Weekly Love Horoscope, in Telugu | Dec 13th to Dec 19th | 2019 | ప్రేమ జాతకం - Sakshi Telugu
Sakshi News home page

ప్రేమ జాతకం 13-12-19 నుంచి 19-12-19 వరకు

Published Fri, Dec 13 2019 11:44 AM | Last Updated on Fri, Dec 13 2019 1:54 PM

Weekly Love Horoscope In Telugu - Sakshi

 మేషం : మీరు అత్యంత ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, గురువారాలు అనుకూలం. ఈ రోజుల్లో చేసే ప్రేమ ప్రతిపాదనలకు ఆవతలి వారు సైతం స్పందిస్తారు. ప్రపోజ్‌ చేసే సమయంలో పింక్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది.  అలాగే, ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి పశ్చిమదిశగా బయలుదేరండి. ఇక శని, మంగళవారాలు మీ ప్రయత్నాలకు విరామం ఇవ్వండి.

వృషభం : మీరు కోరుకునే వ్యక్తులకు మనస్సులోని భావాలను వెల్లడించేందుకు శని, ఆదివారాలు అత్యంత అనుకూలమైనవి. ఈ రోజుల్లో చేసే ప్రతిపాదనలకు అనుకూల స్పందనలు రావచ్చు.  ఇటువంటి సందర్భాల్లో  గ్రీన్, ఎల్లో రంగు దుస్తులు ధరిస్తే మేలు జరుగుతుంది. ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా బయలుదేరండి. అయితే బుధ, గురువారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

మిథునం : శని, సోమవారాలలో మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ, పెళ్లి ప్రతిపాదనలు చేసేందుకు అనువైన రోజులు. ఈ రోజుల్లో చేసే ప్రేమ ప్రతిపాదనలకు ఆవతలి వైపు నుంచి సానుకూలత వ్యక్తం కావచ్చు. ప్రపోజ్‌ చేసే సమయంలో మీరు పింక్, రెడ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరండి శుభం కలుగుతుంది. కాగా, ఆది, మంగళవారాలు మీ ప్రతిపాదనలను మనస్సులోనే ఉంచుకోవడం ఉత్తమం.

కర్కాటకం : మీరు కోరుకునే వ్యక్తులకు మీ అభిప్రాయాలను తెలిపేందుకు ఆది, బుధవారాలు అనుకూలమైనవి. ఆవతలి వైపు నుంచి కూడా మీ అభిప్రాయాలను మన్నిస్తూ ప్రతిపాదనలు అందవచ్చు. ఈ సమయంలో మీరు ఎల్లో, స్కైబ్లూ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇక ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే శని, మంగళవారాలలో ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

సింహం : శని, మంగళవారాలు మీ అభిప్రాయాలను ఇష్టులకు వెల్లడించేందుకు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ రోజుల్లో మీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలున్నాయి. అలాగే, ఇటువంటి ప్రతిపాదనలు చేసే సమయంలో గ్రీన్, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ప్రేమ ప్రయత్నాలు మొదలుపెట్టే సమయంలో తూర్పు ఈశాన్యదిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక ఆది, గురువారాలు వ్యతిరేకత కలిగినందున మౌనం వహించడం ఉత్తమం.

కన్య : మీరు కోరుకున్న వ్యక్తులకు మనస్సులోని భావాలను తెలిపేందుకు  శుక్ర, ఆదివారాలు అత్యంత అనువైనవి. ఈ సమయంలో మీ ప్రయత్నాలకు అవతలి వైపు నుంచి కూడా సానుకూలత వ్యక్తం కావచ్చు. ప్రతిపాదనలు అందించే సమయంలో వైట్, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఇంటి నుంచి దక్షిణ ఆగ్నేయదిశగా కదిలితే శుభం చేకూరుతుంది. అయితే, సోమ, మంగళవారాలలో ఇటువంటి ప్రతిపాదనలకు దూరంగా ఉండండి.

తుల : సోమ, బుధవారాలు మీ ప్రేమ సందేశాలు ఇష్టమైన వారికి అందించేందుకు శుభదాయకమైనవి. ఈరోజుల్లో మీరు చేసే ప్రతిపాదనలకు ఆవతలి నుంచి ఆమోదం లభించే వీలుంది. ప్రేమ ప్రతిపాదనలు అందించే సమయంలో మీరు రెడ్, ఎల్లో రంగు దుస్తులు ధరించండి. అలాగే, ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి ఉత్తరదిశగా బయలుదేరితే శుభాలు సిద్ధిస్తాయి. అయితే శుక్ర, గురువారాలు వ్యతిరేక స్వభావం కలిగినందున మౌనం మంచిది.

వృశ్చికం : బుధ, గురువారాలు శుభదాయకమైనందున మీ మనస్సులోని భావాలను ఇష్టమైన వారికి వెల్లడించేందుకు అనుకూలమైనవి. ఈ రోజుల్లో మీ ప్రతిపాదనలు ఆవతలి వారు ఆమోదించే వీలుంటుంది. ఇటువంటి సమయంలో బ్లూ, ఆరెంజ్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, ఉత్తర ఈశాన్య దిశగా బయలుదేరండి. అయితే సోమ, మంగళవారాలు మాత్రం ఈ వ్యవహారాలకు దూరంగా ఉండండి.

ధనుస్సు : మీ అభిప్రాయాలను అత్యంత ఇష్టపడే వ్యక్తులకు వెల్లడించేందుకు శుక్ర, శనివారాలు అత్యంత అనువైనవిగా చెప్పవచ్చు.  ఈ సమయంలో చేసే ప్రతిపాదనలకు సానుకూల స్పందన రావచ్చు. ప్రపోజ్‌ చేయాలనుకుంటున్న సందర్బాల్లో గ్రీన్, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మంచిది. అలాగే, ప్రేమ వ్యవహారాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి పశ్చిమ వాయువ్య దిశగా బయలుదేరితే శుభదాయకంగా ఉంటుంది. అయితే మంగళ,బుధవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

మకరం : మీరు ఇష్టపడే వ్యక్తులకు ప్రేమ ప్రతిపాదనలు అందించేందుకు శుక్ర, సోమవారాలు అత్యంత అనుకూలమైనవిగా చెప్పవచ్చు. ఈ సమయంలో ఆవతలి వారి నుంచి కూడా ఊహించిన స్పందనలు వచ్చే అవకాశం ఉంది. ప్రతిపాదనల సమయంలో ఎల్లో, పింక్‌ రంగు దుస్తులు ధరించండి. అలాగే, దక్షిణ దిశగా ఇంటి నుంచి బయలుదేరండి. ఇక బుధ, గురువారాలలో ఇటువంటి వాటికి దూరంగా ఉండడం మంచిది.

కుంభం : మీ ప్రేమసందేశాలు, మనస్సులోని అభిప్రాయాలను ఇష్టులకు తెలిపేందుకు ఆది, సోమవారాలు అనుకూలమైనవి. ఈ సమయాల్లో మీరు చేసే ప్రతిపాదనలకు ఆవతలి వారు సైతం అనుకూలత వ్యక్తం చేయవచ్చు. మీ ప్రేమ ప్రతిపాదనలు ఎదుటి వ్యక్తికి అందించే సందర్భంలో బ్లూ, వైట్‌ రంగు దుస్తులు ధరిస్తే మేలు. ప్రేమ ప్రయత్నాలు మొదలుపెట్టే సమయంలో ఇంటి నుంచి తూర్పుదిశగా బయలుదేరండి. అయితే శని, గురువారాలు మీ ప్రయత్నాలను విడనాడడం మంచిది.

మీనం : మీ ప్రేమ, పెళ్లి ప్రతిపాదనలు ఇష్టమైన వారికి అందిచేందుకు బుధ,గురువారాలు శుభదాయకమైనవిగా చెప్పవచ్చు. ఈరోజుల్లో  చేసే ప్రయత్నాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో మీరు పింక్, ఎల్లో రంగు దుస్తులు ధరించడం మంచిది. అలాగే, ఉత్తరదిశగా ఇంటి నుంచి బయలుదేరండి శుభాలు కలుగుతాయి. కాగా, శని, మంగళవారాలు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement