొత్త ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఏడాది వ్యాలిడిటీ
ఈ రాశి వారికి వ్యాపారాలలో లాభాలు.. ఆకస్మిక ధనలాభం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఎంతో హెచ్చరించా.. వినలేదు.. చివరకు..
వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్
ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
అలాగే, తనకు నోబెల్ వచ్చేటట్లు అర్జంటుగా ఏదైనా ఒక చట్టం చేయమంటున్నారు!!
వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు.. విహాన్ శతకం.. భారత్ భారీ స్కోరు
ఆ మహానుభావుల విలువ తగ్గించకండి సార్!
రౌడీషిటర్‌తో కౌన్సిలర్ వివాహేతర సంబంధం
కొడుకు వీడియో వైరల్.. క్షమాపణలు చెప్పిన విజయ్ సేతుపతి!
వనిందు హసరంగా ప్రపంచ రికార్డు.. వన్డేల్లో తొలి ప్లేయర్‌గా
ఎంతోసేపు పురిటినొప్పులు భరించాక పుట్టావురా.. నటి భావోద్వేగం
'కన్పప్ప'లో వాళ్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చింది: తమ్మారెడ్డి భరద్వాజ
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. సంఘంలో ఆదరణ
భూమిపైకి కుసుమ ఖడ్గం
ఒక్క ఏడాదిలో రూ.8,500 కోట్లు తీసుకొచ్చా..
ఈ రాశి వారికి ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.. పనులు విజయవంతంగా సాగుతాయి.
సినిమా

ఓటీటీలో '8 వసంతాలు'.. నెలలోనే స్ట్రీమింగ్
అందమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం '8 వసంతాలు'.. జూన్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేదు. అయితే, తాజాగా ఓటీటీ విడుదలపై ప్రకటన వచ్చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఒక వర్గం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అనంతిక సానీల్కుమార్(Ananthika Sanilkumar) ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో హనురెడ్డి, రవితేజ దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ మూవీ ఫణింద్ర(Phanindra Narsetti) దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.8 వసంతాలు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. జులై 11న స్ట్రీమింగ్కు రానున్నట్లు అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. రొమాంటిక్ డ్రామా మూవీకి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. '8 వసంతాలు'.. ఈ పేరు వినగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. సినిమా కూడా అందుకు తగ్గట్లే ఉంటుంది. కాకపోతే ఓపికతో చాలా జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదటి సీన్ నుంచి చివరివరకు కొండల మధ్య పారుతున్న నదిలా ఈ సినిమా అలా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ వీకెండ్లో చూడతగిని చిత్రమేనని చెప్పొచ్చు.కథ ఏంటి..?శుద్ధి అయోధ్య(అనంతిక).. ఊటీలో తల్లితో కలిసి జీవిస్తుంటుంది. ఆర్మీలో పనిచేసే తండ్రి చనిపోవడంతో ఆ బాధ నుంచి తేరుకునేందుకు రచయితగా మారుతుంది. కరాటే నేర్చుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా ట్రావెలింగ్ చేస్తుంటుంది. అలాంటి ఈమె జీవితంలోకి వరుణ్(హను రెడ్డి) వస్తాడు. శుద్ధిని ప్రేమలో పడేస్తాడు. కానీ ఓ సందర్భంలో తన స్వార్థం తాను చూసుకుని ఈమెకు బ్రేకప్ చెప్పేస్తాడు. ఆత్మ గౌరవంతో బతికే శుద్ధి ఏం చేసింది? ఈమె జీవితంలో వచ్చిన సంజయ్ (రవి దుగ్గిరాల) ఎవరు? చివరకు శుద్ధి ప్రేమకథకు ఎలాంటి ముగింపు లభించింది అనేది మిగతా స్టోరీ.

చాలా మిస్ అవుతున్నా, కన్నీళ్లు ఆగడంలేదు: రష్మిక
రష్మిక మందన్నా.. సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తోంది. వందకోట్లు, వెయ్యికోట్ల కలెక్షన్ సినిమాలతో బాక్సాఫీస్ క్వీన్‌గా ఇండస్ట్రీనే షేక్ చేస్తోంది. అయితే ఇంతటి భారీ విజయాలను చూస్తున్న రష్మిక (Rashmika Mandanna).. సెలవు దినాల్లో మాత్రం కంటికి ధారగా ఏడ్చేస్తోందట! ఎందుకో రష్మిక మాటల్లోనే చదివేద్దాం.. నాకు ఓ చెల్లి ఉంది. నాకంటే 16 ఏళ్లు చిన్నది. తనకిప్పుడు 13 ఏళ్లుంటాయి. నా కెరీర్ ప్రారంభమైనప్పటినుంచి.. దాదాపు ఎనిమిదేళ్లుగా తనతో గడిపే సమయమే దొరకడం లేదు. తన ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోతున్నాను.మిస్ అవుతున్నా..ఇప్పుడు తను నా హైట్‌కు వచ్చేసింది. ఈ ప్రయాణంలో నేను ఆగకుండా పరిగెడుతూనే ఉన్నానని అర్థమైంది. ఒక్క క్షణం వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఏం మిస్ అవుతున్నానో అర్థమవుతోంది. ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతోంది. నా స్నేహితులను కలిసి చాలాకాలమే అయిపోయింది. వాళ్లు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు నన్నూ పిలిచేవారు. కానీ ఇప్పుడు నాకెలాగో అంత టైం ఉండదని వాళ్లే డిసైడ్ అయి దూరం పెట్టేస్తున్నారు. ఇవన్నీ నన్ను చాలా బాధిస్తున్నాయి. ఎవరూ లేనప్పుడు మనసు తేలిక చేసుకోవడానికి ఏడ్చేస్తున్నాను.బ్యాలెన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నామా అమ్మ ఎప్పుడూ చెప్తుండేది.. వృత్తిలో రాణించాలంటే వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాలి.. అదే వ్యక్తిగత జీవితం కావాలంటే వృత్తిని త్యాగం చేసుకోక తప్పదు అని! నేను రెండింటినీ బ్యాలెన్స్ చేయాలని ప్రయత్నిస్తున్నాను. అందుకోసం ప్రతిరోజు యుద్ధం చేస్తూనే ఉన్నాను అని భావోద్వేగానికి లోనైంది. రష్మిక చివరగా కుబేర సినిమాలో నటించింది. ప్రస్తుతం థామా, ద గర్ల్‌ఫ్రెండ్, మైసా చిత్రాలు చేస్తోంది.చదవండి: ఇంటింటికీ తిరిగి ఛాన్సులివ్వమని అడుక్కున్న హీరో! ఆయన రేంజ్ ఏంటి?

మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్? ఈసారి ఏకంగా..!
నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad).. ఈయన పండించిన హాస్యానికి, చేసిన సినిమాలకు ఫిదా అవ్వని ఫ్యామిలీ ఆడియన్స్ అంటూ ఎవరూ ఉండరనే చెప్పొచ్చు. అంతలా తెలుగు ప్రేక్షకుల గుండెలో స్థానం సంపాదించుకున్న ఈయన ఈ మధ్య వరుసగా నోరు జారుతూ విమర్శల పాలవుతున్నాడు. రాబిన్‌హుడ్ ఈవెంట్లో క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో కమెడియన్ అలీపై అతి చనువుతో బూతులు మాట్లాడుతూ సంబోధించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సహనటులకు కనీస గౌరవం ఇవ్వకుండా స్టేజీపైనే చులకన చేసి మాట్లాడటంతో నటుడిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్పదేపదే నోరు జారుతూ.. తను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను తనే స్వయంగా మంటగలుపుకుంటున్నారు. తాజాగా తానా 24వ మహాసభలకు వెళ్లిన రాజేంద్రప్రసాద్ అక్కడ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది డెట్రాయిటా? లేక బెజవాడా? తెలియట్లేదు. ఉన్నట్లుండి ఓ వ్యక్తి.. అన్నా.. నీ వల్లే బతికేస్తున్నాం అన్నాడు. నా వల్ల బతకడమేంటి? అని అడిగాను. అందుకా అబ్బాయి.. జీవితంపై విరక్తి కలిగినా, ఇంటికి వెళ్లిపోదాం అనిపించినా ఒక్కసారి మీ సినిమాలు చూడగానే అంతా మర్చిపోతున్నాం అన్నాడు. దరిద్రంగా..ఈ మాట నువ్వే కాదు నాయనా.. దివంగత ప్రధాని పీవీ నరసింహరావు గారు కూడా అన్నారు. ఆయన.. పెద్దపెద్ద సూట్‌కేసులు, కేసులు అయితే చివరకు నా సినిమా చూసి స్వాంతన పొందేవారు అని చెప్పుకొచ్చాడు. మాజీ ప్రధాని గురించి ప్రస్తావించేటప్పుడు కేసులు అని చెప్పడం ఏమీ బాగోలేదని పలువురు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అలాగే వెండితెరకు పరిచయమవడానికి ముందు సన్నగా, దరిద్రంగా సత్యసాయిబాబా జుట్టుతో ఉండేవాడిని అని కామెంట్ చేశాడు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి.డప్పు కొట్టుకోవడమే పని1977లో తన కెరీర్ మొదలైందన్న రాజేంద్రప్రసాద్ అప్పుడే తానా కూడా ప్రారంభమైందన్నాడు. ప్రతి ఇంట్లో కంచం, మంచంలాగా రాజేంద్రప్రసాద్ సినిమా కూడా ఉంటుందని సినారె తనతో అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. అంత పెద్ద వేదికపై రాజేంద్రప్రసాద్.. తన గొప్పలు, చేసిన సినిమాల గురించి చెప్పుకుంటూనే ప్రసంగం ముగించాడు.చదవండి: థియేటర్లో చిన్న చిత్రాలు.. ఓటీటీలో 26 సినిమాలు/ సిరీస్‌లు

'కోర్ట్' హీరోయిన్ శ్రీదేవికి గోల్డెన్ ఛాన్స్
'కోర్ట్' సినిమాతో తెలుగమ్మాయి శ్రీదేవి మంచి విజయాన్ని అందుకుంది. హీరోయిన్గా తనకు ఇదే మొదటి సినిమా.. అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. కాకినాడ యువతి శ్రీదేవికి తాజాగా కోలీవుడ్ సినిమా ఛాన్స్ వచ్చింది. తన రెండో సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా జరిగిపోయింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. తొలి సినిమాతోనే మెప్పించిన మన తెలుగమ్మాయి ఇప్పుడు ఏకంగా కోలీవుడ్‌లో అవకాశం రావడంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.కోలీవుడ్ ప్రముఖ నిర్మాతగ 'కేజీఆర్' హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఇప్పటికే ఒక సినిమాలో ఆయన హీరోగా నటిస్తుండగా ఇప్పుడు రెండో సినిమాను ప్రకటించాడు. ఆయనకు జోడీగానే శ్రీదేవి నటిస్తుంది. కేజీఆర్కు నిర్మాతగా తమిళ పరిశ్రమలో మంచి గుర్తింపు ఉంది. గతంలో శివకార్తికేయన్‌తో హీరో, డాక్టర్, అయలాన్ సినిమాలు చేశారు. విజయ్ సేతుపతి కాపే రణసింగంతో పాటు ప్రభుదేవాతో గులేభకావలి వంటి సినిమాలను ఆయన నిర్మించారు. పలు తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ చిత్రాలను కూడా డిస్ట్రిబ్యూటర్‌గా విడుదల చేశారు.Kickstarting the pooja for #MiniStudios' production no.15, #KJR's next, with blessings and good vibes 🙏✨@ministudiosllp @KJRuniverse #ArjunAshokan #SrideviApalla #HarishKumar @AjuVarghesee @Abishek_jg @ashwin_kkumar @REGANSTANISLAUS @GhibranVaibodha @pvshankar_pv pic.twitter.com/hP5PDbtBq6— Mini Studios LLP (@ministudiosllp) July 7, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల రెడ్‌బుక్ అరాచకాలకు హైకోర్టు రెడ్‌సిగ్నల్

మా భూములిచ్చే ప్రసక్తే లేదు... ఏపీ రాజధాని భూ సమీకరణ సభల్లో ఎమ్మెల్యే, అ«ధికారులను తరిమికొట్టిన రైతులు

పాకిస్తాన్‌పై యుద్ధం ఎందుకు ఆపేశారో మోదీ ప్రభుత్వం చెప్పాలి... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్

ఏపీలో గత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యలో పెరుగుదలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రుజువులు అందజేసిన వైఎస్సార్సీపీ... తమ విజ్ఞప్తులపై సీఈసీ సానుకూలంగా స్పందించిందన్న పార్టీ నేతలు

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం

ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం
క్రీడలు

అందని ద్రాక్ష పుల్లన!... ఇంత ఏడుపు దేనికి?
ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes)పై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ఓడిపోయిన తర్వాత ఇలాంటి కుంటిసాకులు చెప్పడం అస్సలు బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘‘అందని ద్రాక్ష పుల్లన’’ అనుకునే ‘నక్క’ మాదిరి వేషాలు వేయొద్దంటూ తమదైన శైలిలో చురకలు అంటిస్తున్నారు. రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.ఎడ్జ్‌బాస్టన్‌లో చరిత్ర తిరగరాస్తూ తొలిసారి ఆతిథ్య జట్టు (IND Beat ENG)పై విజయ ఢంకా మోగించింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి వెయ్యికి పైగా పరుగులు సాధించి.. ఇంగ్లండ్‌ను ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకుని ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.ఉపఖండ పిచ్ మాదిరే ఉందిఈ నేపథ్యంలో ఓటమి అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పందిస్తూ.. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘నిజం చెప్పాలంటే.. ఈ వికెట్ ఉపఖండ పిచ్ మాదిరే ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పరుగులు రాబట్టడం కష్టతరంగా మారింది.పర్యాటక జట్టుకు అలవాటైన పిచ్‌లా మారిపోయిందనిపించింది. భారత బౌలింగ్ దళం తమకు అనుకూలమైన మాదిరి పిచ్‌పై బాగా ఆడింది’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు. కాగా ఉపఖండ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే.పేసర్లకు 18 వికెట్లుఅయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ పొడిగా ఉంటుంది కాబట్టి బంతి టర్న్ అవుతుందనుకున్నా.. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లే 18 వికెట్లు పడగొట్టారు. స్పిన్ ఆల్‌రౌండర్లైన రవీంద్ర జడేజా, వాషింగ్టన్ తలా ఒక్క వికెట్ మాత్రమే తీశారు. దీనిని బట్టి టీమిండియా కొత్త బంతితో ఎంత అద్భుతంగా రాణించిందో అర్థమవుతోంది. అయినప్పటికీ స్టోక్స్ ఇలా పిచ్‌ను సాకుగా చూపి.. టీమిండియా గెలుపును తక్కువ చేసేలా మాట్లాడటం అభిమానులకు రుచించలేదు. దీంతో.. ‘‘ఇంత ఏడుపు దేనికి?.. హుందాగా ఓటమిని అంగీకరించవచ్చు కదా’’ అంటూ అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.వరల్డ్ క్లాస్ టీమ్ ఇక ఏదేమైనా భారత్ వరల్డ్ క్లాస్ టీమ్ అంటూ ప్రశంసించిన స్టోక్స్.. శుమ్‌మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడని కొనియాడటం విశేషం. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ద్విశతకం (269), శతకం (161) బాదగా... పేసర్ ఆకాశ్ దీప్ పది వికెట్లతో చెలరేగాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జూలై 10- 14 మధ్య జరుగనున్న మూడో టెస్టుకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదిక.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు- సంక్షిప్త స్కోర్లు👉భారత్: 587 & 427/6 డిక్లేర్డ్👉ఇంగ్లండ్: 407 & 271👉ఫలితం: ఇంగ్లండ్‌పై 336 పరుగుల తేడాతో భారత్ జయభేరి.చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్

టీమిండియా గెలుపుపై సచిన్ అలా.. కోహ్లి ఇలా..
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా చారిత్రాత్మక టెస్టు విజయం నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి (Virat Kohli) హర్షం వ్యక్తం చేశారు. యువ సారథి శుబ్‌మన్ గిల్ (Shubman Gill)తో పాటు జట్టును అభినందించారు. కాగా ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టీమిండియా తొలిసారి గెలుపు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టు రిటైర్మెంట్ తర్వాత.. తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లిన యువ జట్టు.. ఈ అద్భుతం చేసింది.కెప్టెన్‌గా తొలి టెస్టులో ఓటమిని చవిచూసినప్పటికీ రెండో టెస్టులో మాత్రం శుబ్‌మన్ గిల్.. గత తప్పిదాలను పునరావృతం కానీయలేదు. ఇటు బ్యాటర్‌గా.. అటు సారథిగా అదరగొట్టి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు.ఆకాశ్‌పై ప్రశంసలుఈ నేపథ్యంలో టీమిండియాతో పాటు గిల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందిస్తూ... ‘‘టీమిండియా అద్భుత టెస్టు విజయం సాధించినందుకు నీకు శుభాకాంక్షలు గిల్. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో అదరగొట్టారు.టీమిండియా తన వ్యూహాలతో ఇంగ్లండ్ తమ ఆట తీరును మార్చుకునేలా చేసింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించి గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ అద్భుతం. ఇక ఆకాశ్ దీప్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?!... జో రూట్‌కు అతడు వేసిన బంతిని ‘బాల్ ఆఫ్ ది సిరీస్’గా చెప్పుకోవచ్చు. అంతేకాదు.. జాంటీరోడ్స్ మాదిరి మహ్మద్ సిరాజ్ క్యాచ్ అందుకోవడాన్ని నేనైతే పూర్తిగా ఆస్వాదించాను’’ అని సచిన్ టెండుల్కర్ భారత ఆటగాళ్లను ప్రశంసించాడు.కోహ్లి పోస్ట్ వైరల్మరోవైపు.. విరాట్ కోహ్లి సైతం స్పందిస్తూ.. ‘‘ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాకు గొప్ప విజయం. ఏమాత్రం బెదురులేకుండా ఆడి.. ఇంగ్లండ్‌పై ఆద్యంతం పైచేయి సాధించారు. శుబ్‌మన్ గిల్ బ్యాట్‌తోనూ.. సారథిగా తన వ్యూహాలతోనూ గొప్పగా రాణించాడు.ప్రతి ఒక్కరు గెలుపులో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇలాంటి పిచ్‌పై సిరాజ్, ఆకాశ్ బౌలింగ్ చేసిన తీరును కొనియాడాల్సిందే’’ అని ట్వీట్ చేశాడు. కాగా కోహ్లి పోస్టును ఇప్పటికే ఐదున్నర మిలియన్ల మందిక్షించారు. ఇక టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లిన టీమిండియా.. ఐదు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో గిల్ సేన ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా భారత్ ఐదు సెంచరీలు నమోదు చేసినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్‌లో పరాజయం చవిచూసింది.గిల్ సెంచరీలు.. అదరగొట్టిన ఆకాశ్అయితే, ఎడ్జ్‌బాస్టన్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లూ అదరగొట్టారు. కెప్టెన్ గిల్ డబుల్ సెంచరీ (269), సెంచరీ (161) బాది ముందుండి నడిపించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (55), రిషభ్ పంత్ (65), రవీంద్ర జడేజా (69 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తా చాటారు. దీంతో భారత్ ఇంగ్లండ్‌కు 608 పరుగుల లక్ష్యం విధించగా.. నాలుగో రోజు ఆటలో మూడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టుకు వరణుడు సాయం చేసేలా కనిపించాడు.ఆఖరిదైన ఐదో రోజు వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగుస్తుందేమోనన్న భయాలు నెలకొన్నాయి. అయితే, వాన తెరిపినిచ్చిన తర్వాత పేసర్ ఆకాశ్ దీప్ ఆకాశమే హద్దుగా చెలరేగి వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మొత్తంగా ఆకాశ్ దీప్ ఈ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఏడు వికెట్లతో అతడి తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్While Siraj & Akash Deep tore through England, the umpire had other plans for DSP Siraj… and got the stare of the century. 😤🎥India made history — first Asian team to conquer Edgbaston! 🏰🇮🇳From serious records to serial reactions —Historic win. Hilarious moments. One… pic.twitter.com/jF3q64fpws— Star Sports (@StarSportsIndia) July 6, 2025

రెడ్డి భవానీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ఆసియా యూత్ అండ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన రెడ్డి భవానీకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కాగా విజయనగరం జిల్లాకు చెందిన రెడ్డి భవానీ ఆసియా యూత్ & జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పోటీపడింది. మొత్తంగా 159 కిలోల బరువునెత్తి స్వర్ణం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా రెడ్డి భవానీకి.. వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. Hearty congratulations to Reddy Bhavani from Vizianagaram district on her stunning Gold Medal win at the Asian Youth & Junior Championships! Here’s to many more milestones and memorable victories ahead. Keep shining, Bhavani! pic.twitter.com/nNwL5I0QoG— YS Jagan Mohan Reddy (@ysjagan) July 7, 2025

వెస్టిండీస్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా.. సిరీస్ కైవసం
వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా (WI vs AUS 2nd Test) ఘన విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 133 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కంగారూ జట్టు కైవసం చేసుకుంది. కాగా మూడు టెస్టులు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం ఆస్ట్రేలియా వెస్టిండీస్‌కు వెళ్లింది. రెండో టెస్టులోనూఈ క్రమంలో ఇరుజట్ల మధ్య తొలుత టెస్టు సిరీస్ ఆరంభం కాగా.. బార్బడోస్‌లో మొదటి టెస్టు జరిగింది. ఇందులో ఆరంభంలో అదరగొట్టిన విండీస్.. ఆ తర్వాత చెత్త ప్రదర్శనతో 159 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా గ్రెనెడా వేదికగా రెండో టెస్టులోనూ వెస్టిండీస్‌కు భంగపాటే ఎదురైంది.సెయింట్ జార్జెస్ మైదానంలో మరోసారి బ్యాటర్ల వైఫల్యం కారణంగా విండీస్... ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడింది. మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం నాటి ఆట సందర్భంగా.. ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది వెస్టిండీస్.143 పరుగులకు ఆలౌటైఓపెనర్లు క్రెయిగ్ బ్రాత్‌వైట్ (7), జాన్ కాంప్‌బెల్ (0)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ కేసీ కార్టీ (10) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రాండన్ కింగ్ (14)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ షాయీ హోప్ (17), జస్టిన్ గ్రీవ్స్ (2) చేతులెత్తేశారు.ఇక కెప్టెన్ రోస్టన్ ఛేజ్ (34) విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్లు అల్జారీ జోసెఫ్ 13, షమార్ జోసెఫ్ 24, జేడన్ సీల్స్ 8 పరుగులు చేశారు. ఆండర్సన్ ఫిలిప్ 11 పరుగులతో అజేయంగా ఉన్నాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 34.3 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైన విండీస్.. 133 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్ (Nathon Lyon) మూడేసి వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) రెండు, కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ చెరో వికెట్ కూల్చారు. ఇక అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 221/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 71.3 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (71; 7 ఫోర్లు, 1 సిక్స్), కామెరాన్ గ్రీన్ (52; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఈ సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఈనెల 13 నుంచి కింగ్‌స్టన్‌లో జరుగుతుంది. వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు👉వేదిక: సెయింట్ జార్జెస్, గ్రెనెడా👉టాస్: ఆస్ట్రేలియా- తొలుత బ్యాటింగ్👉ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 286👉విండీస్ తొలి ఇన్నింగ్స్: 253👉ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 243👉విండీస్ రెండో ఇన్నింగ్స్: 143👉ఫలితం: 133 పరుగుల తేడాతో విండీస్‌పై ఆసీస్ గెలుపు.. సిరీస్ 2-0తో కైవసం👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అలెక్స్ క్యారీ (63, 30 రన్స్).చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
బిజినెస్

రిటర్నులు ఎవరు వేయక్కర్లేదంటే..
2025 సంవత్సరం మొదలైందంటే 31.3.2025 నాటి కల్లా ప్లానింగ్, సేవింగ్స్, టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ టాక్స్ చెల్లింపులు... అలాగే 1.4.2025 దాటిదంటే రిటర్ను వేయడానికి సన్నద్ధం కావాలి. ఏ ఫారం వేయాలి. గడువు తేదీ ఏమిటి..? ఎంత పన్ను చెల్లించాలి..? ఇలా ఉంటాయి అందరి అలోచనలు. ఈ వారం టాక్స్ కాలంలో వ్యక్తులు ఏయే సందర్భాలలో రిటర్నులు వేయనక్కర్లేదో వివరంగా తెలుసుకుందాం.టాక్స్‌బుల్ ఇన్‌కం లిమిట్ దాటని వ్యక్తులు నికర ఆదాయాన్ని టాక్స్‌బుల్ ఇన్‌కం అంటారు. నికర ఆదాయం టాక్సబుల్ ఇన్‌కం లిమిట్ లోపల ఉంటే రిటర్నులు వేయాల్సిన పనిలేదు. ఇది మీకు తెలిసిన విషయమే. కొత్త విధానంలో ఏ వయసువారికైనా బేసిక్ లిమిట్ రూ.3 లక్షలుగా ఉంటుంది. వయసు బట్టి మార్పు లేదు. కానీ పాత విధానంలో మార్పులు ఉన్నాయి. ఈ బేసిక్ లిమిట్ లోపల పన్నుభారం ఉండదు. అయితే కొత్త విధానంలో రిబేటుని ఇస్తారు. అంటే పన్ను భారంలోంచి తగ్గిస్తారు. ఆదాయంలోంచి కాదు. రిబేటుని రూ.60,000కు పెంచడం వలన రూ.12 లక్షల లోపల ఆదాయం ఉన్నవారికి పన్ను పడదు.కేవలం బ్యాంకు వడ్డీ / పెన్షన్ ఉండి, ఎటువంటి టీడీఎస్ లేకపోతే... మీ ఆదాయం కేవలం వడ్డీ అనుకొండి. సేవింగ్స్ అకౌంట్స్ కానీ ఎఫ్డీలు కానీ లేదా పెన్షన్ కానివ్వండి లేదా ఈ రెండు కలిపి కానివ్వండి.. వెరసి మొత్తం టాక్సబుల్ ఇన్‌కం దాటకూడదు. అలాగే డివిడెండ్లు, టీడీఎస్ ఉండకూడదు. అటువంటి వారు నిశ్చింతగా ఉండొచ్చు. ఇదే ఉదాహరణలో టీడీఎస్ ఉంటే రిటర్ను వేయాలి.గృహిణులు, విద్యార్థులు కూడా వేయనవసరం లేదు. ఇంటి నిర్వహణ నిమిత్తం భర్త తన టాక్సబుల్ ఇన్‌కం నుంచి లేదా మిహాయింపు రశీదులో ఎంత ఇచ్చినా పన్ను పడదు. పోపుల డబ్బాలో మిగిలిన మొత్తానికి పన్ను ఉండదు. అలాగే పిల్లలకు ఇచ్చిన పాకెట్ మనీకి కూడా పన్ను పడదు.ఎన్నారైలకు ఇండియాలో టాక్స్‌బుల్ ఇన్‌కం లిమిట్ రూ.2.50 లక్షల లోపల ఉంటే రిటర్ను వేయక్కర్లేదు.సీనియర్స్ సిటిజన్లు... కానీ షరతులకు లోబడి సెక్షన్ 194 ... ఇదొక వరం లాంటిది. కానీ అందరూ లబ్ధిదారులు కాదు. 75 సంవత్సరాలు దాటిన వారికి వర్తిస్తుంది.రెసిడెంటు అవ్వాలి75 సంవత్సరాలు లేదా అంతకుపైబడిన వారికి మాత్రమేఆదాయంలో కేవలం పెన్షన్, ఒకే బ్యాంకు అకౌంటులోని వడ్డీ ఉండాలి. ఒకే బ్యాంక్ అకౌంటు ఉండాలి. అది కూడా నిర్దేశిత బ్యాంకు అయ్యి ఉండాలి. అందులోనే పెన్షన్ జమ అవ్వాలిపెన్షన్+వడ్డీ మీద టీడీఎస్... ఆ బ్యాంకు లెక్కించి రికవరీ చేయాలిబ్యాంకు 80 ఇ, 80 ఈ మొదలైన డిడక్షన్లు పరిగణలోకి తీసుకుంటుంది. ఇదీ చదవండి: పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలుఈ వెసులుబాటు మాత్రం ఎంగిలి చేత్తో కాకిని తోలినట్లే కొద్ది మందికే ఉపయోగపడవచ్చు. దానిని వక్రీకరించి చాలామంది, 75 ఏళ్ల వారికి పన్ను లేదని పిడివాదన చేస్తుంటారు. అది నమ్మకండి.

పసిడి ప్రియుల్లో మళ్లీ ఆశలు.. పడుతున్న ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర(Today Gold Rate) ఈ రోజు వినియోగదారులకు ఊరట కల్పించింది. క్రితం ముగింపుతో పోలిస్తే సోమవారం బంగారం ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా (Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

అధిక రాబడులకు మార్గం!
ఈక్విటీ పెట్టుబడుల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో అధిక రాబడులు కోరుకునే వారు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు తప్పకుండా చోటు కల్పించుకోవాలి. పెట్టుబడులు అన్నింటినీ స్మాల్ క్యాప్స్‌లో కాకుండా.. తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా కేటాయింపులను నిర్ణయించుకోవాలి. చిన్న కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువ. కానీ, బలమైన ఆర్థిక మూలాలతో, మంచి వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునే చిన్న కంపెనీలు దీర్ఘకాలంలో మధ్య స్థాయి, బడా కంపెనీలుగా అవతరించగలవు. అటువంటి గొప్ప కంపెనీలను ముందుగా గుర్తించే నైపుణ్యాలు రిటైల్ ఇన్వెస్టర్లలో సాధారణంగా ఉండవు. కనుక ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ పెట్టుబడుల కోసం మ్యూచువల్ ఫండ్స్‌పై ఆధారపడడం మెరుగైన నిర్ణయం అవుతుంది. ఈ విభాగంలో క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి రాబడులను అందిస్తోంది.రాబడులుఈ పథకం గడిచిన ఏడాది కాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ అద్భుతమైన రాబడులను అందించినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఏటా 33 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. ఐదేళ్లలో ఏటా 46 శాతం, ఏడేళ్లలో 27.60 శాతం, పదేళ్లలో 21 శాతం చొప్పున వార్షిక రాబడుల చరిత్ర ఈ పథకంలో నమోదైంది. ఇదే కాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే 10–12 శాతం వరకు వివిధ కాలాల్లో అధిక రాబడి వచ్చింది. ఈ పథకం 1996లో ప్రారంభమైంది. గతంలో క్వాంట్ ఇనకమ్ ఫండ్ పేరుతో కొనసాగింది. ఆరంభం నుంచి ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే 14.43 శాతం ఎక్స్ఐఆర్ఆర్ రాబడి ఆధారంగా రూ.4.08 కోట్లు సమకూరేది. పెట్టుబడుల విధానం..‘క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ తాను అనుసరించే డైనమిక్ అస్సెట్ అలోకేషన్ విధానం కారణంగా అధిక ఆల్ఫాతో బలంగా నిలబడగలిగింది. అలాగే స్టాక్స్ ఎంపిక కోసం అనుసరించే చురుకైన విధానాలు, అదే సమయంలో సానుకూల మార్కెట్ పనితీరుతో మంచి పనితీరు చూపించింది. అధిక వృద్ధి అవకాశాలు కలిగిన కంపెనీలను ముందుగానే గుర్తించే సామర్థ్యం ఫండ్ మేనేజర్లలో ఉండడం అనుకూలించింది’ అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి తెలిపారు. అయినప్పటికీ చిన్న కంపెనీలు స్వల్ప కాలంలో దిద్దుబాట్లకు గురవుతుంటాయని.. లిక్విడిటీ సమస్య కూడా ఉంటుందన్నారు. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించిన వారికి మెరుగైన రాబడులు వస్తాయని సూచించారు. ప్రధానంగా అధిక వృద్ధి సామర్థ్యాలను, రంగాల వారీ సానుకూల సైకిల్స్‌ను ఫండ్ మేనేజర్లు ఆరంభ దశలో గుర్తించి ఆయా స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా మెరుగైన రాబడుల దిశగా ప్రయతి్నంచడం ఈ పథకంలో గుర్తించొచ్చు. అధిక రిస్క్ ఉన్న వారికే ఈ తరహా స్మాల్‌క్యాప్ ఫండ్స్ అనుకూలమన్నది మర్చిపోవద్దు.ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల మేళా పోర్ట్ఫోలియోప్రస్తుతం రూ.28,205 కోట్ల పెట్టుబడులు ఈ పథకం నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 92.78 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, డెట్ సాధనాల్లో 1.44% పెట్టుబడులు ఉన్నాయి. 5.79% మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పేరుకు స్మాల్‌క్యాప్ ఫండ్ అయినప్పటికీ స్మాల్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు ప్రస్తుతం 31% మేరే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 43% మేర ఇన్వెస్ట్ చేయగా, లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 24% మేర ఎక్స్పోజర్ కలిగి ఉంది. అయితే ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల విలువలు గరిష్ట స్థాయిలకు చేరినందున ఎక్స్పోజర్ తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఆయా విభాగాల వ్యాల్యూషన్ల ఆధారంగా ఈ పెట్టుబడులను మారుస్తుండడం గమనించొచ్చు. అత్యధికంగా 17.56% పెట్టుబడులను ఇంధన రంగ, యుటిలిటీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 16%, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 15%, హెల్త్ కేర్ కంపెనీల్లో 14% చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది.

యూఎస్‌తో వాణిజ్య ఒప్పందంపై ఫోకస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:20 సమయానికి నిఫ్టీ(Nifty) 38 పాయింట్లు తగ్గి 25,423కు చేరింది. సెన్సెక్స్(Sensex) 126 ప్లాయింట్లు నష్టపోయి 83,313 వద్ద ట్రేడవుతోంది.మార్కెట్ల గమనాన్ని నిర్దేశించే పలు కీలక సంఘటనలు ఈ వారంలో చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ వార్‌పై కీలక ప్రకటన వెలువడనుంది. అనేక దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలకు 90 రోజుల సస్పెన్షన్ గడువు జూలై 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు యూఎస్‌తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకోగా.. భారత్ కూడా వాణిజ్య చర్చల్లో తలమునకలైంది. ఈ సంప్రదింపులు విజయవంతమై, డీల్ గనుక కుదిరితే మార్కెట్ సెంటిమెంట్ మరింత పుంజుకుంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఫ్యామిలీ

ఉత్సుకతను రేకెత్తించే పర్యాటక ప్రదేశాలు.. కానీ అక్కడకు నో ఎంట్రీ..
నిషిద్ధ ప్రదేశాలు ప్రపంచంలోని చాలా దేశాల్లో పర్యాటకులను ఆకట్టుకునే ప్రదేశాలు అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని ప్రదేశాలను చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ఎవరికి ఎంత ఆసక్తి ఉన్నా, ప్రపంచంలోని కొన్ని ప్రదేశాల్లోకి అడుగు పెట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే, అవి నిషిద్ధ ప్రదేశాలు. ప్రపంచంలోని కొన్ని ప్రసిద్ధి పొందిన నిషిద్ధ ప్రదేశాల గురించి, వాటి నిషేధ కారణాల గురించి తెలుసుకుందాం.బొహీమియన్ గ్రోవ్అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని మాంటిరియోలో ఉన్న రహస్య ప్రదేశం ఇది. ఇదొక ‘పెద్దమనుషుల’ క్లబ్. సభ్యులకు తప్ప అన్యులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం. చాలా క్లబ్బుల కార్యకలాపాలు అప్పుడప్పుడు వార్తా కథనాల ద్వారా ప్రపంచానికి తెలుస్తూ ఉంటాయి. ఈ క్లబ్బు గురించిన వార్తలేవీ బయటకు రావు. హెన్నీ ఎడ్వర్డ్స్ అనే రంగస్థల నటుడు 1872లో ఈ క్లబ్బును నెలకొల్పాడు. దాదాపు 2700 ఎకరాల ప్రాంగణంలో ఉన్న ఈ క్లబ్బులోకి సభ్యులు కానివారు ప్రవేశించడానికి వీల్లేదు. ఈ క్లబ్బులో 2500 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో సభ్యత్వం కోసం చాలామంది ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ ఉంటారు. ఇందులో సభ్యులు బస చేయడానికి, విందు వినోదాలు జరుపుకోవడానికి విలాసవంతమైన ఏర్పాట్లు ఉంటాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, అమిత సంపన్నులైన వ్యాపారవేత్తలు, హాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఇందులో సభ్యత్వం పొందగలరు. ఈ క్లబ్బులో క్లింట్ ఈస్ట్‌వుడ్, రొనాల్డ్ రీగన్, జార్జ్ డబ్ల్యూ బుష్ వంటి ప్రముఖులు సభ్యులుగా ఉండేవారు. సామాన్య పౌరులకు, పర్యాటకులకు ఇందులో ప్రవేశం నిషిద్ధం.సర్పద్వీపంబ్రెజిల్ తీరానికి దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఉందీ సర్పద్వీపం. ఇక్కడ అసంఖ్యాకంగా విషస్పరాలు తిరుగుతూ ఉంటాయి. ఈ దీవి అసలు పేరు ‘ఇలా ద క్వీమాడా గ్రాండె’. ఈ దీవిలో అడుగడుగునా పాములు ఉండటం వల్ల దీనికి ‘స్నేక్ ఐలండ్’ అనే పేరు వచ్చింది. ఈ దీవి విస్తీర్ణం 4.30 లక్షల చదరపు మీటర్లు. ఇందులో ప్రతి చదరపు అడుగుకు ఒక పాము చొప్పున కనిపిస్తాయి. ఇక్కడ తిరిగే పాముల్లో ‘పిట్ వైపర్’ వంటి అత్యంత ప్రమాదకరమైన పాములు కూడా ఉంటాయి. ‘పిట్ వైపర్’ కాటు వేస్తే, గంట లోపే ప్రాణాలు పోవడం ఖాయం. పాముల కారణంగానే ఈ దీవిలోకి మనుషులకు ప్రవేశం నిషిద్ధం. బ్రెజిల్ పౌరులు గాని, పర్యాటకులు గాని పొరపాటుగానైనా ఈ దీవి వైపుగా వెళ్లరు.సర్‌ట్సీ దీవిభూమ్మీద కొత్తగా ఏర్పడిన దీవి ఇది. ఐస్లండ్ దక్షిణ తీరానికి ఆవల అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఈ దీవి 1963లో సముద్ర గర్భంలో సంభవించిన అగ్నిపర్వతం పేలుడు ఫలితంగా ఏర్పడింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతం పేలినప్పుడు దాదాపు ముప్పయివేల అడుగుల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మింది. ఇది జరిగిన నాలుగేళ్లకు సముద్రజలాల ఉపరితలంపై లావా గడ్డకట్టి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఈ చిన్నదీవి ఏర్పడింది. ఐస్లండ్ ప్రభుత్వం దీనిని ప్రకృతి సంరక్షణ కేంద్రంగా ప్రకటించి, ఈ దీవిలో మొక్కలు, జంతువుల పెరుగుదలపై పరిశోధనలు చేపడుతోంది. యునెస్కో దీనిని 2008లో ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించింది. అగ్నిపర్వతం పేలుడు కారణంగా ఈ దీవి ఏర్పడటంతో, దీనికి ‘నార్స్’ ప్రజల అగ్నిదేవుడైన ‘సర్‌ట్సీ’ పేరు పెట్టారు. ఇందులో పర్యాటకులకు, పౌరులకు ప్రవేశం నిషిద్ధం.గ్లోబల్ సీడ్ వాల్ట్ఇది ప్రపంచదేశాల విత్తనాల ఖజానా. నార్వే దేశానికి, ఉత్తర ధ్రువానికి మధ్య మంచుకొండలతో నిండి ఉండే స్వాల్బార్డ్ దీవిలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విత్తనాల ఖజానా. వేలాది తిండిగింజలు, ఇతర పంటలకు చెందిన విత్తనాలు, నాలుగువేలకు పైగా వృక్షజాతులకు చెందిన విత్తనాలు ఇందులో భద్రంగా పదిలపరచి ఉన్నాయి. ప్రకృతి బీభత్సాల వల్ల గాని, యుద్ధ వినాశనాల వల్ల గాని ప్రపంచంలో ప్రళయోత్పాతంలాంటి పరిస్థితులు ఏర్పడితే, దీనిలో భద్రపరచిన విత్తనాలను పంపిణీ చేయడం ద్వారా పరిస్థితులను చక్కదిద్దే ఉద్దేశంతో దీనిని నెలకొల్పారు. నార్వే ప్రభుత్వం 12.7 మిలియన్ డాలర్ల (రూ. 110.2 కోట్లు) ఖర్చుతో దీనిని మరింతగా పటిష్టపరచింది. సంబంధిత శాస్త్రవేత్తలు, రక్షణాధికారులకు తప్ప మరెవరికీ దీనిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు.రెడ్ జోన్ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలో దాదాపు 1200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశాలను అక్కడి ప్రభుత్వం ‘రెడ్ జోన్’గా ప్రకటించింది. కొద్దిమంది సైనిక సిబ్బంది తప్ప ఇతరులెవరూ ఈ ప్రదేశాల్లోకి అడుగుపెట్టడం నిషిద్ధం. మొదటి ప్రపంచయుద్ధానికి ముందు ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ పచ్చని పంట పొలాలతో కళకళలాడేవి. మొదటి ప్రపంచయుద్ధంలో ఈ ప్రాంతంలో బాంబు దాడులు, ఫిరంగి దాడులు జరగడంతో ఇక్కడ ఉన్న చెట్టూ చేమా కూడా తీవ్రంగా నాశనమైపోయాయి. ఇక్కడ పడిన బాంబుల్లో కొన్ని పేలనివి కూడా ఉంటాయి. ఇవి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. మొదటి ప్రపంచయుద్ధం 1918లో ముగిసిన తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వం ఇక్కడి గ్రామస్థులను ఇతర ప్రదేశాలకు తరలించి, ఈ ప్రాంతాన్ని ‘రెడ్ జోన్’గా ప్రకటించి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలోని నేలను తిరిగి యథాతథ స్థితికి తీసుకువచ్చేందుకు ముమ్మరంగా పనులు సాగిస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న పనులు ఇలాగే కొనసాగితే, ఈ ప్రాంతంలోని భూమి వ్యవసాయయోగ్యంగా మారడానికి మరో మూడు నుంచి ఏడు శతాబ్దాలు పట్టవచ్చని అంచనా.మిర్నీ వజ్రాల గనిరష్యాలోని తూర్పు సైబీరియా ప్రాంతంలో ఉన్న వజ్రాల గని ఇది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ నిర్మిత బిలం. దీనిని ‘మిర్ మైన్’ అని కూడా అంటారు. దీని లోతు 1700 అడుగులు. సోవియట్ హయాంలో ఈ ప్రదేశంలో 1955లో వజ్రాల నిక్షేపాలు బయట పడ్డాయి. అప్పటి సోవియట్ అధినేత జోసెఫ్ స్టాలిన్ ఇక్కడ గని తవ్వడానికి ఆదేశాలు జారీ చేశారు. సోవియట్ 1991లో విడిపోయిన తర్వాత ఏర్పడిన రష్యా ప్రభుత్వం కూడా ఇక్కడ 2001 వరకు ఉపరితల ఖనిజ నిక్షేపాల వెలికితీత కొనసాగించింది. రష్యా ప్రభుత్వం ఇప్పటికీ ఇక్కడ భూగర్భంలో గని తవ్వకాలను రహస్యంగా కొనసాగిస్తోందని చెబుతారు. ఈ ప్రదేశం గురించి రకరకాల వదంతులు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ గనికి ఎగువనున్న గగనతలం మీదుగా విమానాలు గాని, హెలికాప్టర్లు గాని ఎగరవు. ఇదివరకు దీని మీదుగా ఎగిరిన హెలికాప్టర్లు కొన్ని దిగువవైపుగా సాగే గాలి ఒత్తిడి వల్ల గని లోపలికి లాక్కుపోయాయని చెప్పుకుంటారు. అయితే, దీనికి సంబంధించిన ఆధారాలేవీ లేవు. ఈ గని పరిసరాల్లోకి అడుగుపెట్టడానికి గని కార్మికులకు, సంబంధిత అధికారులకు తప్ప ఇతరులెవరికీ అనుమతి ఉండదు. సామాన్యులకు ఇది నిషిద్ధ ప్రదేశం. (చదవండి: విపత్తు మిగిల్చిన విషాదం..! పాపం అనాథగా ఆ చిట్టితల్లి..)

బుక్స్, బ్యాగ్స్ కాదు... మనసు సిద్ధం చేయాలి!
ప్రతి ఏడాది జూన్‌లో పాఠశాలలు మొదలవుతాయి. పుస్తకాలు, యూనిఫామ్‌లు, స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిళ్లు కొనడంలో తల్లిదండ్రులు దుకాణాల వద్ద బిజీగా ఉంటారు. కాని, ఈ హడావుడిలో మర్చిపోయే విషయం ఒక్కటే– ‘స్కూలుకు బిడ్డ మనసు సిద్ధంగా ఉందా లేదా?’వేసవి సెలవుల సరదాను వదిలి బయటకు రావడం, కొత్త క్లాసులో కొత్త టీచర్లు ఎలా ఉంటారో? అనే ఆందోళన, మళ్లీ మార్కుల ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం చిన్నారుల మనసులో ఆందోళన రేకెత్తిస్తుంటాయి. పిల్లలు భయపడ్డప్పుడు వారి మెదడులోని అమిగ్డాలా (భయ కేంద్రం) తీవ్రంగా స్పందిస్తుంది. అది వారు నిర్ణయం తీసుకునే, జ్ఞాపకాలను నిలుపుకునే ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ను బంధించి వేస్తుంది. ఫలితంగా వారి మెదడు కొత్త విషయాలను గ్రహించలేదు.భావోద్వేగ భద్రత ఉన్న పిల్లలు మాత్రమే చదువులో, స్వభావంలో, జీవిత గమ్యంలో ముందుకు వెళ్లగలుగుతారని ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ యూనివర్సిటీలోని డెవలపింగ్ చైల్డ్ సెంటర్ అధ్యయనంలో వెల్లడైంది. అందుకోసం ఈ ఐదు సూత్రాలను పాటించండి... 1. వాళ్ల భయాలను గౌరవించండికొత్త విషయాలు మొదలయ్యేప్పుడు భయపడటం సర్వసాధారణం. అది తప్పు కాదు. భావోద్వేగాలను పేరు పెట్టి పలకడం వల్ల మెదడులోని ఎమోషనల్ కేంద్రం శాంతిస్తుందని డాక్టర్ డ్యాన్ సీగల్ చెప్పారు. అందుకే స్కూల్ గురించి పిల్లలతో మాట్లాడటం మొదలుపెట్టండి. ∙‘‘ఈసారి స్కూలుకు సంబంధించి ఏది బాగా నచ్చింది?’’∙‘‘ఏమైనా భయంగా ఉందా?’’∙‘‘ఈసారి నిన్ను నీవు ఎలా మెరుగుపరచు కోవాలని అనుకుంటున్నావు?’’2. ఉదయాల్ని రణరంగం చేయకండిప్రతిరోజూ ఉదయం ‘‘త్వరగా లే! బ్రష్ చేయి! బస్ మిస్ అవుతాం!’’ అని అరవకండి. ఇంటిని రణరంగంగా మార్చకండి. పిల్లల నెర్వస్ సిస్టమ్‌ను శాంతంగా ఉంచేందుకు ఈ చిట్కాలు ఉపయోగించండి. లైట్ మ్యూజిక్ ప్లే చేయండిరెండు నిమిషాలు పక్కన కూర్చుని, ప్రేమను పంచండి. ‘‘ఈరోజు నీ స్టైల్లో మెరిసిపోతావ్’’ అని సానుకూల వాక్యాన్ని పలకండి.3. పాత ఫ్రెండ్స్ ను రీకనెక్ట్ చేయండి‘‘మా ఫ్రెండ్స్ నన్ను గుర్తుపెట్టుకుంటారా?’’, ‘‘ఎవరైనా తోడు ఉంటారా?’’ అనేదే పిల్లలకు ముఖ్యమైన భయం. ఈ భయాన్ని అధిగమించేందుకు ఈ పనులు చేయండి. ఇవి వారి మెదడులో ఆక్సిటోసిన్‌ను పెంచుతాయి. భావోద్వేగ భద్రతను పెంపొందిస్తుంది. స్కూల్ మొదలయ్యే ముందు ఒక ప్లే డేట్ ఏర్పాటు చేయండిఒకరిద్దరు క్లాస్మేట్లతో ఫోన్ ద్వారా మాట్లాడనివ్వండిక్లాసులో నడిచే కొన్ని సన్నివేశాలను రోల్ ప్లే చేయండి4. భావోద్వేగ లక్ష్యాలు కూడా పెట్టండిచాలామంది తల్లిదండ్రులు పిల్లలను ‘‘ఎన్ని మార్కులు వస్తాయి?’’ అని అడుగుతుంటారు. దీనికి బదులుగా భావోద్వేగ లక్ష్యాలను పెట్టండి. అది పిల్లల్లో అంతర్గత ప్రేరణను పెంచుతాయి.‘‘ఈ సంవత్సరం నువ్వు ఎలా అనిపించుకోవాలని అనుకుంటున్నావు?’’‘‘ఎలాంటి స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నావు?’’‘‘నీ గురించి నువ్వు గర్వపడేలా ఏం చేస్తావు?’’5. మీ స్కూల్ అనుభవాలను పంచుకోండిమీరు కూడా స్కూలుకు వెళ్లేటప్పుడు భయపడ్డారని చెప్పండి. ఉదాహరణకు:‘‘ఒకసారి టీచర్ నన్ను బాగా కొట్టింది. అప్పట్లో చాలా కష్టంగా అనిపించింది. కానీ ఆ సంఘటన వల్ల నేను మరింత మృదువుగా మాట్లాడటం నేర్చుకున్నాను’’ అని చెప్పండి. ఇలా చెప్పడం వల్ల బిడ్డ ‘‘నా భావోద్వేగాలు తప్పు కావు’’అన్న భద్రతను పొందుతాడు.ప్రతి రోజు అడగాల్సిన మూడు ప్రశ్నలుమీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ప్రతిరోజూ ఈ మూడు ప్రశ్నలూ అడగండి. ఇవి పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, భావోద్వేగ పరిణతిని, అనుబంధాన్ని పెంచుతాయి.1. ‘‘ఈ రోజు నీకు ఏం నచ్చింది?’’2. ‘‘ఏదైనా బాధించిందా?’’3. ‘‘ఏ విషయం పట్ల నీకు గర్వంగా అనిపించింది?’’చేయకూడనిమూడు పొరపాట్లు1. ‘‘అన్నయ్య/చెల్లెలు ఎలా టాపర్ అయ్యారో చూడు!’’ అంటూ పోల్చవద్దు. ఇది అవమానాన్ని కలిగిస్తుంది.2. ‘’90 శాతం మార్కులొస్తే ఫోన్ కొనిస్తా’’ అని చెప్పొద్దు. ఇది పిల్లల్లో బాహ్య ప్రేరణను పెంచుతుంది. బహుమతుల కోసమే చదవడం అలవాటవుతుంది. 3. పిల్లలను అతి ఎక్కువ ట్యూషన్లతో నింపొద్దు. వారిలో మానసిక అలసట పెరుగుతుంది.సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: ఆ చేదు అనుభవమే స్టార్టప్‌గా అంకురార్పణ..! ఇవాళ అమెరికాలో..)

ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ఇష్టపడే ఫ్యాషన్ ట్రెండ్స్ ఇవే..!
మిస్ ఇండియా ట్యాగ్ ఉన్నా, ఆమె స్టయిల్ మాత్రం ‘హే, నేను మీ పక్కంటి అమ్మాయినే!’ అనే నేచురల్ స్వాగ్తో ఉంటుంది. అదే మీనాక్షి చౌదరి మ్యాజిక్! స్కిన్‌కి మేకప్ కంటే, మినిమలిజమే బెస్ట్ ఫిల్టర్ అంటూ, చిన్న చిరునవ్వుతో మెరిసే మీనాక్షి చెప్పిన కొన్ని స్టయిలింగ్, బ్యూటీ సీక్రెట్స్ మీకోసం.. సింపుల్‌గా ఉంటూనే ప్రతి లుక్‌లోనూ ప్రత్యేకతను కోరుకుంటా. అలాగే, మేకప్ కంటే, స్కిన్కేర్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తా. రోజూ నీళ్లు తాగడం, హెల్దీ డైట్, పడుకునే ముందు మేకప్ రిమూవ్ చేయడం– ఇవే నా బ్యూటీ సీక్రెట్స్. ఎమరాల్డ్ గ్రీన్, రాయల్ బ్లూ, ఫైరీ రెడ్ రంగులు నా ఫేవరెట్. ఇవి వేసుకుంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. – మీనాక్షి చౌదరి.సింగిల్ కింగ్! సాంప్రదాయానికి స్టయిలిష్ లుక్ కావాలంటే, స్టేట్మెంట్ చోకర్ ఉండాల్సిందే!. ఇది మెడకు ఒక మినీ ఆటిట్యూడ్ ఇచ్చే హారం. సాధారణ చోకర్స్ కంటే వివిధ రకాల పూసలు, రత్నాలతోపాటు వైవిధ్యమైన కళాత్మక డిజైన్స్‌తో ఉంటుంది. చూడటానికి చిన్నదిగా కనిపించినా, దీన్ని వేసుకున్న వెంటనే అద్దం ముందు నాలుగు రౌండ్లు తిరగాల్సిందే! ఎందుకంటే, ఈ హారం మిమ్మల్ని ప్రతి యాంగిల్లోనూ చాలా కొత్తగా చూపించగలదు. దీనిని చీరలతో ధరించాలి అనుకుంటే గాఢమైన ముదురు రంగుల చోకర్స్ను ఎంచుకోండి. ఇక ప్లెయిన్ డిజైన్, లైట్ కలర్స్ లెహంగా, కుర్తీలపై కూడా ఇది బాగా నప్పుతుంది. జడ లేదా హై బన్, స్లీకీ బన్ హెయిర్ స్టయిల్‌తో చోకర్స్ని మరింత హైలైట్ చేయొచ్చు. అలాగే మేకప్ మినిమమ్ ఉంటే చోకర్ మరింత బ్రైట్‌గా కనిపిస్తుంది. అయితే, ఈ చోకర్ను వేరే హారాలతో కలపకుండా స్టయిలింగ్ చేసుకోవడంలో జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే, ఇది సింగిల్‌గానే రాయల్‌గా కనిపిస్తుంది. అందుకే, ఇది వేసుకున్న వారి వద్దకు ‘అందంగా లేనేమో’ అనే అనుమానం దరిదాపుల్లోకి కూడా రాదు. జ్యూలరీ బ్రాండ్: కర్ణిక, ధర: రూ. 17,000చీర బ్రాండ్: జాన్కీ ఇండియా, ధర: రూ. 44,800బ్లౌజ్ ధర: రూ. 17,000 (చదవండి: నౌకాదళ యుద్ధ విమానాలు నడపనున్న తొలి మహిళ ఆమె..!)

Infertility : అధిక బరువు ఉంటే ప్రెగ్నెన్సీ రాదా..?
నా బరువు వంద కిలోలు. పెళ్లైయి రెండు సంవత్సరాలు అవుతుంది. కాని, ప్రెగ్నెన్సీ రావటం లేదు. ప్రెగ్నెన్సీ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?– లలిత, కర్నూలు. ఊబకాయం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన సమస్య. మరీ ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పయ్యేళ్ల మధ్య వయస్సు మహిళలలో అధిక బరువు వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నెలసరి క్రమంగా రాకపోవడం, వచ్చినా ఎక్కువ, తక్కువ బ్లీడింగ్ అవటం ఉంటుంది. దీనితో పాటు దీర్ఘకాలిక వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ వంటి ఇతర జబ్బులు కూడా చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. వీటితో ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. దీనికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. అంటే జంక్ ఫుడ్, ఫాస్టఫుడ్, బేకరీ ఉత్పత్తులను ఆహారంగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, తాజా పండ్లు తీసుకోవాలి. వీటితో పాటు రోజుకు కనీసం ముప్పయి నుంచి నలభై నిమిషాలు వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తూ బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన రక్త పరీక్షలు థైరాయిడ్, డయాబెటిస్, హిమోగ్లోబిన్ వంటివి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ సూచించిన మందులను వాడాలి. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ మాత్రలను ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు నుంచే ఉపయోగించడం వలన అధిక బరువు, ఊబకాయం వలన వచ్చే సమస్యలను అధిగమించి ఆరోగ్యకరంగా గర్భందాల్చి, ఆరోగ్యకరమైన శిశువును పొందవచ్చు.ప్రెగ్నెన్సీలో ఓబెసిటీ వల్ల కలిగే సమస్యలు, వాటి పరిష్కారాలను వివరించండి? – శ్రీలలిత, వైజాగ్ఊబకాయంతో బాధపడుతున్న స్త్రీలు గర్భధారణకు ముందు నుంచే తమ బరువును నియంత్రణలోకి తెచ్చుకోవాలి. లేకపోతే ఓబెసిటీ కారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీనివల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. ఫలితంగా గర్భం దాల్చే ప్రక్రియలో ఆటంకం ఏర్పడుతుంది. బరువు నియంత్రణలో లేకపోతే తల్లి ఆరోగ్యంపైనే కాకుండా శిశువు అభివృద్ధిపైనా కూడా ప్రభావం పడుతుంది. గర్భధారణ మొదటి మూడునెలల్లో గర్భస్రావం జరగడం, శిశువులో అవయవ లోపాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా, తల్లికి గర్భధారణ సమయంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు. వీటివలన శిశువు ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పుట్టబోయే బిడ్డ ఎక్కువ లేదా తక్కువ బరువుతో పుట్టడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అప్పుడు కాన్పు సమయంలో సవాళ్లు ఎదురవుతాయి. ఉదాహరణకు, బిడ్డ బరువు ఎక్కువగా ఉండటం వలన సాధారణ కాన్పు సాధ్యపడక, శస్త్రచికిత్స అవసరమవుతుంది. ప్రసవ సమయంలో ఎక్కువ రక్తస్రావం, కుట్లు సరిగ్గా మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అనస్థీషియా సంబంధిత ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా తల్లి అధిక బరువు కారణంగా భవిష్యత్తులో మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో శిశువు నెలలు నిండక ముందే పుట్టి, కొంతకాలం ఇన్‌క్యుబేటర్‌లో ఉంచాల్సి రావచ్చు. అందుకే, గర్భధారణకు ముందు, గర్భధారణ సమయంలో, ప్రసవం తరువాత కూడా బరువును నియంత్రించాలి. గర్భం దాల్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన జాగ్రత్తలు, అవసరమైన రక్తపరీక్షలు, శిశువు ఎదుగుదలపై తగిన స్కానింగ్‌లు చేయించుకోవాలి. పోషకాహార సప్లిమెంట్లు, అవసరమైన మందులు డాక్టర్ సూచించిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అవసరమైతే ఇతర నిపుణుల సలహాలు పాటిస్తూ, ఆరోగ్యవంతమైన ప్రెగ్నెన్సీ జర్నీని ప్లాన్ చేసుకోవచ్చు. డా‘‘ ప్రియదర్శిని, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: హీరో సల్మాన్‌ఖాన్ సైతం విలవిలలాడిన సమస్య..! ఏంటి ట్రెజెమినల్ న్యూరాల్జియా..)
ఫొటోలు


విష్ణు విశాల్- గుత్తా జ్వాలా కుమార్తెకు పేరు పెట్టిన అమిర్ ఖాన్.. ఫోటోలు


హీరోయిన్గా మిత్రా శర్మ.. ఎంతందంగా ఉందో! (ఫోటోలు)


RK Sagar : ‘ది 100’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)


నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ..పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)


గూగూడు కుళ్లాయిస్వామి క్షేత్రం భక్తజన సాగరం (ఫొటోలు)


గోల్కొండ కోటలో ఘనంగా జగదాంబిక అమ్మవారి బోనాలు (ఫొటోలు)


ENG Vs IND 2nd Test : ఇంగ్లండ్‌పై టీమిండియా చారిత్రక విజయం (ఫోటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూలై 06-13)


ప్రిన్స్ చార్లెస్, ఓప్రా విన్ఫ్రే మెచ్చిన ప్రదేశం.. ఫిట్నెస్కి కేరాఫ్ అడ్రస్! (ఫోటోలు)


భార్యతో ద్వారకా తిరుమల వెళ్లిన కమెడియన్ (ఫోటోలు)
అంతర్జాతీయం

‘గ్లోబల్ సౌత్’కు దారుణ అన్యాయం
రియో డీ జనీరో: ప్రపంచ ఆర్థికవ్యవస్థ పురోగతికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్న దక్షిణార్ధ గోళ దేశాలు (గ్లోబల్ సౌత్) కీలక నిర్ణయాలు, ప్రయోజనాల విషయంలో బాధిత దేశాలుగా మిగిలిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికైంది. సదస్సుకు అధ్యక్ష, ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్‌లోని రియో డీ జనీరో నగరంలో ఆదివారం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆరంభమైంది. సదస్సులో భాగంగా ప్లీనరీ సెషన్లో తొలుత బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డసిల్వా మాట్లాడాక మోదీ మాట్లాడారు. అవన్నీ నెట్‌వర్క్‌లేని ఫోన్లే ‘‘ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదపడే గ్లోబల్ సౌత్ దేశాలు చివరకు ద్వంద్వ ప్రమాణాల కారణంగా బాధితదేశాలుగా మిగిలిపోతున్నాయి. అభివృద్ది, వనరుల పంపిణీ, భద్రత వంటి ఏ రంగంలో చూసినా గ్లోబల్ సౌత్ దేశాలకు దక్కేది శూన్యం. వాతావరణ మార్పుల కట్టడికి ఆర్థిక సాయం, సుస్థిరాభివృద్ధి, అధునాతన సాంకేతికత బదిలీ వంటి అంశాల్లో గ్లోబల్‌సౌత్ దేశాలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి అంతర్జాతీయ వ్యవస్థలు, సంస్థలను తక్షణం సంస్కరణల బాట పట్టించి దక్షిణార్ధ గోళ దేశాలకు న్యాయం జరిగేలా చూడాలి. విశ్వ ఆర్థికానికి కీలక భాగస్వామిగా ఉండి కూడా ప్రధాన నిర్ణయాత్మక వేదికలపై గ్లోబల్సౌత్కు స్థానం దక్కడం లేదు. వాటి వాణి వినపడటం లేదు. ఇది ప్రాతినిధ్యం దక్కట్లేదనే మాట కంటే విశ్వసనీయంగా, ప్రభావవంతంగా పనిచేసి కూడా ఎలాంటి ప్రయోజనం, లబ్ధి పొందలేపోవడమే గ్లోబల్ సౌత్ దేశాలకు అశనిపాతమవుతోంది. 20వ శతాబ్దంలో ఆవిర్భవించిన ఎన్నో కీలక అంతర్జాతీయ వ్యవస్థల్లో మూడింట రెండొంతుల జనాభాకు అసలు ప్రాతినిధ్యమే దక్కడం లేదు. గ్లోబల్‌సౌత్ దేశాలు లేకుండా ఇలాంటి వ్యవస్థలన్నీ సిమ్‌కార్డు ఉన్నా నెట్‌వర్క్‌లేని మొబైల్ ఫోన్ లాంటివే’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై సమిష్టి పోరు ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా పోరాడాల్సిన అవసరం చాలా ఉందని మోదీ పిలుపునిచ్చారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై పాక్ ప్రేరేపిత జైషే ముష్కర మఠా జరిపిన పాశవిక దాడిని ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాధినేతలకు ఆయన గుర్తు చేశారు. బ్రిక్స్ వేదికగా ఆ దాడిని మరోసారి ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిచాయని గుర్తు చేసుకు న్నారు. మరోసారి అలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా పాక్‌కు మర్చిపోలేని రీతిలో సైనికంగా గుణపాఠం చెప్పామన్నారు. ఉగ్ర మూలాలను పెకిలించివేయనిదే ప్రపంచ శాంతి అసాధ్యమన్నారు.టైప్రైటర్లతో నేటి సాఫ్ట్వేర్ నడవదు ‘‘సమకాలీన ప్రపంచం, కాలానికి తగ్గట్లుగా మేం మారతాం అని ప్రస్ఫుటంగా తెలియజెప్పేందుకే బ్రిక్స్ కూటమిలోకి కొత్త దేశాలను ఆహ్వానిస్తున్నాం. మా బాటలోనే ఐరాస భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, బహుళజాతి అభివృద్ధి బ్యాంక్‌లు సంస్కరణలను తీసుకొచ్చి తమ చిత్తశుద్ధిని చాటాలి’’ అని మోదీ హితవు పలికారు. కృత్రిమమేధ యుగంలో సాంకేతికత వారం వారం అప్డేట్ అవుతోంది. అలాంటప్పుడు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల్లో ఎప్పటికప్పుడు సంస్కరణల అప్డేట్లు జరగాల్సిందే. 20వ శతాబ్దినాటి టైప్రైటర్లతో 21వ శతాబ్దంలోని అధునాతన సాఫ్ట్వేర్ నడవదు. స్వీయ ప్రయోజనాలకంటే కూడా భారత్ మానవాళి ప్రయోజనాలకే పట్టకడుతుంది. బ్రిక్స్‌దేశాలతో కలిసి సమష్టిగా అన్ని రంగాల్లో నిర్మాణాత్మకమైన ప్రాతినిధ్యం వహించేందుకు మేం సదా సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ అన్నారు.

ఉగ్రవాదుల్ని భారత్‌కు అప్పగిస్తావా?.. నువ్వెలా ప్రకటిస్తావ్?
కరాచీ: ఇరుదేశాల మధ్య నమ్మకాన్ని చూరగొనే ప్రక్రియలో భాగంగా ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్‌లను భారత్‌కు అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ మాజీ విదేశాంగమంత్రి, పీపీపీ నాయకుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యలు ఇప్పుడు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. గత శుక్రవారం ఖతార్‌కు చెందిన ఆల్ జజీర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఒకవేళ భారత్ ఆ ఉగ్రవాదుల్ని అప్పగించాలని కోరితే తాము అందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బిలావాల్.లష్కరే తోయిబా (ఎల్ఇటి) మరియు జైషే మొహమ్మద్ (జెఎం) చీఫ్ మసూద్ అజార్‌ను అప్పగించడంపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదమే తీవ్ర అంశంగా మారిన సమయంలో భారత్‌తో నమ్మకాన్ని చూరగొనడానికి ఇదొక మార్గమన్నారు. ఈ విషయంలో పాకిస్తాన్ ఎటువంటి అభ్యంతరం చెప్పదని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావాల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలు భారత్‌లో నిర్వహించారని ఆరోపణలు నేపథ్యంలో వారిని అప్పగిస్తామని, అందుకు సంబంధించిన న్యాయప్రక్రియకు భారత్ సహకరించాలన్నారు. ఇందుకు భారత్ ప్రభుత్వం సహకరిస్తే, పాకిస్తాన్ నుంచి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. భారత్ ఆందోళన చెందుతున్న సంబంధిత వ్యక్తులు ఉగ్రవాద కార్యకలాపాలు చేశారని ప్రకటనగా మాత్రమే ఉందని, ఈ క్రమంలో భారత్ సహకరించి న్యాయపరంగా ముందుకు వెళతామంటే వారిని(సంబంధిత ఉగ్రవాదుల్ని) భారత్‌కు అప్పగిస్తామన్నారు.నున్వెలా ప్రకటిస్తావ్!బిలావల్ భుట్టో ప్రకటనపై ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్రంగా మండిపడ్డారు. బిలావాల్ ఆ ప్రకటన ఎలా ఇస్తారంటూ ధ్వజమెత్తారు ఇది అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు తీసినట్లేనని తల్హా విమర్శించారు. ఈ విషయంలో బిలావాలో అప్పగింత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

ఫ్రాన్స్ సంచలన ఆరోపణలు.. చైనా, పాక్‌లు కలిసి..!
తమ యుద్ధ విమానాల అమ్మకాలపై చైనా దుష్ర్పచారాం చేస్తోందని ప్రాన్స్ సంచలన ఆరోపణలు చేసింది. తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేస్తున్న రఫెల్ యుద్ధ విమానాల అమ్మకాలను చైనా దెబ్బతీస్తోందని ఫ్రాన్స్ ఆరోపించింది. పలు దేశాల్లో చైనా రాయబార కార్యాలయాల్లో పని నేసే దౌత్య, రక్షణ ప్రతినిధులు ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారని ఫ్రాన్స్ మండిపడుతోంది. ఫేల్ విమానాలను కొనుగోలు చేయవద్దని, వాటి స్థానంలో చైనా తయారీ జెట్లను తీసుకుంటే మంచిదని వివిధ దేశాలను ఒప్పించే యత్నాలు జరగుఉతున్నాయని ఫ్రెంచ్ వర్గాల వెల్లడించాయి. తమ దేశం అధికంగా విమానాల అమ్మకాలనై అత్యధికంగా ఆధారపడిన దేశమని, దాన్ని చైనా దెబ్బ కొట్టడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నట్లు ప్రాన్స్ చెబుతోంది. చైనా తన అధికారిక బలంతో ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు ఫ్రాన్స్ అంటోంది. పాకిస్తాన్, చైనా కలిసి ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని ఫ్రాన్స్ విమర్శించింది. ఈ దుష్ప్రచారంలో భాగంగా, గత మే నెలలో భారత్‌తో జరిగిన ఘర్షణలో మూడు రఫేల్ విమానాలతో సహా ఐదు భారత విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ చేసిన వాదనలను చైనా వాడుకుంటోందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు. ఆన్లైన్లో కూడా ఈ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారని తెలిపింది. ఏఐతో మార్ఫింగ్ చేసిన యుద్ధ విమానాల శిథిలాలను చూపిస్తూ చైనా టెక్నాలజీ అమోఘమనే భావనను వారు కల్గిస్తున్నారని తెలిపింది. రఫెల్ అనేది యుద్ధ విమానం మాత్రమే కాదని, అది ఫ్రాన్స్ వ్యూహాత్మక సామర్థ్యానికి, నమ్మకానికి ప్రతీక ఫ్రాన్స్ పేర్కొంది. ఇప్పుడే దాన్నే చైనా తన అధికారిక బలాన్న ఉపయోగించి దుష్ప్రచారానికి దిగినట్లు ఫ్రాన్స్ ధ్వజమెత్తింది.రఫెల్ యుద్ధ విమానాలకు తయారు చేసే డసెల్ట్ ఏవియేషన్ 533 జెట్స్‌ను వివిద దేశాలకు అమ్మింది. ఈజిప్ట్, భారత్, ఖతర్, గ్రీస్, క్రొయేషియా, యూఏఈ, సెర్బియా, ఇండోనేషియా తదితర దేశాలకు ఫ్రాన్స్ తమ యుద్ధ విమానాలను విక్రయించింద. ఇప్పటివరకూ ఇండోనేషియా 42 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేయగా, మరిన్ని రఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడాన్ని పరిశీలిస్తోంది.

‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్‌కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్‌కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్‌కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు.
జాతీయం

ఘనంగా దలైలామా జన్మదిన వేడుకలు
ధర్మశాల/వాషింగ్టన్: టిబెటన్ల అత్యున్నత ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమతాన్ని విస్తృతంగా ప్రచారంచేస్తున్న 14వ దలైలామా టెంజిన్ గ్యాట్సో 90వ పుట్టినరోజు వేడుకలు హిమాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రపంచదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భౌద్ధ భిక్షువులు, బౌద్ధులు, పలువురు ప్రముఖుల సమక్షంలో ట్సుగ్లాంగ్ఖాంగ్ దలైలామా ఆలయం ప్రాంగణంలో జన్మదిన వేడుకలు జరిగాయి. కంగ్రా జిల్లాలోని మెక్లియోడ్గంజ్ పట్టణంలో జరిగిన ఈ వేడుకలకు పెద్దసంఖ్యలో విద్యార్థులు, నృత్యకారులు, నేపథ్యగాయకులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి, మత సామరస్యం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న దలైలామాకు తమ మద్దతు ఇకమీదటా కొనసాగుతుందని వేడుకల వేదికపై ఆసీనులైన పలు దేశాల రాజకీయ ప్రముఖులు ప్రకటించారు. ఒక్కో దశాబ్ద జీవితానికి ఒక అంతస్తు గుర్తుగా సిద్ధంచేసిన 9 అంతస్తుల కేక్‌ను కట్‌చేశాక వేలాది మంది బౌద్ధుల సమక్షంలో దలైలామా ప్రసంగించారు. ‘‘ జనులందరికీ సేవచేయాలన్న నా సంకల్పానికి మీ ప్రేమే స్ఫూర్తిగా నిలుస్తోంది. శాంతిదేవుడైన ‘బోధిసత్వాచార్యావతార’ చూపిన మార్గంలోనే నిరంతరం నడుస్తున్నా. ఇంద్రియజ్ఞానమున్న జనులంతా నా సోదరసోదరీమణులు, స్నేహితులే. నా శక్తిమేరకు మీకు సేవ చేస్తా. నా పుట్టినరోజు అని తెల్సుకుని అమితానందంతో ఇంతదూరమొచ్చి వేడుకల్లో భాగస్వాములైన మీకందరికీ మనస్ఫూర్తిగా ధాంక్యూ’’ అని దలైలామా వ్యాఖ్యానించారు. ‘‘ఎక్కువ మంది జనముంటే మరింత ఎక్కువగా హృదయానందం పొంగిపొర్లుతుంది. ఆ ఆనందం నాకెంతో స్ఫూర్తినిస్తుంది. బోధిచిత్తాన్నే నేను ఆచరిస్తా. ప్రజల్ని నా వైపునకు తిప్పుకోవాలనే స్వార్థ లక్ష్యాలు పెట్టుకోవడం కంటే ప్రజలకు సేవ చేయడంపైనే నా దృష్టంతా ఉంటుంది’’ అని దలైలామా అన్నారు. కేంద్ర మంత్రులు కిరెణ్ రిజిజు, రాజీవ్ రంజన్ సింగ్, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ, సిక్కిం మంత్రి సోనమ్ లామా, హాలీవుడ్ సీనియర్ నటుడు రిచర్డ్ గెరె తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ప్రాచీన జ్ఞానసంపదకు, ఆధునిక ప్రపంచానికి సజీవ వారధి దలైలామా. ఆర్యభూమిలో దలైలామా దశాబ్దాలుగా ఉండిపోవడం మనకెంతో సంతోషకరం’’ అని రిజిజు పొగిడారు. శుభాకాంక్షలు తెలిపిన మోదీ దలైలామాకు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్ చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘90వ పుట్టినరోజు జరుపుకుంటున్న దలైలామాకు 140 కోట్ల మంది భారతీయులతోపాటు నేను సైతం శుభాకాంక్షలు చెబుతున్నా. ప్రేమ, తపన, సహనం, నైతిక విలువలకు నిలువెత్తు నిదర్శనం దలైలామా. ఆయన ఇచ్చి సందేశం దేశాలకతీతంగా జనులందరికీ శిరోధార్యం. ఆయన ఇలాగే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని మోదీ అన్నారు. అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం సందేశం పంపించారు. ‘‘ టిబెటన్ల మానవ హక్కుల పరిరక్షణతోపాటు ప్రాథమిక స్వేచ్ఛకు అమెరికా నిత్యం మద్దతిస్తోంది. ఇతరుల(చైనా) జోక్యంలేకుండా టిబెటన్ల భాష, సంస్కృతి, మత వారసత్వ పరిరక్షణకు అమెరికా పాటుపడుతుంది’’ అని ఆయన అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా సైతం తమ శుభాకాంక్షల వీడియో సందేశాలు పంపించారు.

మన రైతులకు కావాలి... రూ. 6.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకుని రైతులు అభివృద్ధి చెందాలంటే భారత్‌లో రైతులకు ఏకంగా 75 బిలియన్ డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల)పెట్టుబడులు అవసరమని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ)అధ్యక్షుడు అల్వారో లారియో అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే గాక భారత్‌లోనూ గ్రామీణ సమాజాలకు సాయం అందించడం అతి పెద్ద సవాలని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభదాయకంగా చేయడం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచుకోవడం, ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు ఎదగడం వంటి అంశాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌లోని రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86.2శాతం మంది ఉన్నారు. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా కరువులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వాతావరణ స్మార్ట్ పద్ధతులను అవలంబించడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి. పంటల వైవిధ్యం, మెరుగైన నీటి నిర్వహణ లేదా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులను సృష్టించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి దిగుబడిని పెంచుతాయి’’ అని లారియో తెలిపారు. ‘‘పేదరైతులకు పెట్టుబడులు, వారికి మార్కెట్ అనుసంధానం కీలకం’’ అన్నారు.

పని సంస్కృతిలో సాంకేతికత, అవసరాలు భాగం కావాలి: అమిత్ షా
ఆనంద్: సహకార రంగం విజయవంతం కావాలంటే పారదర్శకత, సాంకేతికత వినియోగం, సభ్యుల అవసరాలను పని సంస్కృతిలో భాగంగా మార్చుకోవడం ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రఖ్యాత అమూల్ డెయిరీ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటైన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంస్థలు ఈ మూడు సూత్రాలను తమ పని సంస్కృతిలో విడదీయరాని భాగాలుగా చేసుకుని జమ్మూ కశీ్మర్ నుంచి అస్సాం వరకు, దేశంలోని ప్రతి గ్రామానికి వాటిని ప్రచారం చేయాలని సూచించారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో 2 లక్షల ప్రాథమిక సహకారం పరపతి సంఘాలు(పీఏసీఎస్‌లు), మొట్టమొదటి జాతీయ సహకార యూనివర్సిటీ త్రిభువన్, డెయిరీ రంగంలో మూడు జాతీయ సహకార సంఘాలు ఏర్పాటు వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయన్నారు. సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటైన నాలుగేళ్లలోని 60కి పైగా కార్యక్రమాలను కొత్తగా ప్రారంభించామన్నారు. అమూల్ పాల సహకార వ్యవస్థ వార్షిక టర్నోవర్ ప్రస్తుతమున్న రూ.80వేల కోట్ల నుంచి వచ్చే ఏడాదికల్లా రూ.లక్ష కోట్లకు చేరుకోనుందని అమిత్ షా ప్రకటించారు. గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యకే అమూల్ అని పేరు. ఈ సంస్థ నిత్యం 36 లక్షల రైతుల నుంచి 3.20 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తుంది.

దేశ నేర రాజధానిగా బిహార్
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా పట్నా లోని ఆయన నివాసం వద్ద హత్యకు గురి కావడంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ, సీఎం నితీశ్ కుమార్ కలిసి బిహార్‌ను దేశానికే నేర రాజధానిగా మార్చారన్న విషయం మరోసారి రుజువైందంటూ ధ్వజమెత్తారు. ‘లూటీలు, తుపాకీ కాల్పులు, హత్యలతో బిహార్ అట్టుడుకుతోంది. నేరాలు కార్యకలాపాలు సాధారణమై పోయాయి. ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సోదరసోదరీమణులారా, ఈ అన్యాయాన్ని ఇక ఏమాత్రం సహించొద్దు. మీ పిల్లలను కాపాడలేని ప్రభుత్వానికి మీ భవిష్యత్తును గురించిన బాధ్యతలను అప్పగించొద్దు’అని కోరారు. రాష్ట్రంలో చోటుచేసుకునే ప్రతి హత్య, ప్రతి లూటీ, ప్రతి బుల్లెట్ మార్పునకు నాంది కావాలన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికే కాదు, రాష్ట్రాన్ని రక్షించేందుకు కూడా ఓటేయాలని కోరారు. శుక్రవారం పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని నివాసం వద్ద గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఖెమ్కా ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా చోటుచేసుకున్న ఖెమ్కా హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఎన్ఆర్ఐ

డాలస్‌లో శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో "అడాప్ట్-ఎ-విలేజ్" ఘన విజయం
డాల్లస్, టెక్సాస్ - జూన్ 28 టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లోని జాక్ సింగ్లీ ఆడిటోరియం లో శంకర నేత్రాలయ USA మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) చొరవకు మద్దతుగా మ్యూజిక్ & డ్యాన్స్ ఫర్ విజన్ అనే దాతృత్వ వేడుకను ఘనంగా నిర్వహించారు. 400 మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో గ్రామీణ భారతదేశంలో నివారించదగిన అంధత్వాన్ని నిర్మూలించే లక్ష్యంతో సమాజం, కళ ,సేవా శక్తిని ప్రదర్శించింది. వారి ప్రారంభ వ్యాఖ్యలలో, "కరుణ సమాజాన్ని కలిసినప్పుడు మనం ఏమి సాధించగలమో ఈ కార్యక్రమం నిదర్శనం" అని పాలకమండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి అన్నారు. "MESU చొరవ కేవలం మొబైల్ సర్జరీ గురించి కాదు - ఇది ఆశను సమీకరించడం గురించి" అని శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి వ్యాఖ్యానించారు.ఒక చిరస్మరణీయ సాయంత్రానికి హృదయపూర్వక ప్రారంభంప్రతిభావంతులైన గాయకులు,వాయిద్యకారులు ప్రదర్శించిన భక్తి మరియు శాస్త్రీయ కూర్పుల శ్రేణి ప్రేక్షకులను కదిలించాయి. - జానకి శంకర్, సంతోష్ ఖమ్మంకర్, ప్రభాకర్ కోట, భారతి అంగలకుదిటి , కామేశ్వరి చరణ్ తమగానంతో ఆకట్టుకున్నారు. రవి తుపురాని సజావుగా సమన్వయం చేసిన వారి కళాత్మకత ప్రశంసలను పొందింది. నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ స్కూల్, కూచిపూడి కళాక్షేత్రం, అభినయ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ, తత్యా పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, నాట్యోం డ్యాన్స్ అకాడమీ, తాండవం స్కూల్ ఆఫ్ కూచిపూడి, రాగలీన డ్యాన్స్ అకాడెమీ నృత్య ప్రదర్శనలతో సహా డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని డాన్స్ అకాడమీలు - సంప్రదాయం, కథనాల్లో పాతుకుపోయిన నేపథ్య ఘట్టాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథి, మెగా దాతకు సత్కారంశంకర నేత్రాలయ USA ముఖ్య అతిథి మరియు సలహాదారుల బోర్డు సభ్యురాలు ప్రసాద రెడ్డి కాటంరెడ్డి , కరుణామయ దాత శ్రీమతి శోభా రెడ్డి కాటంరెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాటంరెడ్డి కొత్త మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) స్థాపనకు 5 లక్షల డాలర్ల విలువైన స్మారక విరాళాన్ని అందించారు.ఈ అసాధారణ దాతృత్వ చర్య పేద గ్రామీణ సమాజాలలో వేలాది మందికి దృష్టిని రక్షించే శస్త్రచికిత్సలను తీసుకువస్తుంది. దృష్టి సంరక్షణ కోసం వారి అచంచల నిబద్ధతను గుర్తించి, ఈ జంటను హృదయపూర్వకంగా సత్కరించారు. నివారించదగిన అంధత్వాన్ని తొలగించే లక్ష్యంలో తమ ముఖ్య అతిథిగా , నిజమైన భాగస్వామిగా కలిగి ఉండటం చాలా గౌరవంగా ఉందని అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి కొనియాడారు.ఛాంపియన్స్ ఆఫ్ విజన్: మా అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లకు గౌరవంఅలాగే ముగ్గురు విశిష్ట సమాజ నాయకులు AVN రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ శ్రీనివాస రెడ్డి ఆళ్ళ గౌరవ అతిథులుగా చాలా కాలంగా భారతీయ-అమెరికన్ సమాజంలో సాంస్కృతిక పరిరక్షణకు మార్గదర్శకులుగా ఉన్నారు. 35 MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు మరియు అనేక మంది కరుణామయ వ్యక్తిగత దాతల అచంచల మద్దతు ద్వారా 4లక్షల డాలర్లకుపైగా నిధులను సేకరించింది. ఆనంద్ దాసరి, ఉన్నత సలహాదారు, బెనిఫాక్టర్ స్పాన్సర్లు ప్రకాష్ బేడపూడి, మూర్తి రేకపల్లి, శ్రీని వీరవల్లి, కిషోర్ కంచర్ల, అరవింద్ కృష్ణస్వామి, మరియు MESU అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు, తిరుమల్ రెడ్డి కుంభం, బుచ్చిరెడ్డి గోలి, సునీత & డాక్టర్ రాజు కోసూరి, శ్రీకాంత్ బీరం, శ్రీని SV, ఆండీ ఆశావ, సతీష్ కుమార్ సేగు, డాక్టర్ కల్వకుంట్ల లక్ష్మణ్ రావు, డాక్టర్ రూపేష్ కాంతాల, అజయ్ రెడ్డి, రఘువీర్ బండారు, రావు కల్వల, అర్జున్ మాదాడి (స్వర్గీయ భాను మాదాడి జ్ఞాపకార్థం), ప్రవీణ్ బిల్లా, శివ అన్నపురెడ్డి, డాక్టర్ పవన్ పామదుర్తి, డాక్టర్ శ్రీనాధ రెడ్డి వట్టం, రమన్ రెడ్డి క్రిస్టపాటి లకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అసాధారణ దాతృత్వం దాదాపు 6,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలుగా మారుతుంది - ప్రతి ఒక్కటి దృష్టి లోపంతో బాధపడుతున్న పేద వ్యక్తులకు జీవితాన్ని మార్చే బహుమతి. "ప్రతి అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్ మొత్తం సమాజానికి ఆశాకిరణంగా మారారు. మీ నిబద్ధత ఆర్థిక సహాయం కంటే చాలా ఎక్కువ - ఇది వేలాది మందికి దృష్టి, గౌరవం మరియు అవకాశాన్ని పునరుద్ధరించే శక్తివంతమైన చర్య అంటూ శంకర నేత్రాలయ USA తరపున డాక్టర్ రెడ్డి ఊరిమిండి ధన్యవాదాలు తెలిపారు. అలాగే నృత్య గురువులు, గాయకులు,కళా ప్రదర్శకులను సత్కరించారు. శంకర నేత్రాలయ USA కోశాధికారి మూర్తి రేకపల్లి, కార్యదర్శి వంశీ ఏరువారం, పాలక మండలి సభ్యులు మెహర్ చంద్ లంక, నారాయణరెడ్డి ఇందుర్తి, ఆది మొర్రెడ్డి, చంద్ర మౌళి సరస్వతి, మహిళా కమిటీ చైర్పర్సన్ రేఖ రెడ్డి, కమిటీ సభ్యులు మోహన నారాయణ్ లను పాలక మండలి సభ్యులు డాక్టర్ రెడ్డి ఊరిమిండి, డాక్టర్ ప్రవీణ వజ్జ, డల్లాస్ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ చినసత్యం వీర్నపు, కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమం విజయవంతంకావడంలో కీలక పాత్ర పోషించారు. 35 మంది అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లతో పాటు, అనేక మంది వ్యక్తిగత దాతలను కూడా ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమ వ్యాఖ్యాతగా పరిమళ మార్పాక వ్యవహరించారు.మరిన్ని వివరాలకు లేదా విరాళం ఇవ్వడానికి, దయచేసి www.sankaranethralayusa.org ని సందర్శించండి లేదా (855) 463-8472 కు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయండి.

‘స్కామర్..’: భారతీయ టెకీపై అమెరికా సీఈవోలు ధ్వజం
అమెరికాకు చెందిన అయిదు కంపెనీల సీఈవోలను మోసం చేశాడంటూ భారత్‌కు చెందిన టెకీపై ఆరోపణలు గుప్పుమన్నాయి.'స్కామర్' అంటూ ఐదుగురు సీఈవోలు భారతీయ టెక్కీపై ఆరోపణలు గుప్పించారు. అతనితో జాగ్రత్త అంటూ బహిరంగంగా స్టార్టప్‌లను హెచ్చరించడం టెక్ సర్కిల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తీవ్ర చర్చలకు దారితీసింది. ఇంతకీ ఎవరీ టెకీ, అసలు వివాదం ఏమిటిభారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోహమ్ పరేఖ్ బహుళ స్టార్టప్‌లలో ఒకేసారి మూన్లైట్ (ఒకేసారి వివిధ కంపెనీల్లో పనిచేయడం) చేసినట్లు, యజమానులను మోసం చేసి, స్టార్టప్ కంపెనీలకు మోసగించాడు అనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని తొలుత మిక్స్‌ప్యానెల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ CEO సుహైల్ దోషి వెలుగులోకి తెచ్చారు. పరేఖ్ తప్పుడు సాకులతో ఒకేసారి బహుళ స్టార్టప్‌లను మోసం చేస్తున్నాడన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. పరేఖ్ తన కంపెనీ ప్లేగ్రౌండ్ AIలో కొంతకాలం ఉద్యోగంలో ఉన్నాడని, కానీ అతని నిజాయితీ లేని ప్రవర్తన కారణంగా వారంలోనే అతనిని తొలగించామని వెల్లడించారు.Guys we found Soham Parekh! pic.twitter.com/bWnODxbM8l— Satwik Singh (@itsmesatwik_) July 3, 2025 పరేఖ్‌ను బహుళ కంపెనీలలో మూన్‌లైటింగ్ ఆపమని తాను హెచ్చరించానని, కానీ అతని పట్టించుకోలేదు, అబద్ధాలు, మోసాలు ఆపమని చెస్పినా, ఏడాది తర్వాత కూడా అదే కొనసాగించాడు. అందుకే తీసి వేశామన్నారు. ఒకేసారి 3-4 స్టార్టప్‌లలో ఉద్యోగాలు చేశాడని ఆరోపించారు. తన వాదనలకు బలం చేకూర్చేలా పరేఖ్ CVని పోస్ట్ చేశాడు. PSA: there’s a guy named Soham Parekh (in India) who works at 3-4 startups at the same time. He’s been preying on YC companies and more. Beware.I fired this guy in his first week and told him to stop lying / scamming people. He hasn’t stopped a year later. No more excuses.— Suhail (@Suhail) July 2, 2025 ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 1.28 కోట్ల వ్యూస్ వచ్చాయి. అనేకమంది కంపెనీ యజమానులు ఆయనకు మద్దుతుగా నిలిచారు. ముఖ్యంగా ఫ్లీట్ AI సహ వ్యవస్థాపకుడు , CEO నికోలాయ్ ఔపోరోవ్ ఇవే ఆరోపణలు గుప్పించారు. ఇంకా AIVideo సహ వ్యవస్థాపకుడు జస్టిన్ హార్వే, అని మరొక స్టార్టప్, శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మొజాయిక్ వ్యవస్థాపకుడు ఆదిష్ జైన్ ఇదే ఆరోపణలను ధృవీకరించారు, ఇంటర్వ్యూలలో బాగానే ఉన్నాడు కానీ అతను అబద్ధాలకోరు అని వ్యాఖ్యానించడం గమనార్హం. యాంటిమెటల్ CEO మాథ్యూ పార్క్హర్స్ట్ ఏమంటారంటే.. సోహామ్ 2022లో కంపెనీలో ఇంజనీర్‌గా చేరాడు. తెలివైన వాడే.. కానీ బహుళ కంపెనీలలో పనిచేస్తున్నాడని చాలా తొందరగానే గమనించాం. అందుకే అతణ్ని తొలగించామన్నారు. అంతేకాదు పరేఖ్ ముంబై విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ జార్జియా టెక్ నుండి మాస్టర్స్ డిగ్రీ బహుశా 90 శాతం నకిలీదేమో అన్ని అనుమానాల్ని కూడా వ్యక్తం చేశారు. నేను ఉద్యోగం లేక బాధపడుతోంటే, సోహమ్ పరేఖ్‌ను 79 సార్లు హైర్ చేసుకున్నారా అంటూ విచారం వ్యక్తం చేశాడో నిరుద్యోగ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే సోహమ్ పరేఖ్ ఈ ఆరోపణలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.అయితే తప్పేంటి?మూన్‌లైటింగ్ తప్పు అని మీరు ఎందుకనుకుంటున్నారు. అతను ఇంటర్వ్యూలలో పాస్ అయ్యాడు. బెస్ట్ అనే కదా మీరు అతణ్ని తీసుకున్నారు. అతను సరైన వైఖరితో సమయానికి అన్ని పనులను పూర్తి చేసినంత కాలంతప్పేంటి అంటూ శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మరో టెక్నిపుణురాలు ట్వీట్ చేశారు.

విజయవంతంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక ‘సాహిత్యంలో హాస్యం’ కార్యక్రమం
డాలస్, టెక్సస్, అమెరికా: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” ప్రతి నెలా ఆఖరి ఆదివారం (5 సంవత్సరాలకు పైగా) నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన 81వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం-అలనాటి విశిష్ట రచయితల హాస్యరచనా వైభవం” (గురజాడ, భానుమతి, మొక్కపాటి, ముళ్ళపూడి, చిలకమర్తి, భమిడిపాటి, శ్రీరమణ) ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపించింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ - మనకున్న తెలుగు సాహితీవేత్తలలో కొంతమంది విశిష్టరచయితలు సృష్టించిన హాస్య సాహిత్యవైభవాన్ని ఈ రోజు ఈ వేదికమీద చర్చించుకోవడం ముదావహం అంటూ శుభాకాంక్షలుతెల్పి, అందరికీ ఆత్మీయఆహ్వానం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ”హాస్యంకోసం హాస్యరచనలు చేసినవారు కొందరైతే, ఆనాటి వాస్తవ సాంఘిక, సామాజిక సమస్యల ఇతివృత్తంగా కొంతమంది చేసిన రచనలు సహజంగా హాస్యాన్ని సృష్టించాయి. రచనలతో హాస్యం పండించడం, పాఠకుల్ని మెప్పించడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. అలాంటి దాన్ని అలవోకగా సాధించిన రచయితలలో కొంతమందిని ఎంపికచేసుకుని వారి రచనావైభవాన్ని మననం చేసుకోవడం, వారిని స్మరించుకోవడం చాలా సబబుగా ఉంది అన్నారు.” విశిష్ట అతిథులుగాపాల్గొన్న - ఆచార్య డా. చుండూరి మృణాళిని, ప్రముఖ రచయిత్రి, విద్యావేత్త, వక్త à గురజాడ అప్పారావు (రచయిత, సంఘ సంస్కర్త, హేతువాది, అభ్యుదయ కవి) గురించి; పొత్తూరి విజయలక్ష్మి, ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి భానుమతీ రామకృష్ణ (రచయిత్రి, నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని, సంగీత దర్శకురాలు) గురించి; డా. కొచ్చెర్లకోట జగదీశ్, ప్రముఖ రచయిత à మొక్కపాటి నరసింహశాస్త్రి (ప్రముఖ హాస్యరచయిత) గురించి; యర్రంశెట్టి శాయి, ప్రసిధ్ధ తెలుగు కథా, నవలా రచయిత à ముళ్ళపూడి వెంకటరమణ (ప్రముఖ సినీ కథా రచయిత, హాస్య కథా, నవలా రచయిత) గురించి; కూచి, ప్రముఖ చిత్రకారుడు, హాస్య రచయిత à చిలకమర్తి లక్ష్మీనరసింహం (సుప్రసిద్ధ కవి, రచయిత, నాటకకర్త, సంఘసంస్కర్త) గురించి; డా. చిట్టెన్ రాజు వంగూరి, ప్రముఖ నాటకకర్త, రచయిత, నటుడు à భమిడిపాటి కామేశ్వరరావు (హాస్యబ్రహ్మ, ప్రముఖ రచయిత, నటుడు, నాటకకర్త) గురించి; ఫణి డొక్కా, ప్రముఖ రచయిత, దర్శకుడు శ్రీ రమణ (ప్రముఖ వ్యంగ్య వ్యాస, కథా, నవలారచయిత)లు సృష్టించిన అసంఖ్యాక రచనలోని విశేషాలను, పాత్రల స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించి ఆద్యంతం నవ్వులు పూయించారు.హాస్యప్రధానంగా సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశిష్టఅతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు కృతజ్ఞతలు తెలియజేశారు తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్.ఈ పూర్తి కార్యక్రమాన్ని క్రింది లంకెలో వీక్షించవచ్చును.https://youtube.com/live/x9kzttV6B_w

చిన్న జీయర్ స్వామి తొలిసారి స్కాట్లాండ్ సందర్శన
బోనెస్: భువన విజయం సంస్థ, జెట్ యుకే నిర్వహించిన కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి పాల్గొన్నారు. ఆయనకు బోనెస్లో ఘన స్వాగతం లభించింది. జూన్ 29న బోనెస్లో జరిగిన ఉపన్యాస కార్యక్రమానికి దాదాపు 500 మంది భక్తజనం హాజరయ్యారు. స్వాగత ఊరేగింపు కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు పర్రి స్వామీజీకి పూలమాలతో స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన తనయుడు అద్వితీయ్ అర్జున్ రాజు పర్రి స్కాటిష్ కళైన బ్యాగ్పైప్ను స్థానిక కళాకారులతో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ప్రసాద్ మంగళంపల్లి, ముఖ్య అతిథి డా. శ్రీహరి వల్లభజౌస్యుల సంయుక్తంగా పూర్ణకుంభ స్వాగతం నిర్వహించారు. సాయి దొడ్డ వారి సమూహం సాంప్రదాయ బద్దంగా కోలాటం ప్రదర్శించారు. పిల్లలు సంయుక్త నృత్యం పుష్పమాల సమర్పణ. శైలజ గంటి, హిమబిందు జయంతి, మమత వుసికల నిర్వహించిన మంగళ ఆరతి వరకు అన్ని క్షణాలు ఉత్సాహభరితంగా సాగాయి. రంజిత్ నాగుబండి సమన్వయం చేయగా, మిథిలేష్ వద్దిపర్తి కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి రాజశేఖర్ జాల జెట్ యూకేతో సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వేదికపై ప్రదర్శింపబడిన కుచిపూడి నృత్యం, ఆరాధనామయ రామ సంకీర్తనం, వీణా వాయిద్య ప్రదర్శన, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, ప్రజ్ఞ పిల్లల శ్లోక పఠన కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ సాగాయి.ఆ పిదప స్వామీజీ “Ego, Equality & Eternity — A Journey from Self to Supreme” అనే ఉపన్యాసంలో నిత్యవేదాంతసారాన్ని ఆధునిక జ్ఞానంతో మేళవిస్తూ, “అహంకారాన్ని అధిగమించిన ప్రతి హృదయంలో సమానత్వాన్ని, ప్రతి శ్వాసలో శాశ్వతత్వాన్ని కనుగొంటాం” అని ఉత్సాహపూరితంగా పేర్కొన్నారు. ఆయన "భువన విజయం" అనే పేరు వింటే రోమాలు నిక్కబొడుస్తున్నట్లు అనిపిస్తోందన్నారు, ఐదున్నర శతాబ్దాల తరువాత భువన విజయం సభ ప్రాభవాన్ని పునరుజ్జీవింపజేసినందుకు సంస్థను అద్భుతంగా భావించారు.కోర్ బృందం పర్యవేక్షణలో, 30 మంది వాలంటీర్లు అవిశ్రాంతంగా పనిచేశారు. ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. "పుష్ప స్వాగతం నుండి ప్రసాదం చివరి పంపిణీ వరకు, ఈ కార్యక్రమం స్కాటిష్-తెలుగు సంప్రదాయాలను భక్తి, ఐక్యతతో మిళితం చేసింది" అని వ్యవస్థాపకుడు విజయ్ కుమార్ రాజు ప్యారీ అభిప్రాయపడ్డారు. జీయర్ స్వామి మీద కోదండరావు అయ్యగారి వ్రాసిన పద్యాలను ప్రశంస పత్ర రూపంలో భువన విజయం సభ్యులు స్వామి వారికి బహూకరించారు.
క్రైమ్

గుండెపోటుతో చిన్నారి మృతి
స్టేషన్‌ఘన్‌పూర్: ముక్కుపచ్చలారని చిన్నారి గుండె ఆగి చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గోవింద్ అశోక్, అనూష దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, ఉపాధి కోసం వీరు హైదరాబాద్‌కు వచ్చారు. అశోక్ నగరంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. రెండో కుమార్తె మిధున (6) శనివారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని అంటూ.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే తల్లిదండ్రులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే పాప మృతిచెందింది. కాగా, గుండె పోటుతో తమ కుమార్తె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు తెలిపారు.

వివాహేతర సంబంధం.. జంట ఆత్మహత్య
కొమరోలు/ప్యాపిలి: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె గ్రామ సమీప రేగలగడ్డ చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కట్టెల భారతికి(20)మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్‌తో వివాహం జరిగింది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఏడాదిగా భారతి స్వగ్రామంలో ఉంటోంది.ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(26)తో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం పెద్దలకు తెలియడంతో వారు హెచ్చరించారు. దీంతో ఇరువురూ ఈ నెల 4న ఇంటి నుంచి పారిపోయారు. ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి ఫోన్ స్విచాఫ్ చేశాడు. స్థానిక ఎస్సై నాగరాజు ఆదివారం తెల్లవారుజామున సిబ్బందితో కలిసి లొకేషన్ ఆధారంగా అక్కపల్లె గ్రామానికి చేరుకున్నారు. చుట్టుపక్కల గాలించగా భారతి, రాముడు చెట్టుకు ఉరి వేసుకుని విగత జీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

రూ.16 లక్షలు కొట్టేసిన టీడీపీ నేత
పెదకూరపాడు: ఎన్ఆర్ఐ మహిళను మోసం చేసి ఓ టీడీపీ నేత రూ.16 లక్షలు కొట్టేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూరప్‌లో ఉండే షేక్ హసీనా అమరావతిలో భూమి కొనుగోలు చేయాలని మధ్యవర్తి గోపిని సంప్రదించింది. దీంతో హసీనా సోదరి జాన్‌బీకి అమరావతి మండలం నెమలికల్లులోని కుప్పా మల్లేశ్వరయ్యకి చెందిన భూమిని గోపి చూపెట్టాడు. ఆ భూమి వివరాలను ఆమె హసీనాకు వాట్సప్‌లో షేర్ చేసింది. భూమి నచ్చడంతో గోపికి రూ.లక్ష బయానా చెల్లించి భూమికి సంబంధించిన డాక్యుమెంట్ జిరాక్స్‌లను తీసుకుంది. భూమి రికార్డులన్నీ బాగానే ఉండటంతో 95 సెంట్ల పొలాన్ని రూ.75.52 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.హసీనా..తన సోదరి జాన్‌బీని పంపి రూ.16 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో అగ్రిమెంట్ చేసుకోవడానికి వచ్చిన జాన్‌బీకి అమరావతికి చెందిన టీడీపీ నేత జానీసైదా తాను మల్లేశ్వరయ్య నుంచి భూమి కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నానని నకిలీ పత్రాలు చూపించి నమ్మించాడు. అదే రూ.75.52 లక్షలకే తాను ఆ భూమిని అమ్ముతానని చెప్పాడు. దీంతో మే 15న రూ.16 లక్షలు జానీ సైదాకు చెల్లించి నెలరోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా జాన్‌బీ పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ క్రమంలో జూన్ 20న భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి యూరప్ నుంచి గుంటూరుకు షేక్ హసీనా వచ్చింది. భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటానని జానీసైదాను కోరినా అతడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు.దీంతో హసీనాకు అనుమానం వచ్చి భూ యజయాని మల్లేశ్వరయ్యను సంప్రదించింది. అతడు జానీసైదా ఎవరో తనకు తెలియదని, తాను అగ్రిమెంట్ చేయలేదని చెప్పడంతో హసీనా తాను మోసపోయానని గ్రహించి గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. హసీనా మాట్లాడుతూ తాను కూడా టీడీపీ తరఫున 3 సార్లు పోలింగ్ ఏజెంట్‌గా పనిచేశానని, తనకు జరిగిన మోసాన్ని మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకువెళతానని తెలిపింది. కాగా, ఇసుక ఆక్రమాలకు సంబంధించి జానీ సైదాపై పలు ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో టీడీపీలో ముఖ్యనేత కావడంతో బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
రహమత్‌నగర్(హైదరాబాద్): మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే దారుణంగా హింసించి కడతేర్చాడో కిరాతకుడు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలాజీనగర్‌కు చెందిన నర్సింహ కూలి పనిచేస్తుంటాడు. మొదటి భార్య వదిలి వేయడంతో ఫతేనగర్‌కు చెందిన సోని(26)ని ఏడేళ్లక్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరు రెండు నెలల క్రితం బోరబండ డివిజన్ సాయాబాబానగర్కు వచ్చి అద్దెకు ఉంటున్నారు. సోని హౌస్ కీపింగ్ పని చేస్తుండగా..కుమారుడిని గురుకుల పాఠశాలలో చేరి్పంచారు. మద్యానికి బానిసైన నర్సింహ దొంగతనాలు చేశాడు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో సోనీ ఇటీవల నర్సింహకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లి వచ్చింది. దీంతో కోపం పెంచుకున్న నర్సింహ శుక్రవారం రాత్రి మద్యం తాగి వచ్చి సోనిని తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరింది. అరుపులు, కేకలు విన్న పొరుగింటి వారు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వగా..బోరబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని సోనిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. నర్సింహను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.
వీడియోలు


బిహార్ ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్


అక్బరుద్దీన్ ఓవైసీ కళాశాలల జోలికి పోతే అన్యాయం జరుగుతుందట: బండి సంజయ్


Psycho Attack: టెంపుల్ సిటీ తిరుపతిలో దారుణం


అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో YSRCP విస్తృతస్థాయి సమావేశం


కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలో బుద్ధి చెప్తారు: YSRCP నేతలు


పాతాళం నుంచి ఆకాశమంత ఎదిగిన ఆకాశ్ దీప్


YSRCP దళిత కార్యకర్తలపై ఎల్లో తాలిబన్లు దాడి


ప్రియురాలిపై దాడి చేసి అనంతరం యువకుడు ఆత్మహత్యాయత్నం


ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన


వైఎస్ జగన్ చిత్తూరు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పెద్దిరెడ్డి