ప్రధాన వార్తలు

వరద ముంపులో అమరావతి
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాడికొండ : రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లడంతో గుంటూరు వైపు నుంచి రాజధాని అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి పది గంటల నుంచి బుధవారం ఉదయంలోపు జిల్లాలో సగటున 145 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడంతో తాడికొండ మండలం లాం వద్ద కొండవీటి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెదపరిమి వద్ద కోటేళ్లవాగు, కంతేరు వద్ద ఎర్రవాగు, అయ్యన్నవాగు, పాలవాగులు పొంగడంతో రహదారులపైకి నీరు చేరింది.రాజధాని నిర్మాణాలతో స్వరూపం కోల్పోయిన వాగులు..రాజధాని ప్రాంతంలో వివిధ నిర్మాణాల కారణంగా పాలవాగు, అయ్యన్నవాగులు వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. కొండవీటి వాగు నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేకుండాపోయింది. నిర్మాణాలతో వాగులు మూసుకుపోవడంతో పాటు రోడ్ల ఎత్తును పెంచడంతో వాగు నుంచి వచ్చే వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లే పరిస్థితి లేక వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టిసారించకుండా కొండవీటి వాగు వరదను గాలికొదిలేయడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. మరోవైపు.. తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, మంగళగిరి రూరల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు కొండవీటి వాగు వరద ఉధృతికి ముంపుబారిన పడి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా వరద నీరే ఉండటంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ చర్యలు నిల్..ఇక మంగళవారం రాత్రి తాడికొండ మండలంలో 225 మిల్లీమీటర్లు, తుళ్ళూరు మండలంలో 180.2 మి.మీ., మేడికొండూరు 140.2, ఫిరంగిపురం 111.2, మంగళగిరి 194.8 మి.మీ., వర్షం కురిసింది. ఈ వర్షం నీరు అంతా కొండవీడు కొండల మీదుగా మేడికొండూరు, తాడికొండ, తుళ్ళూరు, తాడేపల్లి మండలాల మీదుగా ప్రకాశం బ్యారేజ్‌కు చేరాల్సి ఉంది. కానీ, కొండవీటి వాగు ప్రక్షాళనకు రూ.234 కోట్లతో టీడీపీ కూటమి ప్రభుత్వం తలపెట్టిన ఎత్తిపోతల పథకంలో ఎక్కడా ఎగువ నుంచి దిగువకు వరద నీరు పూర్తిగా వచ్చేలా ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. నిజానికి.. వందల ఏళ్లుగా కొండవీటి వాగు పల్లపు ప్రాంతమైన రాజధాని ప్రాంతం నుంచే ప్రవహించేది. అయితే, ప్రస్తుతం దానిని మూసేసి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లుచేయకపోవడంవల్లే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. కాసుల కక్కుర్తి కోసం రాజధానిలో రిజర్వాయర్ల పేరుతో ఇతర నిర్మాణాలను చేపట్టడం కూడా వరద ముంపునకు కారణమైంది. దీంతో.. గత 25 ఏళ్లలో ఎప్పుడూ జరగని నష్టం ఇప్పుడీ ప్రాంతానికి వచ్చింది. ఇటు పంటలు మునగడంతో పాటు గ్రామాల్లో కూడా నీరు కదిలే పరిస్థితి లేక రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం..ఇదిలా ఉంటే.. గుంటూరు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రధాన రహదారి అమరావతి–గుంటూరు రోడ్డే. అయితే, ఈ మార్గంలో లాం వద్ద కొండవీటి వాగు ఏటా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ వంతెన నిర్మాణం హామీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. » మరో మార్గం.. జాతీయ రహదారి మీదుగా కంతేరు–తాడికొండ మధ్యలో ఎర్రవాగు వద్ద కూడా వరద పొంగి ప్రవహిస్తుంది. ఇక్కడ కూడా వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. » మంగళగిరి మీదుగా రాజధానికి ప్రవేశించాలన్నా నీరుకొండ–పెదపరిమి రహదారి వద్ద భారీ వర్షం కురిస్తే వారం పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఐనవోలు మీదుగా కూడా రహదారి పూర్తిగా దిగ్బంధం అవుతుంది. » ఒక్క చంద్రబాబు నివాసం మీదుగా వచ్చే కరకట్ట రహదారి మినహా రాజధానికి రావాలంటే ఏ ఒక్క రోడ్డు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర సచివాలయానికి ఉద్యోగులు వెళ్లలేక నానా ఇబ్బందులు పడ్డారు.

మళ్లీ బుడమేరు టెన్షన్.. సూర్యాపేట అతలాకుతలం
Heavy Rain Updates..👉తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలో గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలు బంద్. సూర్యాపేటలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరుసూర్యాపేటలోని నడిగూడెంలో ఇళ్లల్లోకి చేరిన వరద నీరు.చౌదరి చెరువు మత్తడి దూకడంతో నీట మునిగిన పలు కాలనీలుఇళ్లల్లో చేరిన నీటిని ఎత్తిపోస్తున్న కాలనీవాసులుఓఆర్ఆర్ సర్వీస్ రహదారి మూసివేతరాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి మూసివేతహిమాయత్సాగర్ నీరు విడుదలతో రోడ్డు పైనుంచి ప్రవాహంబారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లిస్తున్న పోలీసులువాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన పోలీసులుమళ్లీ బుడమేరు టెన్షన్..రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న బుడమేరు.విజయవాడ నగరవాసులకు మళ్లీ బుడమేరు వరద టెన్షన్గతేడాది ఇదే సమయంలో విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద.అధికారులు తక్షణమే స్పందించాలంటున్న స్థానికులు. ఎన్టీఆర్ జిల్లా..నీట ముగిసిన కంచికచర్ల బస్టాండ్చెరువును తలపిస్తున్న బస్టాండ్బస్టాండ్లోకి చేరుకున్న భారీ వరద నీరుకంచికచర్ల పట్టణంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు లోతట్టు ప్రాంతాలు జలమయం.జగ్గయ్యపేటలో భారీ వర్షాలకు సత్యనారాయణపురం, బలుసుపాడు రోడ్డులో పోటెత్తిన వరద నీరు.పెద్ద చెరువుకు గండి కొట్టటంతో ఆర్టీసీ కాలనీలో తగ్గిన వరద నీటి ప్రవాహం.ఇబ్రహీంపట్నం ఫెర్రీ కృష్ణానది పరివాహక ప్రాంతం, కొండపల్లి శాంతినగర్ బుడమేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశించిన కలెక్టర్తిరువూరు మండలం చౌటపల్లి -జి.కొత్తూరు గ్రామాల మధ్య ఉన్న వెదుళ్ళవాగుకు పోటెత్తిన వరద.చుట్టుపక్కల పది గ్రామాలకు పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు.పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు వద్ద పొంగిపొర్లుతున్న కూచివాగు.నిలిచిపోయిన రాకపోకలు.వత్సవాయి మండలం కంభంపాడు, మాచినేనిపాలెంలో భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు. కృష్ణాజిల్లా ..ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణనది వరద నీరు సముద్రంలోకి వదలడంతో దివిసీమకు తాకిన వరద ప్రవాహంఅవనిగడ్డ మండలం పాతఎడ్లంక వద్ద కృష్ణానది వరద నీరు రావడంతోఅవనిగడ్డ, పాతఎడ్లలంక, గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయంపాత ఎడ్లంక గ్రామాన్ని చుట్టుముట్టిన వరద నీరు తెగిపోయిన నదీపాయలో ఏర్పాటు చేసిన కాజ్ వేనాటు పడవ ద్వారా నదీపాయను దాటుతున్న గ్రామస్తులు, రైతులునదీపాయను దాటేందుకు నాటు పడవను ఏర్పాటు చేసిన అధికారులు ప్రకాశం బ్యారేజీ వద్ద హైఅలర్ట్..ప్రకాశం బ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులుప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ప్రవాహంప్రకాశం బ్యారేజీకి 4,87,508 క్యూసెక్కుల వరదబ్యారేజీ 70 గేట్లు తెరిచి మొత్తం నీరు దిగువకు విడుదలప్రకాశం బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 13.6 అడుగులుబ్యారేజీ వద్ద కొనసాగుతున్న ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికబ్యారేజీ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులుకృష్ణా నదిలో ప్రయాణం, ఈత నిషేధించిన అధికారులుహైదరాబాద్‌లో వర్షంహైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షంజూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టలో వర్షంబోరబండ, ఎస్ఆర్ నగర్, సనత్‌నగర్ ప్రాంతాల్లో వర్షంసూర్యాపేటకోదాడ నియోజకవర్గంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలుకోదాడలోని పలు కాలనీల్లో నిలిచిన వరద నీరుకాలనీల్లో వరద రావడంతో స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలింపుకోదాడ పెద్దచెరువు మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై నిలిచిన రాకపోకలుమోతె మండలం ఉర్లుగొండ వద్ద పొంగిపొర్లుతున్న పాలేరు వాగుకోదాడ మం. కూచిపూడి, తొగర్రాయి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న అంతర గంగా వాగునడిగూడెం మండలం రత్నవరం వాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయంఅనంతగిరి మండలం గోండ్రియాల-తమ్మర మధ్య రహదారి పై నుంచి వరద నీరు పారడంతో రాకపోకలకు అంతరాయంనాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్లు బంద్ కావడంతో ఊపిరి పీల్చుకుంటున్న కోదాడ నియోజకవర్గ ప్రజలుపెరిగిన గోదావరి నీటిమట్టం..భద్రాచలం వద్ద స్వల్పంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టంభద్రాచలం వద్ద ఉదయం ఏడు గంటలకు గోదావరి నీటిమట్టం 19.3 అడుగులుకొల్లూరు మండలంలో అప్రమత్తతకృష్ణా ఉద్ధృతితో కొల్లూరు మండలంలో అప్రమత్తతబాపట్ల జిల్లాలో కృష్ణా ఉద్ధృతితో కొల్లూరు మండలంలో అప్రమత్తతదోనెపూడి వద్ద చప్టా పైకి వరదనీరు, 4 లంక గ్రామాలకు తెగిన రాకపోకలుకొల్లూరు వద్ద నక్కపాయకు గండిపడిన చోట నుంచి వరద ప్రవాహంనక్కపాయకు గతేడాది గండిపడిన ప్రాంతం నుంచి వరద ప్రవాహంవరద పెరిగితే లంక గ్రామాలకు రాకపోకలు నిలిచే అవకాశంనేడు తెలంగాణలో అతి భారీ వర్షాలునేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశంమెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశంమెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీనిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశంభూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశంమహబూబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశంనిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీభూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీభద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీమిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణశాఖమహబూబ్నగర్లో ట్రాఫిక్ జామ్..మహబూబ్‌నగర్ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షందివిటిపల్లి వద్ద వాగు ఉద్ధృతికి కోతకు గురైన ఐటీ పార్కుకు వెళ్లే రహదారికోతకు గురై గుంతలో పడిన ఓ కంపెనీకి చెందిన బస్సు, తప్పిన ప్రమాదంబెంగళూరు-హైదరాబాద్ శేరిపల్లి సమీపంలో గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై నుంచి పారుతున్న నీళ్లు, నెమ్మదిస్తూ వెళ్తున్న వాహనాలు.జాతీయ రహదారిపై ఇరువైపుల 4 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.👉తెలంగాణలో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల దృష్ట్యా హైదరాబాద్‌లో హెడ్రా, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు.. ఏపీలోని పలు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల దృష్ట్యా గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

‘వార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన తొలి మల్టీస్టారర్ చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కియరా అద్వానీ హీరోయిన్. బాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో హిందీతో పాటు సౌత్‌లోనే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వార్ 2 ఎలా ఉంది? ఎన్టీఆర్,హృతిక్లలో ఎవరి నటన బాగుంది? సినిమాలో ప్లస్ & మైనస్ పాయింట్స్ ఏంటి తదితర అంశాలను ఎక్స్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు సాక్షి బాధ్యత వహించదు.ఎక్స్‌లో వార్ 2 సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొంతమంది అంటుంటే.. గతంలో వచ్చిన స్పై యాక్షన్ చిత్రాలతో పోలిస్తే ఇది యావరేజ్ అని మరికొంతమంది అంటున్నారు. అయితే ఎన్టీఆర్, హృతిక్‌ల నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు.వార్2 సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా హై- ఓల్టేజ్‌లో ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. అయితే, ఫస్టాప్‌లో వచ్చే ట్రైన్ యాక్షన్ సీన్ పెద్దగా మెప్పించలేదని చెబుతున్నారు. ఫస్టాప్ మొత్తానికి ప్రీ ఇంటర్వెల్ సీన్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.వార్2 చాలా సాధారణ కథ అని ఎక్కువమంది అభిప్రాయ పడుతున్నారు. కథ, కథనం కొత్తగా లేవని, సాధారణంగా ఉన్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX)లో కొన్ని లోపాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ పనితీరు మెప్పించలేదంటున్నారు.ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు మాత్రమే అదిరి పోయాయని కొందరు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించారని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే "వార్ 2" ఒక మంచి ఎంపిక అంటూ ఎక్కువ మంది అంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులకు తప్పకుండా నచ్చేలా పాత్రనే డిజైన్ చేశారని అంటూనే ఒక కొత్త కథనాన్ని ఆశించేవారికి ఇది సాధారణ సినిమాగా అనిపించవచ్చని తెలుపుతున్నారు.#War2 An okayish action entertainer. Not great, Not bad either - Strictly MID.Note : #NTR Fans should keep their expectations in check .there are moments where you whistle, but there are moments that will frustrate you , but the ending sort of pulls it back and you will walk…— Thyview (@Thyview) August 14, 2025 I’m just left speechless, what a movie #War2 never a dull moment, full action packed until the end. @iHrithik couldn’t take my eyes off you. #HrithikRoshan #JrNTR enjoyed seeing him in his role.Must watch movie in theatre.Blockbuster loading 💥💥💥💥 pic.twitter.com/rcBRFdCMYS— K k k Kiran (@kkkKiran0) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review - ⭐⭐⭐⭐/5#War2 is a BLOCKBUSTER in every sense! 💥 @iHrithik is pure swag, his stylish entry sets the tone.ThnComes @tarak9999 with a ROCKSTAR debut, his screen presence is FIRE!🔥 @advani_kiara dazzles like never before grace, glam & grit! Highly Recommended 👍 https://t.co/HsOlFqyiPO pic.twitter.com/MDWRPf4p6M— Cinema 🇮🇳 (@cinemaentr) August 14, 2025#War2Review: I don't want to spoil but giving too many details but it does distinguish itself from the other Spy Universe films (in a good way!). I liked #War, but #War2 has heart, and it has some enjoyable emotional moments, with good performances from the cast!— ✨️ (@daalchaawal_) August 14, 2025Coolie nakodakallara 😂Coolie demgindi antaga 😂😂😂😂@tarak9999 Hunt begins now all over world 🔥 long run chustaru 💥💥💥💥N T R pure massssss potential 🔥 #War2Review #War2 #War2Celebrations pic.twitter.com/9FFq2Sk2PS— palnadu🐯🔥 (@MpalnaduTiger) August 14, 2025Very below Average First Half disappointed Logic less physics They took Audience as granted there is no High moments in the Action Thriller Movie 😪 No Engaging sequence till now Need a very big jump for second half #War2#War2Review #War2Telugu #War2Disaster pic.twitter.com/hyNwxuDjzF— Don Ak (@Indiamyheart123) August 14, 2025#War2Review : Above average#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over content!the storyline might vary, but same theme makes it feel pretty ordinary and routine.Average VFXBGM could be betterRating: 2.5/5#HrithikRoshan #JrNTR #AyanMukerji https://t.co/DkwnqCnjkW— IndianCinemaLover (@Vishwa0911) August 14, 20252nd half: good back story, but story falls flat & predictable. Lacks emotional connect. Both actors nailed their respective performances. @tarak9999 acting & looks will shut every hater🔥 Result & BO depends on Coolie now. #War2Review #War2 #YRFSpyUniverse pic.twitter.com/FZvCbFiY0X— Alpsreviews (@alpsreviews) August 14, 2025#War2 is a strictly mediocre action thriller, leaning heavily on style over substance!The storyline is somewhat different from the previous spy universe films, which had potential but wasn’t able to fully capitalize on it. Though the storyline might vary, the tempo of the other…— Venky Reviews (@venkyreviews) August 14, 2025#War2 Prabhas Body - NTR face totally worthy VFX for N fans 🤣You pointed out #HHVM from FDFS… now take it back 😁We’re about to give you exactly what you deserve 🔥#DisasterWar2 #JanaNayagan #War2Review— Don Ak (@Indiamyheart123) August 14, 2025First Review #War2 : It is a sureshot hit. It has the magical chemistry of two handsome hunks,their superb action, and an outstanding dance picturised on both of them as its major plus points.#JrNTR & #HrithikRoshan Stole the Show. #KiaraAdvani is just for Sex appealing.🌟🌟🌟🌟 pic.twitter.com/XjbRz8t5og— Umair Sandhu (@UmairSandu) August 11, 2025#War2 intervalJust one word Blockbuster 💥 💥 Its an out and out entertainer You won’t want to even blink For a secondLord Ayan has really cooked 😍😍😍#HrithikRoshan as kabir is unmatchable #JrNTR introduction in Spy Universe is really good #KiaraAdvani is awesome too…— Rohit 😇 (@goonerfromind) August 14, 2025#War2: Disappointing and IllogicalThere is no proper justification for any character in the film, including the lead actors. Their mission and methods follow an abnormal flow. Both the emotion and the conflict between Hrithik and NTR fail to work.— TrackTollywood (@TrackTwood) August 14, 2025

Pakistan: స్వాతంత్ర్య సంబరాల్లో కాల్పుల మోత.. ముగ్గురు మృతి
కరాచీ: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కరాచీ నగరంలో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అలాగే నగరంలో జరుగుతున్న దోపిడీలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఐదుగురు హతమయ్యారు.కరాచీలోని పలు ప్రాంతాలలో వైమానిక కాల్పులు జరిగినట్లు పాక్ మీడియా తెలిపింది. వివిధ ఘటనల్లో 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురి నుంచి తుపాకీలను స్వాధీనం చేసుకున్నారు. వైమానిక కాల్పులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారువైమానిక కాల్పుల కారణంగా కరాచీలో ఒక వృద్ధుడు, ఎనిమిదేళ్ల బాలిక, మరొక యువకుడు మరణించారని రెస్క్యూ అధికారులు పాకిస్తాన్ జియో న్యూస్‌కు తెలిపారు. నగరం అంతటా చోటు చేసుకున్న వేర్వేరు సంఘటనల్లో 64 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని లియాఖతాబాద్, కోరంగి, లియారి, మెహమూదాబాద్, అక్తర్ కాలనీ, కీమారి, జాక్సన్, బాల్డియా, ఓరంగి టౌన్, పపోష్ నగర్లలో వైమానిక కాల్పుల సంఘటనలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. గాయపడిన వారిని సివిల్, జిన్నా, అబ్బాసి షహీద్ ఆసుపత్రులకు, ప్రైవేట్ వైద్య కేంద్రాలకు పోలీసులు తరలించారు. వైమానిక కాల్పులకు పాల్పడినవారిపై వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

నటి శిల్పా శెట్టి దంపతులకు బిగ్ షాక్.. కేసు నమోదు
ఢిల్లీ: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాక్ తగిలింది. వారిద్దరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. అనంతరం, ఈ కేసు దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్పగించారు.వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన వ్యాపారవేత్త, లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కొఠారి.. నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015-2023 మధ్య కాలంలో శిల్పా శెట్టి దంపతులు.. రూ.60 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. తన వ్యాపార సంస్థలను విస్తరించడానికి తాను ఆ డబ్బును పెట్టుబడి పెట్టానని కొఠారి ఫిర్యాదులో పేర్కొన్నాడు. కానీ.. ఆ నిధులను శెట్టి వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.ఫిర్యాదులో భాగంగా.. రాజేశ్ ఆర్య అనే వ్యక్తి ద్వారా తనకు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పరిచయం అయినట్టు కొఠారీ తెలిపారు. ఆ సమయంలో వారు బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ అనే హోమ్ షాపింగ్ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేవారని, కంపెనీలో దాదాపు 87.6 శాతం వాటా వారిదేనని చెప్పారు. మొదట 12 శాతం వడ్డీతో రూ. 75 కోట్ల రుణం కావాలని వారు కోరారని, కానీ అధిక పన్నుల భారం నుంచి తప్పించుకునేందుకు ఆ మొత్తాన్ని రుణం బదులుగా పెట్టుబడిగా మార్చాలని తనను ఒప్పించారని కొఠారీ వివరించారు. నెలవారీ రాబడితో పాటు అసలు కూడా తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.#BREAKING | Legal Trouble For Actress #ShilpaShetty- Shilpa Shetty, Raj Kundra booked.- Businessman claims Rs 60 cr fraud; F.I.R filed.- Businessman alleges cheating in deal, claims Rs 60 cr misused for personal expenses. pic.twitter.com/wTgDZtfu2v— TIMES NOW (@TimesNow) August 14, 2025వారి మాటలు నమ్మి, 2015 ఏప్రిల్‌లో రూ. 31.9 కోట్లు, అదే ఏడాది సెప్టెంబర్‌లో మరో రూ. 28.53 కోట్లు బదిలీ చేసినట్లు కొఠారీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి వ్యక్తిగత గ్యారెంటీ ఇచ్చినా, అదే ఏడాది సెప్టెంబర్‌లో ఆమె కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత, 2017లో మరో ఒప్పందంలో విఫలమవడంతో బెస్ట్ డీల్ టీవీ కంపెనీ దివాళా ప్రక్రియలోకి వెళ్లినట్లు తనకు తెలిసిందని కొఠారీ వాపోయారు. ఇక, కొఠారీ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసం జరిగిన మొత్తం రూ. 10 కోట్లకు పైగా ఉండటంతో, ఈ కేసును జుహు పోలీస్ స్టేషన్ నుంచి ఈఓడబ్ల్యూకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్.. కావ్యా మారన్ జట్టు సంచలన విజయం
పురుషుల హండ్రెడ్ లీగ్‌లో కావ్యా మారన్ జట్టు నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ సంచలన విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ నిన్న (ఆగస్ట్ 13) సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి గెలుపొందింది. గెలుపుకు 5 పరుగులు కావాల్సిన తరుణంలో గ్రహం క్లార్క్ నమ్మశక్యం కాని రీతిలో సిక్సర్ బాది సూపర్ ఛార్జర్స్‌ను గెలిపించాడు. తైమాల్ మిల్స్ వేసిన స్లో డెలివరీని క్లార్క్ అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశాడు. ఈ సిక్సర్‌తో ప్రత్యర్థి హోం గ్రౌండ్ ఒక్కసారిగా మూగబోయింది. మైదానం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఈ ఓటమితో సథరన్ బ్రేవ్ వరుసగా విజయాలకు బ్రేక్ పడింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. లారీ ఇవాన్స్ (53), జేమ్స్ కోల్స్ (49 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో జేకబ్ డఫీ 3, మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సూపర్ ఛార్జర్స్.. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ గెలుపు కష్టమన్నట్లు సాగింది. అయితే గ్రహం క్లార్క్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కీలక తరుణంలో 24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో అజేయమైన 38 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి మిచెల్ సాంట్నర్ (24) సహకరించాడు. అంతకుముందు జాక్ క్రాలే (29), హ్యారీ బ్రూక్ (24) ఓ మోస్తరు స్కోర్లు చేసి సూపర్ ఛార్జర్స్‌ను మ్యాచ్‌లో ఉంచారు. బ్రేవ్ బౌలర్లలో ఓవర్టన్ 3, జోఫ్రా ఆర్చర్, తైమాల్ మిల్స్ తలో 2 వికెట్లు తీశారు.

యూపీఐలోని ఫీచర్ నిలిపివేత?
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సంబంధిత మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కొందరు నిపుణులు భావిస్తున్నారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పుల్ ట్రాన్సాక్షన్స్ అని పిలువబడే పర్సన్-టు-పర్సన్ (పీ 2 పీ) డిజిటల్ చెల్లింపులను నిలిపివేయాలని చూస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఈ విషయం తెలిసిన వారిని ఉటంకిస్తూ కొన్ని సంస్థలు వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని ఎన్పీసీఐ ఇప్పటికే బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలకు తెలియజేసినట్లు అందులో తెలిపాయి. యూపీఐ యాక్టివిటీలో పీ2పీ పుల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 3% మాత్రమే ఉన్నాయని, తద్వారా ఎన్పీసీఐ ఈ ఫీచర్‌ను ఉపసంహరించుకోవడం సులభమవుతుందని పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి.యూపీఐ పుల్ ట్రాన్సాక్షన్ ఫీచర్ అంటే ఏమిటి?యూపీఐ పుల్ లావాదేవీని కలెక్ట్ రిక్వెస్ట్ అని కూడా పిలుస్తారు. ఏదైనా షాపుకు వెళ్లి సాధారణంగా క్యూఆర్ స్కాన్ చేసి మనీ పంపాలనుకునేవారు ఎంత మొత్తం చెల్లించాలో ఎంటర్ చేసి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకు భిన్నంగా కొన్ని సందర్భాల్లో డబ్బు తీసుకునేవారే ఎంత కావాలో ఓటీపీ, బార్కోడ్, మెసేజ్ లింక్ రూపంలో రెక్వెస్ట్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేసి డబ్బు పంపాలనుకునేవారు యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే వెంటనే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు గ్రహీతలు మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాన్ని గ్రహించలేక ఎదుటివారు డబ్బు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. పైగా యూపీఐ మొత్తం లావాదేవీల్లో ఇది 3 శాతం మాత్రమే. ఎన్పీసీఐ దీని నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. కాబట్టి దీన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కొందరు చెబుతున్నారు.ఇదీ చదవండి: ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసా?ఇదిలాఉండగా, ఇటీవల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. 2025 ఆగస్టు 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలను నమోదు చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా UPI చాలా వేగంగా ముందుకు సాగుతోంది. 2023 నుంచి దాని రోజువారీ వినియోగాన్ని రెట్టింపు చేసింది. అప్పట్లో, ఇది రోజుకు దాదాపు 35 కోట్లు లావాదేవీలను నిర్వహించేది. ఆ సంఖ్య ఆగస్టు 2024 నాటికి 50 కోట్లకు చేరింది. కాగా ఇప్పుడు తాజాగా ఇది 70 కోట్ల మైలురాయిని చేరుకుంది. అయితే వచ్చే ఏడాది నాటికి 100 కోట్ల లావాదేవీలను చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్ కలిగిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఒక ఆరోపణలతో వార్తల్లో టాప్‌లో నిలవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల ఫాలోవర్స్ కలిగిన సందీపా విర్క్ రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.ఇన్స్టాగ్రామ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన సందీప విర్క్ ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటారు. అలాగే హైబూకేర్.కామ్ అనే వ్యాపార సంబంధిత వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. మరోవైపు ఆమెకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్‌తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విర్క్ తన బయోలో తాను వ్యాపారవేత్త, నటి అని చెప్పుకున్నారు.తాజాగా విర్క్‌ను రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం, 420 (మోసం) కింద మొహాలీలోని ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం, బుధవారం ఢిల్లీ, ముంబైలోని పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విర్క్ మోసపూరిత మార్గాల ద్వారా లెక్కకుమించిన స్థిరాస్తులను సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆమె సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి ఉనికిలో లేవని తెలుస్తోంది. ఆమె వెబ్సైట్లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవనే ఆరోపణలున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేతురామన్‌తో విర్క్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)నుండి సుమారు రూ. 18 కోట్ల విలువైన నిధులను సేతురామన్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయన తనకు విర్క్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా విర్క్‌ను పీఎంఎల్ఏ నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం.

జాబిలిపై అణువిద్యుత్ సాధ్యమా?
వ్యోమగాములు తమ అంతరిక్ష పరిశో ధనలకు మజిలీగా చందమామను మార్చుకోవాలని భావిస్తున్న తరుణంలో చంద్రునిపై ఏకంగా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పాలని నాసా భావిస్తోంది. అయితే 2030కల్లా అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యమా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎక్కువకాలంపాటు వ్యోమగాములు చంద్రునిపైనే స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవించాలన్నా, ఎలాంటి విద్యుత్ అవాంతరాల లేకుండా శాస్త్రసాంకేతిక పరిశోధనలు కొనసా గించాలన్నా అనుక్షణం విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రాణాధార ఉపకరణాలకూ విద్యుత్ ఖచ్చితంగా అవసరం. అందుకే ఐదేళ్ల లోపే అణువిద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయా లని నాసా భావిస్తోంది. కేంద్రక విచ్చిత్తి (న్యూక్లియర్ ఫిజన్) సూత్రంపై పనిచేసే అణుప్లాంట్‌ను అక్కడ నెలకొల్పనున్నారు. అయితే నాసాకు పోటీగా సొంత అణువిద్యుత్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చైనా, రష్యాలు సైతం ప్రకటించాయి. మరో పదేళ్లలో ఈ ప్లాంట్లను ఏర్పాటుచేస్తామని ఇప్పటికే వెల్లడించాయి. అణు విద్యుతే ఎందుకు?చందమామపై స్థిరనివాసం ఏర్పర్చుకునే వ్యోమగాముల నిరంతర విద్యుత్ అవసరా లను సౌరవిద్యుత్ ఏమాత్రం తీర్చలేదు. ఎందుకంటే చంద్రునిపై ప్రతిరోజూ సూర్యకాంతి ప్రసారం కాదు. 14 రోజులపాటు ఏకధాటి గా ఎండకాచి తర్వాత 14 రోజులపాటు మైనస్ డిగ్రీ సెల్సియస్ స్థాయిలో చిమ్మచీకటి నెలకొంటుంది. ఈ చీకటిమయ రోజుల్లో విద్యుత్ అవసరాలు తీర్చే ఏకైక ప్రత్యామ్నా యంగా అణువిద్యుత్కేంద్రం నిలుస్తోంది. అందుకే ఎంత ఖర్చయినాసరే వ్యయప్రయా సల కోర్చి చంద్రునిపై న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నాసా కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదన లకు సైతం పచ్చజెండా ఊపింది. మరో ఐదేళ్లలో అక్కడ అణువిద్యుత్ ప్లాంట్ కలను సాకారంచేయాలని కంకణం కట్టుకుంది. చిన్నస్థాయిలో మొదలెట్టిఅణువిద్యుత్ కేంద్రంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినా అక్కడ శూన్యం ఉంటుందికనుక రేడియోధార్మికత అంతటా వ్యాపిస్తుందన్న భయం అక్కర్లేదు. థర్మల్, జల, పవన విద్యుత్‌లతో పోలిస్తే చందమామపై అణువిద్యుత్ మాత్రమే ఆచరణ సాధ్యమవుతుంది. సౌరఫలకాలతో సూర్యకాంతిని ఒడిసిపట్టి సౌర విద్యుత్‌ను తయారుచేసినా అది అక్కడి వ్యోమగాముల అవసరాలను ఏమాత్రం తీర్చలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుని న్యూక్లియర్ ప్లాంట్ వైపు శాస్త్రవేత్తలు మొగ్గుచూపుతున్నారు. తొలుత కేవలం 100 కిలోవాట్ల విద్యుత్‌ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నెలకొల్పనున్నారు. భూమి మీద అయితే ఇదే 100 కిలోవాట్ల విద్యుత్‌తో 80 గృహాల విద్యుత్అవసరాలు తీర్చొచ్చు. దశలవారీగా ప్లాంట్‌ను విస్తరించి గణనీయమైన స్థాయిలో విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్సమస్యలెన్నో...జల, థర్మల్ విద్యుత్ ప్లాంట్లతో పోలిస్తే అణువిద్యుత్ ప్లాంట్‌కు పెద్దగా భూవిస్తీర్ణంతో పనిలేదు. కానీ చంద్రుని మీదకు ఈ మొత్తం అణువిద్యుత్ వ్యవస్థ ఉపకరణాలను మోసుకెళ్లాలంటే చాలా చాలా కష్టం. పైగా ఇవి రాకెట్లో తరలించేంత తేలికగా ఉండాలి. అత్యధిక బరువులను ఇప్పుడున్న రాకెట్లు అస్సలుమోయలేవు. ఒకవేళ అధిక బరువులను మోసుకెళ్లేలా వ్యోమనౌకలను డిజైన్చేసి రూపొందించినా అవి అంత బరువును మోస్తూకూడా జాగ్రత్తగా చంద్రునిపై ల్యాండ్ కావాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చి అది క్రాష్ ల్యాండ్ అయినా వేలకోట్ల రూపాయల నష్టం ఖాయం. భూమిపై అయితే అణువిద్యుత్ కేంద్రాన్ని ఎంతో మంది సాంకేతిక నిపుణులు తీరిగ్గా, నిశితంగా తనిఖీచేసి నిర్మిస్తారు. చంద్రునిపై ఈ ప్లాంట్‌ను నిర్మించాలంటే కార్మిక సిబ్బంది దొరకరు. ఉన్న ఆ కొద్దిపాటి వ్యోమగాములే అణుప్లాంట్ ఉన్నతాధికారుల అవతారమెత్తి ప్లాంట్‌ను బిగించాల్సి ఉంటుంది. అణువిద్యుత్ ప్లాంట్ నుంచి అత్యధిక స్థాయిలో వేడిమి వెలువడుతుంది. దానికి చల్లబరిచే కూలింగ్ వ్యవస్థలను ఏర్పాటుచేయాలి. వాటిని కూడా భూమి మీద నుంచే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన వ్యవహారం. శూన్యస్థితిని తట్టుకునేలా వినూత్న రీతిలో ప్లాంట్‌ను డిజైన్ చేయాల్సి ఉంటుంది. రేడియోధార్మిక వ్యర్థ్యాల పారబోత, ప్లాంట్ పాడైతే రిపేర్లు వంటి ఎన్నో అవరోధాలు అక్కడి హఠాత్తుగా స్వాగతం పలుకుతాయి.వీటిని తట్టుకుంటూనే ప్లాంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. ట్రంప్ హయాంలో నాసాకు అంతరిక్ష పరిశోధనా బడ్జెట్లో భారీ కోత పెట్టిన నేపథ్యంలో ఇతర మార్గాల్లో ఆదాయం సమకూర్చి ఈ ప్రాజెక్ట్‌ను సఫలీకృతం చేయాల్సి ఉంది. ఇన్ని బాలారిష్టాలను దాటుకుని ప్లాంట్ ఏర్పాటు సుసాధ్యమైతే జాబిలిపై మానవనివాసం ఎలాంటి జంజాటాలు లేకుండా హాయిగా సాగుతుంది.

‘కన్ఫర్డ్ ఐపీఎస్’లకు రెడ్‌బుక్ కుట్ర బాధ్యతలు!
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు సన్నద్దమవుతోంది. అందుకోసం క్యాడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్ఫర్డ్ ఐపీఎస్’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. రెడ్‌బుక్ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు.. టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.సీఐడీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్ రెడ్‌బుక్ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు. అస్మదీయ కన్ఫర్డ్ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్ కుట్ర.. చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. తమకు అస్మదీయులైన కన్ఫర్డ్ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్ఫర్డ్ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్ఫర్డ్ ఐపీఎస్ అ«దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా క్యాడర్ ఐపీఎస్ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.
ఈవీఎం గోల్మాల్ రివీల్.. సుప్రీంకోర్టు రీకౌంటింగ్‌లో ఓడిన అభ్యర్థి గెలుపు
రాత్రి నుంచి ముంబైని వదలని వర్షం.. నేడు కూడా..
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
రేపు ఎర్రకోటపై ‘నయా భారత్’.. సంబరాల జాబితా ఇదే
మళ్లీ బుడమేరు టెన్షన్.. సూర్యాపేట అతలాకుతలం
యూపీఐలోని ఫీచర్ నిలిపివేత?
Hyderabad: అంతా అటెన్షన్
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్.. కావ్యా మారన్ జట్టు సంచలన విజయం
ఫేస్బుక్లో స్నేహం.. పెట్టుబడి మోసం
సిరీస్ డిసైడర్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
అమ్మతో కలిసి సుప్రీత బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
చందనా.. డబ్బులిస్తావా.. కోరిక తీరుస్తావా!
ఓట్ల చోరీ-విపక్షాల నిరసనలు
బిక్షాటన చేస్తూ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం
ఈవీఎం గోల్మాల్ రివీల్.. సుప్రీంకోర్టు రీకౌంటింగ్‌లో ఓడిన అభ్యర్థి గెలుపు
రాత్రి నుంచి ముంబైని వదలని వర్షం.. నేడు కూడా..
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
రేపు ఎర్రకోటపై ‘నయా భారత్’.. సంబరాల జాబితా ఇదే
మళ్లీ బుడమేరు టెన్షన్.. సూర్యాపేట అతలాకుతలం
యూపీఐలోని ఫీచర్ నిలిపివేత?
Hyderabad: అంతా అటెన్షన్
నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్సర్.. కావ్యా మారన్ జట్టు సంచలన విజయం
ఫేస్బుక్లో స్నేహం.. పెట్టుబడి మోసం
సిరీస్ డిసైడర్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్
పేరుకే పల్లెటూరు.. చూస్తే సిటీ లెవల్!
మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా.. ఈ హీరోని గుర్తుపట్టారా?
మెడలో పసుపు తాడుతో 'కోర్ట్' హీరోయిన్
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. సంఘంలో గౌరవం
మనదే బాగుంది.. ఒక్క హామీ అమలు చేయకున్నా నిత్యం కనిపిస్తున్నాం..!!
ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరతాయి.. భూములు కొంటారు
నీకు శ్రమ లేకుండా నీ ఓటు నేను వేశాలే! వెళ్లు..!
ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్ సుజాత
నీట మునిగిన ‘ఏపీ రాజధాని’
ఎన్నికల కమిషన్ విఫలం: హైకోర్టు
'కూలీ' రెమ్యునరేషన్.. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ?
జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు
నన్నెవ్వరూ ఆపలేరు.. ఎన్టీఆర్ కౌంటర్ లోకేష్‌కేనా?
చందనా.. డబ్బులిస్తావా.. కోరిక తీరుస్తావా!
పులివెందుల,ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్
ఓటీటీకి ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓట్ల చోరీ-విపక్షాల నిరసనలు
బిక్షాటన చేస్తూ ఆలయ నిర్మాణానికి భారీ విరాళం
ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ
సినిమా

ఆ కండీషన్స్ ఒప్పుకుంటేనే వేతనాల పెంపు: నిర్మాత దిల్ రాజు
ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలు, ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ చర్చలు ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇవాళ జరిగిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో సినీ వర్కర్స్ సమ్మె యథావిధిగా కొనసాగనుంది. నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య కొన్ని ప్రతిపాదనలపై సయోధ్యం కుదరలేదని తెలుస్తోంది. దీంతో మరోసారి భేటీ కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమావేశానికి నిర్మాత దిల్ రాజు కూడా హాజరై మాట్లాడారు.ఈ చర్చలపై దిల్ రాజు మాట్లాడుతూ... ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ , నిర్మాతల మధ్య మీటింగ్ జరిగింది. వేతనాల పెంపు, నిర్మాతల వైపు నుంచి రెండు వర్కింగ్ కండీషన్స్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. ఆ షరతులకు ఒప్పుకుంటేనే వేతనాలను పెంచుదామని నిర్మాతలు చెప్పారు. మరోసారి చర్చలు జరుగుతాయి. ఎందుకంటే ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. రూ.2 వేల కన్నా తక్కువ వేతనం తీసుకునే వారికి ఒక పర్సంటేజీ ఆఫర్ చేస్తున్నాం. దాని కన్నా ఎక్కువ వేతనం తీసుకునే వాళ్లకు మరొక పర్సంటేజీ ఇవ్వాలని ప్రతిపాదించాం. ఫెడరేషన్‌లోని అన్ని యూనియన్లతో మాట్లాడుకుని వస్తే సమస్య పరిష్కరిస్తాం' అని అన్నారు.రేపటి నుంచి చర్చలు కూడా కొనసాగుతాయని నిర్మాత సి కల్యాణ్ తెలిపారు. రేపు, ఎల్లుండి కూడా మీటింగ్స్ జరుగుతాయని క్లారిటీ ఇచ్చారు. డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ ఈ మూడు యూనియన్లకు పర్సంటేజ్ పెంచలేమని అన్నారు. సమ్మె కొనసాగించెందుకు నిర్మాతలు సైతం సిద్దమేనని ఆయన ప్రకటించారు.

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష డేట్ వచ్చేసింది.. హోస్ట్ నాగార్జున కాదు
ప్రతి ఏడాది బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) కోసం ఎదురుచూస్తారు. కానీ ఈసారి సీజన్ 9 కన్నా ముందు బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సీజన్లో ఏదో తూతూమంత్రంగా కామనర్స్‌ను సెలక్ట్ చేయడం లేదు. వారికంటూ ప్రత్యేకంగా ఓ షో పెట్టి.. అందులో పోటీలు నిర్వహించి, జడ్జిల నిర్ణయాల ఆధారంగా సామాన్యులను ఎంపిక చేస్తారన్నమాట!వచ్చేవారమే అగ్నిపరీక్షతాజాగా ఈ అగ్నిపరీక్ష వివరాలు వెల్లడిస్తూ ఓ ప్రోమో రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ 4వ సీజన్ విన్నర్ అభిజిత్, నాన్‌స్టాప్ (ఓటీటీ) సీజన్ విజేత బిందు మాధవి, ఫస్ట్ సీజన్ థర్డ్ రన్నరప్ నవదీప్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నట్లు చూపించారు. ఈ షో ఆగస్టు 22నుంచి సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజు హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిపరీక్షకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. మరి ఈ షోలో ఎవరెవరు పాల్గొననున్నారు? ఎలా ఉండబోతోంది? అన్నది తెలియాలంటే ఇంకో 9 రోజులు ఆగాల్సిందే! చదవండి: థైరాయిడ్ క్యాన్సర్.. సర్జరీ తర్వాత గొంతు మూగబోయింది: యాంకర్

ది రాజాసాబ్ హీరోయిన్‌కు ప్రభాస్ సర్ప్రైజ్.. అదేంటో తెలుసా?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆహార ప్రియుడని మనకు తెలిసిందే. అంతేకాదు.. అతిథులకు మర్యాద చేయడంలో ఇంకా ముందుంటారు. అది సెట్లో అయినా.. ఇంట్లో అయినా సరే కడుపునిండా భోజనం పెట్టే పంపిస్తాడు. అలా ఇప్పటికే షూటింగ్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకు సైతం భోజనాలు ఏర్పాటు చేస్తుంటారు.తాజాగా హరిహర వీరమల్లు హీరోయిన్ నిధి అగర్వాల్‌కు భోజనం పంపించారు మన ప్రభాస్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. అలాగే ప్రభాస్‌తో పాటు వంశీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఆంధ్ర వంటకాలతో పాటు అద్భుతమైన మీల్స్ దొరికాయని సంతోషం వ్యక్తం చేసింది.ది రాజాసాబ్‌లో నిధి..ప్రభాస్ హీరోగా వస్తోన్న రొమాంటిక్ హారర్ ఫిల్మ్ ది రాజాసాబ్‌లో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ పలుసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. ది రాజాసాబ్ విడుదల తేదీని ఫిక్స్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 5 థియేటర్లలో సందడి చేయనుందని ప్రకటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌తో పాటు రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్?ఇటీవలే ఏపీకి ప్రభుత్వ కారులో నిధి అగర్వాల్ ప్రయాణించారు. ఓ ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లిన నిధి అగర్వాల్‌కు ఏకంగా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని బోర్డ్ ఉన్న కారులో వెళ్లారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఆ తర్వాత ఆ కారు ఏర్పాటులో తన ప్రమేయం లేదంటూ క్లారిటీ ఇస్తూ లేఖను పోస్ట్ చేసింది. గతనెల రిలీజైన హరిహర వీరమల్లులో హీరోయిన్గా నిధి అగర్వాల్ కనిపించింది.Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 12, 2025

పరదా కోసం రోడ్డెక్కిన స్టార్ హీరోయిన్!
అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో వస్తోన్న తాజా చిత్రం 'పరదా'. ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్ రిలీజ్ చేయగా..ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అనుపమ ఫుల్ బిజీగా ఉంది. దీంతో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.తాజాగా తన మూవీ పరదా ప్రమోషన్స్‌ను రోటీన్‌కు భిన్నంగా నిర్వహించింది. వైజాగ్‌లో ఏకంగా రోడ్డుపై మైక్ పట్టుకుని ప్రచారం చేసింది. పరదాలమ్మా.. పరదాలు.. రంగురంగుల పరదాలు.. తీసుకోవాలమ్మా.. తీసుకోవాలి అంటూ కారులో నిలబడి తన మూవీని ప్రమోట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.Vizag ♥️ #paradha on August 22nd pic.twitter.com/mOY1Q5bIF6— Anupama Parameswaran (@anupamahere) August 12, 2025Actress Anupama Parameswaran markets her 22 August release #Paradha during her Andhra tour! pic.twitter.com/9RxeYvglMI— idlebrain jeevi (@idlebrainjeevi) August 12, 2025
క్రీడలు

6 నెలల్లో క్రీడా బిల్లు అమలు
న్యూఢిల్లీ: రాబోయే ఆరు నెలల్లో జాతీయ క్రీడా బిల్లు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుకు ఆమోద ముద్ర లభించడంతో... ప్రపంచంలో క్రీడా చట్టం అమల్లోకి వచ్చిన 21వ దేశంగా భారత్ నిలిచింది. ఈ బిల్లు అమలుతో దేశ క్రీడారంగానికి ఎంతో లబ్ధి చేకూరనుంది. మౌలిక వసతులు మెరుగు పడటంతో పాటు... క్రీడల్లో పారదర్శకత పెరగనుంది. పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం లభించిన అనంతరం క్రీడా మంత్రి దీనిపై స్పందిస్తూ... ఇప్పటికే నియమ నిబంధనల రూపకల్పన ప్రారంభమైందని వెల్లడించారు. ‘ఈ బిల్లు వీలైనంత త్వరగా అమల్లోకి వస్తుంది. రాబోయే ఆరు నెలల్లో వంద శాతం దీన్ని అమలు చేసే విధంగా విధివిధానాలు రూపొందిస్తున్నాం. దీనివల్ల క్రీడారంగానికి ఇతోధిక లబ్ధి చేకూరుతుంది. భారత అథ్లెట్లు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గేనే సమయంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే జాతీయ విధానానికి అనుగుణంగా కొన్ని సూచనలు ఉంటాయి. ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని వినియోగిస్తారు. అవసరమైన పోస్టుల సృష్టి, పరిపాలనా అనుమతుల వంటి వాటి ప్రక్రియ ప్రారంభమైంది. జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ), జాతీయ క్రీడా ట్రైబ్యునల్ (ఎన్ఎస్టీ)కు విధానపరమైన అనుమతులను వీలైనంత త్వరగా పూర్తి చేస్తాం’ అని మాండవీయ పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో క్రీడా రంగంలో ఇది అతిపెద్ద సంస్కరణ అని క్రీడా మంత్రి వెల్లడించారు. ప్రభుత్వానికి సర్వాధికారాలు... బిల్లు ఆమోదంతో అంతర్జాతీయ ఈవెంట్లలో భారత అథ్లెట్లు పాల్గొనడంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లభించింది. గతంలోనూ ఇదే పద్ధతి కొనసాగినా... దానికంటూ ప్రత్యేకమైన విధానం లేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో క్రీడల్లో పోటీపడాల్సి వచ్చిన సందర్భంతో పాటు దౌత్యపరంగా సఖ్యతగా లేని మరే దేశంలో పర్యటించాల్సి వచ్చినా... ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా క్రీడా చట్టం అమలవుతున్న దేశాల్లో... అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే అంశంపై ఆయా దేశాల ప్రభుత్వాలదే తుది నిర్ణయం. ఇది కేవలం అసాధారణ పరిస్థితుల కోసం ఉద్దేశించి రూపొందించింది... అంతే తప్ప జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం కోసం తీసుకొచ్చింది కాదు. జాతీయ భద్రతా బెదిరింపులు, దౌత్య బహిష్కరణలు లేదా ప్రపంచ అత్యవసర పరిస్థితులు వంటివి సంభవించినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. 2008 ముంబై దాడుల సమయం నుంచే పాకిస్తాన్‌తో భారత పురుషుల క్రికెట్ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ప్రధాన మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతున్నాయి. ఆయా సమయాల్లో విదేశాంగ శాఖ అనుమతులతోనే టీమిండియా మ్యాచ్‌లు ఆడుతోంది. ఇకపై కూడా ఈ విధానమే కొనసాగుతుంది’ అని కేంద్ర మంత్రి చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... ఈ బిల్లు ద్వారా జాతీయ క్రీడా సమాఖ్యలు, జాతీయ క్రీడా ట్రైబ్యునల్, జాతీయ క్రీడా ఎన్నికల ప్యానెల్ ఇలా అన్నింటిని జాతీయ క్రీడా బోర్డు (ఎన్ఎస్బీ) పర్యవేక్షణలోకి తీసుకురానున్నారు. దీంతో క్రీడల్లో పారదర్శకత పెరగడంతో పాటు వివాద పరిష్కారం మరింత సులువు కానుంది. ఆరంభంలో ఈ బిల్లుపై అవగాహన కొరవడినా... ఆ తర్వాత జాతీయ క్రీడా సమాఖ్యలు, అథ్లెట్లు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దీనికి మద్దతునిచ్చాయని క్రీడా శాఖ మంత్రి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలతో చర్చించి విశ్లేషించి 60 రౌండ్లకు పైగా ‘చింతన్ శిబిర్’లను నిర్వహించి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించిన అనంతరమే బిల్లును పార్లమెంట్ ముందుంచినట్లు క్రీడా మంత్రి వెల్లడించారు. కొత్త చట్టంతో దేశ క్రీడా రంగం పురోగతి సాధిస్తుందనే నమ్మకముందన్న మాండవీయ... రాబోయే రెండు దశాబ్దాల్లో భారత్‌ను క్రీడల్లో సూపర్ పవర్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ... ‘జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో రోజుల తరబడి మాట్లాడిన తర్వాతే ఈ బిల్లును రూపొందించాం. అథ్లెట్లు, కోచ్‌లు, క్రీడా విశ్లేషకులు, నిపుణులు ఇలా ఒక్కరేంటి అందరీని సంప్రదించాం. బిల్లులోని ప్రతి నిబంధనను వారికి వివరించాం. వాటి అవసరమేంటో స్పష్టంగా చెప్పిన తర్వాత వారి అభిప్రాయాలు తీసుకున్నాం. ఎలాంటి బిల్లు కావాలో వారినే అడిగాం. వారిచ్చిన సూచనలు సలహాలతో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టుల్లోని క్రీడా న్యాయవాదుల నుంచి కూడా సలహాలు తీసుకున్నాం. వారి సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ముసాయిదా క్రీడా బిల్లును రూపొందించింది. కానీ దాన్ని అమలు చేయలేకపోయింది’అని క్రీడా శాఖమంత్రి వెల్లడించారు. అథ్లెట్లతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలోనే క్రీడా సమాఖ్యల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ‘మహిళా అథ్లెట్ల ప్రాతినిధ్యం పెంచాం. ప్రతి జాతీయ క్రీడా సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీలో నలుగురు మహిళా అథ్లెట్లు తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ‘స్పోర్ట్స్ మెడల్ స్ట్రాటజీ’’ని కూడా తీసుకొస్తాం. ఇది అంతర్జాతీయ టోర్నీల్లో మన అథ్లెట్లు పతకాలు సాధించేందుకు రోడ్‌మ్యాప్‌లా నిలవనుంది’ అని మాండవీయ ఆశాభావం వ్యక్తం చేశారు.

తమిళ్ తలైవాస్ కెప్టెన్‌గా పవన్
న్యూఢిల్లీ: ఈనెల 29న ప్రారంభం కానున్న ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో పోటీపడే పలు జట్లు తమ కెప్టెన్లను ప్రకటించాయి. తమిళ్ తలైవాస్ కొత్త కెప్టెన్‌గా పవన్ సెహ్రావత్, వైస్ కెప్టెన్‌గా అర్జున్ దేశ్వాల్ వ్యవహరిస్తారు. గత సీజన్లో తమిళ్ తలైవాస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. 22 మ్యాచ్‌ల్లో ఆ జట్టు కేవలం ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచి ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించడంలో విఫలమైంది. తొమ్మిదో సీజన్ వేలంలో తమిళ్ తలైవాస్ రూ. 2 కోట్ల 26 లక్షలు చెల్లించి పవన్‌ను కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో పవన్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే గాయపడి సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సీజన్ ముగిశాక పవన్‌ను తలైవస్ విడుదల చేయగా... తెలుగు టైటాన్స్ రూ. 2 కోట్ల 60 లక్షలు వెచ్చించి పవన్‌ను సొంతం చేసుకుంది. రెండు సీజన్లపాటు టైటాన్స్‌కు పవన్ ప్రాతినిధ్యం వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి అయిన పవన్ 2019 దక్షిణాసియా క్రీడల్లో, 2023 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్ జట్టు కెప్టెన్‌గా అంకిత్ జగ్లాన్, వైస్ కెప్టెన్‌గా దీపక్ సింగ్... యూపీ యోధాస్ జట్టు కెప్టెన్‌గా సుమిత్ సాంగ్వాన్, వైస్ కెప్టెన్‌గా అశు సింగ్ నియమితులయ్యారు.

సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్‌కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్‌తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్‌పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్‌ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్‌కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్‌కు కొత్తగా మళ్లీ బెయిల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది.

గెలిపించిన రాధ, యస్తిక
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు తొలి విజయం అందుకుంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోయిన భారత మహిళల ‘ఎ’ జట్టు వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 3 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 47.5 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. దూకుడుగా ఆడిన అనిక లియరాయిడ్ (90 బంతుల్లో 92 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, రాచెల్ ట్రెనమన్ (62 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో కెపె్టన్ రాధ యాదవ్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... టిటాస్ సాధు, మిన్ను మణి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసి గెలిచింది. వికెట్ కీపర్ యస్తిక భాటియా (70 బంతుల్లో 59; 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా... షఫాలీ వర్మ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు), ధారా గుజ్జర్ (53 బంతుల్లో 31; 2 ఫోర్లు), రాఘ్వీ బిష్త్ (25 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. లూసీ హామిల్టన్, హేవార్డ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో మ్యాచ్ రేపు జరుగుతుంది.
బిజినెస్

ఇక చకచకా చెక్కుల క్లియరెన్స్
ముంబై: చెక్కులను వేగంగా క్లియర్ (చెల్లింపులు) చేసే దిశగా ఆర్బీఐ అక్టోబర్ 4 నుంచి కొత్త యంత్రాంగాన్ని అమల్లోకి తీసుకురానుంది. బ్యాంక్‌లో చెక్కు సమర్పించిన గంటల్లోనే అది నగదుగా మారిపోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న చెక్కు ట్రంకేషన్ సిస్టమ్ (సీటీఎస్) కింద రెండు పనిదినాల వరకు సమయం తీసుకుంటోంది. కొత్త విధానంలో చెక్కులను స్కాన్ చేసి వాటిని వెంటనే క్లియరింగ్ హౌస్‌కు బ్యాంక్‌లు పంపాల్సి ఉంటుంది. దీంతో క్లియరింగ్ సైకిల్ టీప్లస్1 (సమర్పించిన తర్వాతి రోజు) నుంచి కొన్ని గంటలకు తగ్గిపోనుంది.సీటీఎస్‌లో బ్యాచ్ ప్రాసెసింగ్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ విత్ ‘ఆన్ రియలైజేషన్ సెటిల్మెంట్’కు బ్యాంక్‌లు మారిపోనున్నాయి. ఈ మేరకు బ్యాంక్‌లకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. ‘‘సీటీఎస్ నుంచి కంటిన్యూయెస్ క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్ ఆన్ రియలైజేషన్‌కు రెండు దశల్లో మారిపోవాలని నిర్ణయించడమైంది. మొదటి దశ అక్టోబర్ 4 నుంచి, రెండో దశ 2026 జనవరి 3 నుంచి అమల్లోకి వస్తుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకటే సెషన్ (చెక్కుల సమర్పణ) ఉంటుంది’ అని ఆర్బీఐ పేర్కొంది.

టారిఫ్‌లు భారత్ వృద్ధిని ఆపలేవు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్‌ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్అండ్పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ అంచనాగా ఉంది. భారత్‌పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్‌లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్‌లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్అండ్పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది. టారిఫ్‌ల విధింపు భారత సానుకూల ఔట్‌లుక్‌ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్‌ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు.. అమెరికా టారిఫ్‌లు భారత్‌లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్‌కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది.

జియో హాట్‌స్టార్ ఆ ఒక్క రోజు అందరికీ ఫ్రీ..
ప్రముఖ ఓటీటీ జియో హాట్‌స్టార్‌ను ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా వీక్షించే అవకాశం.. అది కూడా జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్.. ఇలా ఏ యూజర్ అయినా పర్వాలేదు. అయితే ఈ ఆఫర్ కేవలం ఒక్క రోజు మాత్రమే.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తమ ఓటీటీ యాప్‌లోని కంటెంట్ మొత్తం ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది జియో హాట్‌స్టార్. జియో హాట్ స్టార్‌కు చెందిన అన్ని షోలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రోజంతా ఉచితంగా వీక్షించవచ్చు.ఈ బిగ్ అనౌన్స్మెంట్కు సంబంధించిన బ్యానర్ జియో హాట్‌స్టార్ యాప్‌లో కనిపిస్తోంది. ఈ బ్యానర్లలో "ప్రౌడ్ ఇండియన్ ప్రౌడ్లీ ఫ్రీ" అనే ట్యాగ్ లైన్ తో "ఫ్రీ" అని రాసి ఉంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ జియో హాట్‌స్టార్ కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా టీవీ యాప్ లోకి లాగిన్ అవ్వాలి. ఆగస్టు 15న జియో హాట్‌స్టార్‌లో సలాకార్ అనే కొత్త సిరీస్ రాబోతోంది. ఇది ఒక డిటెక్టివ్ కథ. ఆగస్టు 15న ఉచితం కావడంతో ఈ సిరీస్‌ను ఉచితంగా ఆస్వాదించవచ్చు.ఈ ఆఫర్ అందరికీ..ఈ ఆఫర్ ప్రత్యేకత ఏమిటంటే జియో హాట్‌స్టార్‌ను చూడటానికి జియో యూజరే అయి ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే జియో హాట్‌స్టార్ బండిల్ ఆఫర్ ఎయిర్టెల్, వీఐ ప్లాన్లలో కూడా అందుబాటులో ఉంది. మామూలుగా ఎంపిక చేసిన కొంత కంటెంట్ జియో హాట్‌స్టార్‌లో ఎప్పుడైనా ఉచితంగా చూడవచ్చు. కానీ ఆగస్టు 15న మాత్రం 24 గంటల పాటు మొత్తం కంటెంట్‌ను ఉచితంగా అందించనున్నారు.

వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ బ్యాంక్..
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ పరిమితిపై వెనక్కి తగ్గింది. కొత్త పొదుపు ఖాతాలకు పెంచిన కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పట్టణ ప్రాంతాల్లో నిర్వహించాల్సిన కనీస సగటు బ్యాలెన్స్‌ను రూ.50 వేల నుంచి రూ.15 వేలకు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది.ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (ఎంఏబీ) నిబంధనల్లో ఇటీవలె మార్పులు తీసుకొచ్చింది. బ్యాంక్ ఇదివరకు సవరించిన పాలసీ ప్రకారం.. మెట్రో, అర్బన్ కస్టమర్లకు ఎంఏబీ ఐదు రెట్లు పెరిగి రూ.50,000కు చేరింది. సెమీ అర్బన్ ప్రాంతాలకు రూ.25 వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు రూ.10,000గా ఉంది. ఇది మునుపటి కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ మార్పులు కొత్త ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటికే ఉన్న ఖాతాదారులపై ఈ విధానం ప్రభావం చూపదని చెప్పింది.అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఎంఏబీని అత్యంత భారీగా పెంచడంతో ఖాతాదారులు, ఫైనాన్స్ నిపుణుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా అధిక శాతం మంది ఖాతాదారులు నెలకు రూ.25,000 కంటే తక్కువే సంపాదిస్తున్నారు. అలాంటిది బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో స్థిరంగా నగదు మెయింటెన్ చేయాలంటే వారి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘పొదుపు ఖాతాలో రూ.50,000 ఎంఏబీ చాలామంది భారతీయులకు ఆచరణీయం కాదు. 90 శాతం మంది భారతీయులు నెలకు రూ.25,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారు. ఈ మార్పు వారికి శాపంగా మారుతుంది’ అని ప్రముఖ బ్యాంకర్ జే కోటక్ తన ఎక్స్ ఖాతాలో చెప్పారు. దీనిపై ఆర్బీఐ కూడా స్పందించింది. ఎంఏబీని నిర్ణయించుకోవడం పూర్తిగా బ్యాంకుల ఇష్టమంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.
ఫ్యామిలీ

అమితాబ్ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్
సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంట గలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయను కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్చల్ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.

దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి..!
నిమ్మరసం దుకాణం నడుపుతున్న ఏడేళ్ల చిన్నారి వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అలా ఎందుకు అమ్ముతుందో పాపం అనుకునేలోపు ఆశ్చర్యం కలిగించేలా ఆర్థిక పాఠాల గురించి బెబుతోంది ఆ చిన్నారి. ప్రతి తల్లిదండ్రులు ఇలా ఉంటే పిల్లలు వృద్ధిలోకి వస్తారని కళ్లకుకట్టినట్లు చూపించే బెస్ట్ పేరెంటింగ్ పాఠం ఇది. సమాజానికి ఇలాంటి తలిదండ్రులే అవసరం అని ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. ఆ వీడియోలో ఏడేళ్ల చిన్నారి ఒక వీధిలో నిమ్మరసం అమ్ముతూ కనిపిస్తుంది. ఆ చిన్నారి తోపాటు అమ్మమ్మ, తండ్రి కూడా ఉన్నారు. దీన్ని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఘరత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కంటెంట్ క్రియేటర్ పూర్వ ఆ చిన్నారి ఇలా దుకాణం నడపడాన్ని గమనించి వారి అనుమతితోనే ఈ వీడియో తీస్తోంది. అసలు ఆ చిన్నారి ఇలా ఎందుకు చేస్తుందని ఆమె అమ్మమ్మను, తండ్రిని అడుగుతుంది. ఆ తండ్రి మీరు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం చదివారా అని ప్రశ్నిస్తాడు. తన కూతురు ఆ పుస్తకం నుంచి ప్రేరణ పొంది ఇలా వ్యాపారం మొదలు పెట్టిందని వివరిస్తాడు. ఆ పస్తకం నుంచి తెలుసుకున్నదాన్ని నేర్చుకునేలా ఇలా ఆచరణలో పెట్టించానని చెబుతాడు ఆ తండ్రి. అది విని కంటెంట్ క్రియేటర్ పూర్వ ఇంత చిన్న వయసులోనే ఆర్థిక స్వేచ్ఛ గురించి నేరుకుంటుందా అని విస్తుపోతుందామె. ఇలాంటి తల్లిదండ్రేలే కదా సమాజానికి కావాలి అంటూ ఆ పేరెంట్స్‌ని చేసిన పనికి ప్రశంసిస్తుంది కంటెంట్ క్రియేటర్. కలలు కనడం, నిర్మించడ, తనను తాను నమ్మడం వంటివి ఆచరణలో పెట్టినప్పుడే తెలుస్తుందని చేతల ద్వారా బహుచక్కగా వివరించారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. గొప్ప తల్లిదండ్రులుగా ఉండటం అంటే ఇదే. కేవలం గ్రేడులు, మంచి మార్కులు కాదు..జీవిత పాఠాలు నేర్పించాలి, మనం లేకపోయినా..ఆ చిన్నారులు తమ జీవితాన్ని నిర్భయంగా లీడ్ చేయగల సామర్థ్యం పెంపొందించాలని అని నేర్పించే గొప్ప పేరెంటింగ్ పాఠం ఇది. ప్రతి తల్లిదండ్రలు తప్పక తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది కూడా కదూ..!. View this post on Instagram A post shared by Purva Gharat 👁️ (@purvagx) (చదవండి: స్వచ్ఛ భారత్ కోసం విదేశీయుడి తపన..! నెటిజన్ల ప్రశంసల జల్లు)

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులివే!
తెలుగు రాష్ట్రాల్లో 20 లోపే..జీఐ గుర్తింపు పొందిన తెలంగాణ ఉత్పత్తులు: 17 ఉత్పత్తుల్లో 1 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 15 హస్తకళాకృతులు ఉన్నాయి. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ సిల్వర్ ఫిల్‌గ్రీ, నిర్మల్ బొమ్మల – క్రాఫ్ట్, నిర్మల్ ఫర్చీచర్, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీం, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, సిద్ధిపేట గొల్లభామ చేనేత చీరలు, నారాయణపేట చేనేత చీరలు, బనగానపల్లె మామిడి, ఆదిలాబాద్ డోక్ర, వరంగల్ దుర్రీస్, తాండూరు కంది.2004వ సంవత్సరంలో 3 భౌగోళిక గుర్తింపులతో భారత్ జీఐ ట్యాగ్ల నమోదు ప్రారరంభ మైంది. 2024లో ఇది 643కు చేరింది. 2023–24లో అత్యధికంగా జీఐ పొందిన హస్తకళాకృతులు 85 కాగా, వ్యవసాయ ఉత్పత్తుల సంఖ్య 48. ఆహారోత్పత్తులు 19 మాత్రమే. ఆంధ్రప్రదేశ్ జీఐ ఉత్పత్తులు: 19 ఉత్పత్తుల్లో 4 వ్యవసాయం, 1 ఆహారోత్పత్తి, 11 హస్తకళాకృతులు, 3 మానుఫ్యాక్చర్డ్–నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. శ్రీకాళహస్తి కలంకారీ, కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం కలంకారీ, బుడితి బెల్ – బ్రాస్ క్రాఫ్ట్, ఏపీ లెదర్ పప్పెట్రీ, ఉప్పాడ జాందాని చీరలు, తిరుపతి లడ్డు, గుంటూరు సన్న మిరప, వెంకటగిరి చీరలు, బొబ్బిలి వీణ, మంగళగిరి చీరలు–వస్త్రాలు, ధర్మవరం చేనేత పట్టు చీరలు– పాపడాలు, బందరు లడ్డు, ఉదయగిరి వుడెన్ కట్లెరీ, బనగానపల్లి మామిడి, దుర్గి స్టోన్ కార్వింగ్స్, ఏటికొప్పాక బొమ్మలు, ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్స్, అరకు వ్యాలీ అరబిక కాఫీ.643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు2004–2024 మధ్యకాలంలో జీఐ గుర్తింపు పొందిన వాటిలో హస్తకళాకృతులు 54%, వ్యవసాయ ఉత్పత్తులు 31%, తయారీ, సహజ వస్తువులు 8%, ఆహారోత్పత్తులు 7% ఉన్నాయి. ఉత్తర భారత దేశానికి చెందిన జీఐ గుర్తింపు ఉన్న బాస్మతి బియ్యానికి అధిక ధర వస్తుంది, సాధారణ బాస్మతి బియ్యంతో పోల్చితే. అదేవిధంగా కేరళలో జీఐ గుర్తింపు ΄పొందిన దేశీ బియ్యం రకాల సాగుదారులకు అధికాదాయం వస్తోంది. మన దేశంలో గత 20 ఏళ్లలో మొత్తం 643 ఉత్పత్తులు భౌగోళిక గుర్తింపులు పొందగా, అందులో 200 వ్యవసాయోత్పత్తులే. ఆహారోత్పత్తులు 47, హస్తకళాకృతులు 343, మానుఫ్యాక్చర్డ్, నేచురల్ గూడ్స్ 53 ఉన్నాయి. అత్యధిక జీఐలు పొందిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ 74 (11.51%). ఇందులో ఎక్కువ భాగం హస్తకళాకృతులే. తమిళనాడులో జీఐ పొందిన 59 (9.18%) ఉత్పత్తుల్లో హస్తకళాకృతులు, ఆహారోత్పత్తులే ఎక్కువ. మహారాష్ట్రలో 49 (7.62%), కర్ణాటకలో 44 (6.84%), కేరళలో 35 (5.44%) వస్తువులకు 2024లో జీఐ లభించింది. గత 20 ఏళ్లలో దేశంలో 2024 నాటికి 643 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో17 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకుజీఐ2017–23 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 8,86,708 ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. 2017లో అత్యధికంగా జీఐల నమోదు జరిగింది. ఆ తర్వాత కాలంలో హస్తకళాకృతులు, వైన్స్, స్పిరిట్స్, సేవలు, తదితర అన్ని విభాగాల్లోనూ తగ్గుదల నమోదైంది. అయితే, వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల సంఖ్య మాత్రం 2017–2023 మధ్య 23.9% పెరిగింది. ఈ కాలంలో జీఐ గుర్తింపు ΄÷ందిన వైన్స్, స్పిరిట్స్ 59.64% (5,28,832) ఉండగా, వ్యవసాయ ఉత్పత్తులు 3,37,008 (38.01%) ఉన్నాయి. హస్తకళాకృతులు 11,538 (1.3%) ఉన్నాయి. 2023లో అత్యధికంగా చైనా 9,785 జీఐలతో అగ్రస్థానంలో ఉండగా, అమెరికా 763తో 49వ స్థానంలో, భారత్ 530తో 52వ స్థానంలో ఉంది. నిర్వహణ : పంతంగి రాంబాబు, సాక్షి, సాగుడి డెస్క్.

జీఐ ఉత్పత్తులు, ప్రాధాన్యత
విలక్షణత, వారసత్వ గుర్తింపు కలిగి ఉన్న విశిష్ట ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉంటే బాగుంటుంది. ఆ గుర్తింపును బట్టి ఆ ఉత్పత్తి ఏ భౌగోళిక ప్రాంతానికి చెందినదో తెలుస్తుంది. తద్వారా ఆర్థిక, సాంస్కృతిక ప్రయోజనాలు చేకూరతాయి. ఇందు కోసమే భౌగోళిక సూచిక (జాగ్రఫికల్ ఇండికేషన్స్–జీఐ..Geographical Indication (GI)లు కేటాయించే ప్రక్రియ అంతర్జాతీయంగా అమల్లో ఉంది. జీఐ ఉన్న ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర కూడా వస్తుంది. భారత్‌లో 2004 నుంచి జీఐల కేటాయింపు మొదలైంది. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన ఎక్కువగా ఉన్న అధికాదాయ, ఉన్నత మధ్యతరహా ఆదాయ దేశాల్లో ఎక్కువ జీఐలు నమోదవుతున్నాయి. చైనా, యూరోపియన్ యూనియన్‌లో ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే వేల కొలదీ ఉత్పత్తులకు జీఐలు ఇచ్చాయి. జీఐ జాబితాలో వైన్స్, స్పిరిట్స్ది అగ్రస్థానం. తర్వాతే వ్యవసాయ, ఆహారోత్పత్తులు. 2024 నాటికి మన 643 ఉత్పత్తులకు మాత్రమే జీఐ గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరీ తక్కువ. చేతి వృత్తి కళాకారులు తయారు చేసే ఉత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు మన దేశంలో ఎక్కువగా జీఐ గుర్తింపు ΄పొందాయి. ఇతర రంగాల్లో విలక్షణ ఉత్పత్తులపై మనం ఇంకా దృష్టి సారించాల్సి ఉందంటున్నారు నిపుణులు. ప్రాంతీయ వారసత్వ సుసంపన్నతను పరిరక్షించుకోవటానికి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించడానికి జీఐ గుర్తింపును సోపానంగా మార్చుకోవాలి. జీఐ గుర్తింపు ΄ పొందిన ఉత్పత్తులను ప్రధాన మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చే మౌలిక సదుపాయాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది.. ఈ ఏఐ యుగంలో జీఐ లోకంలో అభివృద్ధి మార్గాలేమిటో తొంగి చూద్దాం రండి..! మేధో సంపత్తి (ఇంటల్లెక్చువల్ ప్రాపర్టీ– ఐపీ) హక్కులు అనేవి మానవ మేధస్సు నుంచి వెలువడే ఉత్పత్తులను, వాటి సృష్టికర్తల ప్రయోజనాలను కాపాడే ప్రపంచవ్యాప్త చట్టబద్ధత కలిగిన ఒక వ్యవస్థలో భాగం. ఈ మేధో ఆస్తులను ఉపయోగించుకునే హక్కు, నియంత్రించే హక్కు ఎవరికి ఉంది? ఎవరి నుంచి అనుమతి ఎలా పొందవచ్చో జీఐ తెలియజేస్తుంది. ట్రేడ్‌మార్క్‌లు, భౌగోళిక సూచికలు.. రెండూ ఐటెంటిఫయ్యర్లుగా, డిఫరెన్షియేషన్ టూల్స్‌గా పనిచేస్తాయి. ట్రేడ్‌మార్క్‌లు ఉత్పత్తి వ్యాపార మూలాన్ని సూచిస్తాయి. అయితే జీఐలు దాని భౌగోళిక మూలాన్ని సూచిస్తాయి. భౌగోళిక సూచికలు (జీఐలు) నిర్దిష్ట ప్రాంతాలకు సంబంధించిన ఉత్పత్తులకు ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీఓ) మార్గదర్శకాలకు అనుగుణంగా చట్టపరమైన రక్షణను అందిస్తాయి. ఉత్పత్తుల ప్రత్యేక లక్షణాలను, వారసత్వాన్ని జీఐలు ఎత్తి చూపుతాయి. సాంప్రదాయ ఉత్పత్తులను రక్షించడానికి, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, మార్కెట్లో ఉత్పత్తి నాణ్యతను నిర్ధారించడానికి సాధనాలుగా పనిచేస్తున్నందున జీఐల ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వైన్లు, స్పిరిట్లు జీఐలలో అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. భారతదేశంలో జీఐ రంగంలో వ్యవసాయ వస్తువులు, హస్తకళల ఉత్పత్తులదే పైచేయి. భారతదేశ మేధో సంపత్తి చట్టం నాలుగో షెడ్యూల్ ప్రకారం, వస్తువులను 34 తరగతులుగా వర్గీకరించారు. దీనిలో 31వ తరగతి వ్యవసాయ, ఉద్యానవన, అటవీ ఉత్పత్తులు, ఇతర తరగతులలో చేర్చని ధాన్యాలు, జంతువులు, తాజా పండ్లు, కూరగాయలు, విత్తనాలు, మొక్కలు, పువ్వులు, జంతువుల ఆహార పదార్థాలు, పులియబెట్టిన పదార్థాలు, మాల్ట్ ఉన్నాయి. పర్మిజియానో రెగ్జియానో, షాంపైన్ వంటి మద్యం ఉత్పత్తులతో యూరోపియన్ యూనియన్ (ఈయూ) జీఐ వ్యవస్థలో ముందంజలో ఉంది. పూర్వం నుంచి ఫ్రాన్స్ ఇటలీ, స్పెయిన్ జీఐ ఉత్పత్తుల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, చైనా, భారత్ వంటి దేశాలు జీఐలను ఆర్థిక అభివృద్ధి సాధనాలుగా గుర్తించటంలో, ఉపయోగించడంలో ఇటీవల కాలంలో గణనీయమైన పురోగతి సాధించాయి. పెద్దగా ప్రసిద్ధి చెందని వ్యవసాయ, ఆహార ఉత్పత్తులకు ప్రపంచ ఖ్యాతిని తేవటంలో, ΄ోటీని పెంచటంలో జీఐలు ఉపయోగపడతాయి. వియత్నాం, దక్షిణ కొరియా, ఇండోనేషియా వంటి దేశాలు ప్రపంచ మార్కెట్లలో తమ ఉత్పత్తుల విలక్షణతను చాటి చెప్పటానికి జీఐలను ఎక్కువగా ఉపయోగించుకున్నాయి. వియత్నాంలో స్థిరమైన గ్రామీణ అభివృద్ధికి జీఐలు సానుకూలంగా దోహదపడ్డాయి. 1999 చట్టంతో శ్రీకారంప్రపంచవ్యాప్తంగా సమాజాల సాంస్కృతిక పరిరక్షణ, ఆర్థిక వృద్ధికి జీఐలు కీలకమైన సాధనాలుగా మారాయి. మన దేశ జీఐ ప్రయాణం భౌగోళిక వస్తువుల సూచికలు (రిజిస్ట్రేషన్ మరియు రక్షణ) చట్టం– 1999తో ప్రారంభమైంది. ఇది 2004లో 20 ఏళ్ల క్రితం అమల్లోకి వచ్చింది. మొదటి జీఐ ట్యాగ్ డార్జిలింగ్ టీకి లభించింది. అప్పటి నుండి భారతదేశం జీఐ రిజిస్ట్రేషన్లలో వేగవంతమైన వృద్ధిని సాధించాం. ప్రధానంగా సాంప్రదాయ వస్తువులను రక్షించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పెం΄÷ందించడం జీఐ ట్యాగ్ల ద్వారా కొంతమేరకు సాధ్యపడుతోంది. స్థానిక సమాజాలు తరచుగా పర్యావరణ అనుకూలమైన సాంప్రదాయ పద్ధతులను పరిరక్షించటంపై దృష్టి సారించడంతో జీఐ గుర్తింపు అటువంటి ఉత్పత్తి పద్ధతులను వెలుగులోకి తెస్తోంది.సవాళ్లెన్నో..జీఐ వ్యవస్థకు ఈ సానుకూల పరిణామాలు ఉన్నప్పటికీ, భారతదేశంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. ఉత్పత్తిదారులు, వినియోగదారులలో జీఐలపై అవగాహన, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, తక్కువగా ఉంది. జీఐలను నమోదు చేయడం, అమలు చేయడం సంక్లిష్టంగా ఉండటంతో పాటు ఇది ఖరీదైన వ్యవహారంగా మారిపోవటం చిన్న ఉత్పత్తిదారులకు ప్రతిబంధకాలుగా మారాయి. అయితే, ఆశావహ భవిష్యత్తు కూడా కనిపిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలను, సుస్థిరతను ప్రోత్సహించడంలో జీఐ పాత్రకు గుర్తింపు పెరుగుతోంది. అంతేకాకుండా, భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తుల ట్రేసబిలిటీ, ధృవీకరణను పెంపొందించడానికి డిజిటల్ టెక్నాలజీలను వాడుకుంటే.. అది మార్కెట్ విస్తరణకు కొత్త అవకాశాలను తెరుస్తుంది.వాణిజ్య ఒప్పందాల్లో రక్షణ అవసరంమన దేశంలో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర ఉత్పత్తులకు జీఐ గుర్తింపు పొందటంలో ముందంజలో ఉన్నాయి. అయితే, ఇతర దేశాలతో పోల్చితే జీఐల నమోదు ప్రక్రియ మన దేశంలో ఊపందుకోలేదని చెప్పచ్చు. చిన్నస్థాయి ఉత్పత్తిదారులకు సులువుగా అర్థమై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకోగలిగేలా జీఐ ప్రక్రియను సరళీకృతం చేయాలన్న వాదన ఉంది. అయితే, జీఐ గుర్తింపు ఇవ్వటంతోనే రైతులకు ఒరిగేదేమీ ఉండదు. రిజిస్ట్రేషన్ తర్వాత మద్దతు అవసరం. అప్రమత్తంగా ఉండాల్సిన ఒక విషయమేమిటంటే.. జీఐ గుర్తింపులు ΄ పొందటగుత్తాధిపత్యానికి దారితీసే పరిస్థితులను ఒక కంట కనిపెట్టాలి. ఎందుకంటే, ఆ ధోరణి చిన్న, సన్నకారు రైతులకు తీవ్ర నష్టదాయక పరిస్థితులకు దారితీసే ముప్పు ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల్లో జీఐ ఉత్పత్తులకు తగిన రక్షణ ఉండేలా పాలకులు రక్షణాత్మక జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే అంతర్జాతీయ మార్కెట్లలో మన జీఐ ఉత్పత్తులు రాణించగలుగుతాయి. చిన్నస్థాయి ఉత్పత్తిదారుల సవాళ్లను అంతర్జాతీయ, జాతీయ శక్తులు పరిష్కరించి, సాంకేతిక అభివృద్ధిని జోడించినప్పుడే జీఐ ద్వారా ఆర్థికాభివృద్ధిని అందిపుచ్చుకోవటం సాధ్యమవుతుంది. ఆర్థికాభివృద్ధితో నాటు ప్రాంతీయ విలక్షణ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడిన మన సంప్రదాయ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు, ప్రాభవం లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే ఔషధ గుణాలున్న దేశీ పంట ఉత్పత్తులకు జీఐ ఇచ్చి, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తే మన రైతులకు, దేశానికి మంచి ఆదాయం చేకూరుతుంది. -పంతంగి రాంబాబు, సాక్షి, సాగుబడి డెస్క్.
ఫొటోలు
అంతర్జాతీయం

పార్క్ చేసిన విమానాన్ని ఢీకొన్న మరో విమానం
కాలిస్పెల్: అమెరికాలోని మోంటానా విమానాశ్రయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండ్ అవుతున్న ఒక చిన్న విమానం ఆగి ఉన్న మరో విమానంపైకి దూసుకెళ్లింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం రెండు గంటలకు ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోకాటా టీబీఎం 700 టర్బోప్రాప్ విమానం నేలపై ప్రయాణికులు లేని ఒక ఖాళీ విమానాన్ని ఢీకొన్నదని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, ఆ ప్రాంతం అంతటినీ పొగ కమ్ముకుంది.మోంటానా విమానాశ్రయం 30 వేల జనాభా కలిగిన కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించిన విమానం మంటల్లో చిక్కుకుంది. ఈ సమయంలో ఆ విమానం నుంచి పైలట్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయని, విమానాశ్రయంలోనే వారికి చికిత్స అందించారని అధికారులు తెలిపారు. 🚨🇺🇸 BREAKING: MID-AIR DISASTER ON THE GROUND IN MONTANA2 planes collided at Kalispell Airport, erupting into a massive fireball.Details on casualties are still unknown, but rescue crews are flooding the scene in a major emergency response.Source: @nicksortor pic.twitter.com/wf7CH0gslR— Mario Nawfal (@MarioNawfal) August 11, 2025

నా ప్రజలను, నా కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నా..
గాజా: గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులు మృతిచెందారు వారిలో అనాస్ జమాల్ అల్–షరీఫ్ కూడా ఉన్నారు. ఈ దాడిలో మరణించడానికి ముందు అనాస్ రాసిన మెసేజ్‌ను అతడి మిత్రుడు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ సందేశం ప్రజల హృదయాలను కదలిస్తోంది. అది చదివితే గుండె బరువెక్కడం ఖాయం. అన్సార్ సందేశం ఏమిటంటే... వారిని అల్లా క్షమించడు ‘‘ఇది నా వీలునామా. నా చివరి సందేశం. నా మాటలు మీకు చేరాయంటే దాని అర్థం నన్ను చంపడంలో, నా గొంతు మూగబోయేలా చేయడంలో ఇజ్రాయెల్ సైన్యం విజయవంతమైనట్లే. మీకు శాంతి సౌఖ్యాలు కలగాలని కోరుకుంటున్నా. అల్లా దయ, ఆశీస్సులు మీకు లభించాలి. నా ప్రజలకు మద్దతుగా, వారి గొంతుకగా ఉండడానికి నా బలం మొత్తం ఉపయోగించానని, చేయగలిగినదంతా చేశానని అల్లాకు తెలుసు. జబాలియా శరణార్థి శిబిరంలోని ఇరుకు సందుల్లో కళ్లు తెరిచినప్పటికీ నా ప్రజల కోసం ఆరాటపడుతున్నా. నా జీవిత కాలాన్ని అల్లా పొడిగిస్తాడని ఆశపడుతున్నా. దానివల్ల నా స్వస్థలం ఆక్రమిత అస్కెలాన్(అల్–మజ్దాల్)కు చేరుకొని, కుటుంబంతో, ప్రియమైనవారితో గడపగలను. కానీ, అల్లా ఆదేశమే ఫైనల్. దానికి తిరుగులేదు. ఇన్నాళ్లూ ఎన్నో బాధలు అనుభవించా. కష్టాలు నష్టాలు నాకు కొత్త కాదు. ఎంతో కోల్పోయా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో నాకు ఎలాంటి సంకోచం లేదు. మా చావులకు కళ్లారా చూస్తున్నవారిని, మా మారణాలను ఆమోదిస్తున్నవారిని, ఇన్ని దారుణాలు జరుగుతున్నా మౌనంగా ఉండిపోయినవారిని, గత ఏడాదిన్నరగా మా గడ్డపై మా పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, హింసాకాండను, మారణహోమాన్ని ఆడ్డుకోనివారిని అల్లా క్షమిస్తాడని నేను అనుకోవడం లేదు. నా బిడ్డ నా కంటి వెలుగు పాలస్తీనా అంటే మాకెంతో ప్రేమ. ముస్లిం ప్రపంచం అనే కిరీటలో విలువైన రత్నం పాలస్తీనా. ప్రపంచంలో ప్రతి స్వేచ్ఛా జీవి గుండె చప్పుడు పాలస్తీనా. మా ప్రజలను మీకు అప్పగిస్తున్నా. కలలు కనడానికి సమయం లేని, స్వేచ్ఛగా, శాంతితో జీవించే అవకాశం లేని మా అమాయక చిన్నారులను అప్పగిస్తున్నా. మా ప్రజల దేహాలు వేలాది టన్నుల బరువు కింద ఛిద్రమైపోయాయి. ఇజ్రాయెల్ బాంబులు, క్షిపణులు వారి శరీరాలను ముక్కలు చేశాయి. ఆ ముక్కలన్నీ వెదజల్లినట్లుగా దూరంగా పడిపోయాయి. నిర్బంధాలు, హెచ్చరికలు మిమ్మల్ని ఆపకూడదు. సరిహద్దులు మీకు అడ్డంకి కాకూడదు. మీరంతా గొంతు విప్పండి. మా కోసం మాట్లాడండి. మా భూమి విముక్తికి, మా ప్రజలకు మధ్య వారధిగా మారండి. ఆక్రమణకు గురైన మా భూభాగంపై గౌరవం, స్వేచ్ఛ పరిఢవిల్లేదాకా గొంతు విప్పుతూనే ఉండండి. మా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వారిని మీకు అప్పగిస్తున్నా. నా ముద్దుల కూతురు షామ్ జాగ్రత్త. ఆమె నా కంటి వెలుగు. ఆమె ఎదుగుదలను కళ్లారా చూసే అదృష్టం నాకు దక్కలేదు. అది కలగానే మిగిలిపోయింది. నా కుమారుడు సలాహ్‌ను కూడా అప్పగిస్తున్నా. నా భారాన్ని మోసే, ఆశయాన్ని నెరవేర్చే బలవంతుడిగా మారేదాకా అతడికి అండగా ఉండాలనుకున్నా. ఇక నా తల్లి బాధ్యత కూడా మీదే. ఆమె ఆశీస్సులు, ప్రార్థనలే నన్ను ఇక్కడిదాకా తీసుకొచ్చాయి. ఆమె ఇచి్చన వెలుగే నాకు దారిగా మారింది. నా తల్లికి బలాన్ని ఇవ్వాలని అల్లాను ప్రారి్థస్తున్నా. అల్లా ఆమెను కరుణించాలి. నా జీవన సహచారి ఉమ్ సలాహ్ బాధ్యతను సైతం మీ చేతుల్లో పెడుతున్నా. ఈ యుద్ధం నన్ను నా భార్య నుంచి దూరం చేసింది. అయినప్పటికీ మా బంధానికి ఆమె కట్టుబడి ఉంది. ఆమె తన బలం, విశ్వాసంతో నా బాధ్యతలను స్వీకరించి, భుజాన వేసుకొని మోసింది. అల్లా తర్వాత మీరే రక్షణ నా కుటుంబానికి అల్లా తర్వాత మీరే రక్షణగా నిలవాలి. ఒకవేళ నేను మరణిస్తే, నా ఆశయాలకు కట్టుబడి ప్రాణాలు పోగొట్టుకుంటే.. అల్లా ముందుకు వెళ్లి, మీ ఆదేశాలు శిరసావహించానని చెబుతా. శాశ్వతంగా అల్లా సన్నిధికి చేరడం సంతోషకరమే కదా. అమర వీరుల్లో ఒకడిగా నన్ను చేర్చుకో అని అల్లాను వేడుకుంటున్నా. నా పాపాలన్నింటినీ క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నా. నా ప్రజలకు, నా కుటుంబానికి కలి్పంచే స్వేచ్ఛా మార్గాన్ని మెరిపించడానికి నా రక్తాన్ని ఒక కాంతిగా మార్చాలని ప్రారి్థస్తున్నా. మీ ప్రార్ధనల్లో గాజాను మర్చిపోవద్దు... నన్నూ మర్చిపోవద్దు.’’ – అనాస్ జమాల్ అల్–షరీఫ్

ఫెడరల్ నియంత్రణలోకి వాషింగ్టన్ డీసీ
వాషింగ్టన్: దేశ రాజధాని వాషింగ్టన్ డీసీ హింసాత్మక గ్యాంగ్‌లు, రక్తపిపాసులైన నేరగాళ్లతో నిండిపోయిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజధానిలోని పోలీసు విభాగాన్ని ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకుతోడుగా 800 మంది నేషనల్ గార్డ్స్‌ను కూడా మోహరిస్తామని ప్రకటించారు. నేషనల్ గార్డులు శాంతిభద్రతలను, పౌరులకు రక్షణను కల్పిస్తారన్నారు. అవసరమైతే మరింతమంది నేషనల్ గార్డులను తీసుకొస్తామని పేర్కొన్నారు. సోమవారం ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. నగరంలో నేరాల రేటు 2024లో 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయిందంటూ గణాంకాలు చెబుతుండగా నేరాలమయంగా మారిందని వ్యాఖ్యానించడం గమనార్హం. ట్రంప్ ఈ వారంలోనే ఫెడరల్ బలగాలు రాజధానికి చేరుకుంటాయని రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. నిరాశ్రయులు నగరం విడిచి వెళ్లిపోవాలి ‘నివాసం లేని వారు వెంటనే నగరం వదిలి వెళ్లిపోవాలి. వారి కోసం నగరానికి దూరంగా స్థలాలిచ్చాం. నేరగాళ్లూ, మీరు మాత్రం ఎక్కడికీ వెళ్లొద్దు, మీరుండాల్సింది జైలులోనే. మేమే మిమ్మల్ని అందులో ఉంచుతాం’అని ట్రంప్ అంతకుముందు సొంత ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. వీధుల్లో, పార్కుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ ఫెడరల్ పోలీసులకు ఆదేశాలిచ్చామన్నారు.

తక్షణ బహిష్కరణ.. ఆపై విచారణ!
లండన్: అక్రమ వలసదారులకు యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ గట్టి హెచ్చరికలు చేశారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని తక్షణమే బహిష్కరించి, ఆ తర్వాతే ఆన్లైన్లో విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ‘డిపోర్ట్ నౌ, అప్పీల్ లేటర్’స్కీంలో ఉన్న దేశాల సంఖ్య 8 నుంచి భారత్ సహా 23కు పెంచిన నేపథ్యంలో స్టార్మర్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ‘మా దేశంలోకి మీరు అక్రమంగా వచ్చినట్లయితే నేరానికి పాల్పడినట్లే. ఇందుకుగాను డిటెన్షన్‌ను, బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వేగంగా మిమ్మల్ని వెనక్కి పంపివేస్తాం’అని సోమవారం ఎక్స్‌లో స్టార్మర్ పేర్కొన్నారు. ‘ఎంతో కాలంగా విదేశీ నేరగాళ్లు మా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. వారి అప్పీల్స్ వాయిదా పడుతుండటంతో యూకేలో నెలలు, సంవత్సరాల తరబడి తిష్ట వేసుకుంటున్నారు. దీనికి ముగింపు పలుకుతాం’అని ఆయన పేర్కొన్నారు. తాజాగా పెంచిన జాబితాలోని 23 దేశాలకు చెందిన అక్రమ వలసదారులను తక్షణమే దేశం నుంచి వెనక్కి పంపించివేస్తారు. వారి అప్పీళ్లపై వీడియో లింక్ ద్వారా విచారణ చేపడతారు. విదేశీ నేరగాళ్లను తొలగించడం, డిటెన్షన్ సెంటర్లపై ఒత్తిడి తగ్గించడం, ప్రజా ధనాన్ని ఆదా చేయడమే తమ లక్ష్యమని యూకే ప్రభుత్వం అంటోంది. 2023లో మొదటగా ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు అందులోని జాబితాలో ఆల్బేనియా, కొసావో, నైజీరియా, ఎస్టోనియా దేశాలే ఉన్నాయి. విస్తరించిన జాబితాలో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, మలేసియా, కెన్యా, ఉగాండా తదితర దేశాలను చేర్చారు. దీనిపై ఆయా దేశాలతో యూకే అధికారులు చర్చలు ప్రారంభించారు. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సైతం ఇప్పటికే విదేశీయులను వెనక్కి పంపే కార్యక్రమాన్ని ముమ్మరంగా అమలు చేస్తుండటం తెల్సిందే.భారతీయులు సహా వందలాది మంది అరెస్ట్దేశవ్యాప్తంగా అక్రమంగా పనిచేస్తున్న భారతీయులు సహా వందలాదిమందిని యూకే ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా బైక్‌లపై డెలివరీ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. జూలై 20–27 తేదీల మధ్యన చేపట్టిన తనిఖీల్లో 1,780 అక్రమంగా పనిచేసే డెలివరీ ఏజెంట్లు, 280 మంది అనుమతులు లేకుండా పనులు చేసే వలసదారులు పట్టుబడ్డారని వెల్లడించారు. హిల్లింగ్డన్లో ఏడుగురు భారతీయులు దొరికారని, వీరిలో ఐదుగురిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలిపారు.
జాతీయం

ఇకపై ఒక్కరోజులోనే వీసా జారీ
సాక్షి, న్యూఢిల్లీ: వీసా జారీ చేయడానికి ప్రస్తుతం కొన్ని వారాల సమయం పడుతోంది. ఇకపై అన్ని పత్రాలు సమరి్పస్తే ఒక్క రోజులోనే వీసాను పొందేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనల్లో వెసులుబాటు తీసుకొచి్చంది. అక్రమ వలసదారులు, గడువుతీరినా దేశంలోనే ఉండే విదేశీయులపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేసేందుకు డిస్ట్రిక్ట్ పోలీస్ మాడ్యూల్ (డీపీఎం), ఫారినర్స్ ఐడెంటిఫికేషన్ పోర్టల్ (ఎఫ్ఐపీ) అనే రెండు కొత్త పోర్టల్స్‌ను ప్రారంభించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో విదేశీ విభాగ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో వీసా విధానాల సరళతరం, ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టుల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించారు. 2024లో జారీ చేసిన మొత్తం వీసాలలో ఈ–వీసాల వాటా 65.15 శాతం. వీసా విధానాల సులభతరం వల్ల వీసా జారీ సగటు సమయం కొన్ని వారాల నుంచి ఒక రోజులోపు తగ్గినట్టు కేంద్రమంత్రికి అ«ధికారులు తెలిపారు. అధికారుల పనితీరును అభినందించిన బండి సంజయ్.. వీసా, ఇమ్మిగ్రేషన్ విషయంలో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో సాధారణ ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్టు (ఐసీపీ)ల ఆధునీకరణలో భాగంగా ఆటోమేటెడ్ ట్రావెల్ డాక్యుమెంట్ స్కానింగ్, బయోమెట్రిక్ నమోదు సదుపాయాలను కల్పించినట్టు అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, అహ్మదాబాద్‌లలో ఫాస్ట్–ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం (ఎఫ్టీఐ–టీటీపీ) అమలు చేస్తున్నట్టు అధికారులు చెప్పారు.

వీధికుక్కల తరలింపు తీర్పుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ఢిల్లీ: వీధికుక్కలను షెల్టర్లకు తరలించాలని ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పునఃసమీక్షించనుంది. గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనుంది.దేశరాజధానిలో వీధికుక్కల స్వైరవిహారంతో విసిగిపోయిన సుప్రీంకోర్టు సోమవారం జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌ల ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. రేబిస్ వ్యాధి, కుక్క కాటు,ప్రజల భద్రత అంశాలను పరిగణనలోకి తీసుకుని ఢిల్లీ వీధుల్లో ఒక్క కుక్క కూడా కనిపించకూడదని, షెల్టర్లకు తరలించాలని స్పష్టం చేసింది. ఆదేశాలను అడ్డుకునే ఏ సంస్థ అయినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.అదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధుల్లో ఆహారం పెట్టే ప్రేమికులు, తమ ఇంట్లోనే పెట్టొచ్చుగా? అని కోర్టు ప్రశ్నించింది. రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారిని తిరిగి తీసుకురాగలరా? అంటూ జంతు హక్కుల కార్యకర్తలపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధికుక్కలను దత్తత తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది.అయితే, ఈ తీర్పుపై వివాదం చెలరేగింది. జంతు ప్రేమికులు ఈ తీర్పును సవాలు చేశారు. సుప్రీంకోర్టులో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. వీధికుక్కల షెల్టర్లకు తరలింపుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునసమీక్షిస్తామని తెలిపారు.ఈ క్రమంలో బుధవారం ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ఆదేశాల మేరకు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును రేపు విచారించనుంది.#BREAKING Delhi Stray dog case referred to SC 3-judge bench.A 3-judge bench of the #SupremeCourt to hear the case tomorrow.This is different from the 2-judge bench.A bench of Justices Vikram Nath, Sandeep Mehta and NV Anjaria will hear the matter tomorrow. pic.twitter.com/o0RSdoXyXp— Kashmir Dot Com (KDC) (@kashmirdotcom) August 13, 2025

RN Ravi: గవర్నర్‌ను అవమానించిన విద్యార్థిని
చెన్నై: యూనివర్సిటీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన స్నాతకోత్సవంలో తమిళనాడు గవర్నర్ రవీంద్ర నారాయణ రవిని (ఆర్.ఎన్.రవి) ఓ విద్యార్ధిని అవమానించింది. డాక్టరేట్‌ను గవర్నర్ చేతులు మీదిగా తీసుకునేందుకు తిరస్కరించింది. గవర్నర్ ఆర్.ఎన్ రవి పిలుస్తున్నా.. పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి..ఆ రాష్ట్ర గవర్నర్ల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగంగా బయటపడ్డాయి. మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీలో 32వ కాన్వికేషన్ వేడుక జరిగింది. ఈ వేడుకలో విద్యార్ధిని, అధికార డీఎంకే నేత రాజన్ సతీమణి జీన్‌జోసెఫ్ తన డిగ్రీని అందుకునేందుకు వేదికపైకి వచ్చారు. వాస్తవానికి డిగ్రీ పట్టాను గవర్నర్ తన చేతులకు మీదిగా విద్యార్ధులకు అందించడం ఆనవాయితి. కానీ మనోన్మణియం సుందరనార్ కాన్వకేషన్ వేడుకల్లో విద్యార్థులు గవర్నర్ చేత డిగ్రీలు తీసుకుంటుండగా..జీన్ జోసెఫ్ గవర్నర్ ఆర్.ఎన్ రవిని కాదని పక్కన ఉన్న వైస్ చాన్సలర్ చంద్రశేఖర్ చేతులు మీదిగా తీసుకున్నారు. గవర్నర్ ఆమెను పిలిచినా పట్టించుకోలేదు. వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్ చేతులు మీదిగా పట్టాను అందుకున్నారు. గవర్నర్ ఆర్.ఎన్.రవి ఏం చేశారని..మైక్రో ఫైనాన్స్‌లో డాక్టరేట్ పొందిన జీన్ జోసెఫ్ గవర్నర్‌కు బదులుగా యూనివర్శిటీ వైస్ చాన్సలర్ నుండి డాక్టరేట్‌ను తీసుకోవడం స్థానిక మీడియా ఆమెను ప్రశ్నించింది. ‘గవర్నర్ ఆర్.ఎన్.రవి తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు వ్యతిరేకం. ఆయన తమిళ ప్రజల కోసం ఏమీ చేయలేదు. అందుకే ఆయన చేతి నుండి డాక్టరేట్‌ను స్వీకరించాలనుకోలేదు’ అని జీన్ జోసెఫ్ పేర్కొన్నారు.தமிழுக்கும், தமிழ்நாட்டுக்கும் எதிராக செயல்படுவதால் ஆளுநர் கையில் பட்டத்தை வாங்காமல் தவிர்த்த மனோன்மணியம் சுந்தரனார் பல்கலைக்கழக மாணவி ஜீன் ஜோசப் அவர்கள்.ஆளுநரை தமிழ்நாட்டு மக்கள் எவ்வாறு புரிந்து கொண்டுள்ளார்கள் என்பது ரவி அவர்களுக்கு தெரிந்து இருக்கும், சங்கிகளுக்கு… pic.twitter.com/zIB8e8or5D— DMK Updates (@DMK_Updates) August 13, 2025 తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆర్.ఎన్ రవి నవంబర్ 2020 నుండి ఏప్రిల్ 2023 వరకు తమిళనాడు అసెంబ్లీ 13 బిల్లులను ఆమోదించింది. వాటిలో 10 బిల్లులను గవర్నర్ తిరస్కరించారు. కొన్నింటి తిరిగి పంపించారు. అసెంబ్లీ మళ్లీ ఆ బిల్లులను మార్పులు లేకుండా ఆమోదించినా, గవర్నర్ వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. దీంతో గవర్నర్ తీరును తప్పుబడుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్టు గవర్నర్ తీరును ప్రశ్నించింది. ప్రభుత్వం పంపిన బిల్లులకు ఆమోదం తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. నాటి నుంచి తమిళనాడు ప్రభుత్వానికి.. గవర్నర్ ఆర్.ఎన్ రవి విభేదాలు కొనసాగుతున్నాయి. తాజా స్నాతకోత్సవ ఘటనతో మరోసారి భయటపడింది

వానాకాలం కదా.. మరి స్పెషల్ అలవెన్స్ ఉందా?
ఉద్యోగి అంటే ఒక సంస్థలో గంటలకొద్దీ పని చేసే రోబో కాదు. మనస్ఫూర్తిగా తన బుర్రకు పని చెప్పి ఆ సంస్థకు తన సేవలు అందించడం. అందుకే కంపెనీల్లో చాలావరకు జీతం ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు. ఉద్యోగిని సంతృప్తి పరిచేందుకు కూపన్లని, బోనస్లని, అలవెన్సులని ఎక్సెట్రా.. ఎక్సెట్రా అందిస్తుంటాయి.సాధారణంగా ఇంటర్వ్యూలలో జీతం ఎక్కువ ఇవ్వమనో లేకుంటే వాళ్ల వాళ్ల అవసరాలను హెచ్ఆర్లకు తెలియజేస్తుంటారు. అయితే.. ఓ ఉద్యోగాభ్యర్థి ‘లెక్క’ మాత్రం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. కంపెనీలు కొత్త పాలసీ తీసుకురావాలన్న చర్చ డిమాండ్‌కు దారి తీసింది. ఢిల్లీ కంపెనీ హెచ్ఆర్ ఒకరు.. తాజాగా ఓ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. అయితే తనకు ఇవ్వబోయే ప్యాకేజీకి వానకాలంలో కాస్త అదనంగా జీతం చేర్చాలని ఆ హెచ్ఆర్ను కోరాడతను. అందుకు కారణం ఏంటి? అని హెచ్ఆర్ అడగ్గా.. వానాకాలంలో తన ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చును కంపెనీనే భరించాలన్నాడు. ‘‘సాధారణ రోజుల్లో నాకు అయ్యే ఖర్చు కంటే వానాకాలంలో కాస్త ఎక్కువే. కాబట్టి కంపెనీ రెయిన్ అలవెన్స్ చెల్లించాలి’’ అని కోరాడతను. అయితే మునుపెన్నడూ వినని ఆ ప్రస్తావనతో హెచ్ఆర్ కాస్త అయోమయానికి గురైనా వెంటనే తేరుకుని.. అలాంటి పాలసీ తమ కంపెనీలో లేదని బదులిచ్చారు... ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరులాంటి మహానగరాల్లో వర్షాలు పడేటప్పుడు ట్రాఫిక్ చిక్కులు షరామామూలేనని, అలాంటి సమయంలో క్యాబ్ తరహా సేవల ఖర్చు తడిసి మోపెడు అవుతుందని.. అలాంటప్పుడు రెయిన్ అలవెన్స్ కోరడం ఎంతవరకు సబబని ఆ హెచ్ఆర్ ఆ ఉద్యోగ అభ్యర్థిని ప్రశ్నించారు. దీంతో ఆ వ్యక్తి సాధారణ రోజుల్లో తనకు అయ్యే ఖర్చును.. వానాకాలంలో ఆఫీస్ ప్రయాణాలకు అయ్యే ఖర్చను లెక్కేసి మరీ హెచ్ఆర్కు వివరించారు. అదే సమయంలో.. అలాంటి చెల్లింపులు(రెయిన్ అలవెన్స్) వీలులేని పక్షంలో వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించాలని, అదీ కుదరకుంటే ఆలస్యంగా వచ్చేందుకైనా అనుమతించాలని కోరాడతను. ఆ వ్యక్తి సెలక్ట్ అయ్యాడో లేదో తెలియదుగానీ.. ఈ ఇంటర్వ్యూ వివరాలను ఆ హెచ్ఆర్ రెడ్డిట్‌లో పంచుకున్నారు. దీంతో ఆ ఉద్యోగ అభ్యర్థికి మద్దతుగా చాలామంది పోస్టులు పెడుతున్నారు. అంతెందుకు ఆ హెచ్ఆర్ కూడా ఆ వ్యక్తి కోరింది సబబుగానే ఉందంటే ఆ పోస్టులో ప్రస్తావించడం గమనార్హం. ‘‘ఇంటర్వ్యూలో విచిత్రంగా అనిపించిన అతని కోరిక.. ఇప్పుడు సబబుగానే అనిపిస్తోంది’’ అంటూ పోస్ట్ చేశారా హెచ్ఆర్. అంతేకాదు.. తాను కూడా ఆఫీస్‌కు క్యాబ్‌లలోనే వెళ్తానని, వానకాలంలో అతను చెప్పినట్లు పోల్చుకుంటే అధిక ఖర్చులే ఉంటున్నాయని.. అతను కోరింది విచిత్రమైనదేం కాదని ఆ పోస్టులో ఆ హెచ్ఆర్ పేర్కొన్నారు. వానాకాలం కావడం, ప్రయాణాల్లో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఎన్ఆర్ఐ

నిమిష ప్రియ కేసు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కేంద్రం
యెమెన్‌లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో భారత ప్రభుత్వ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆమెను రక్షించే ప్రయత్నాలు చేస్తున్న బృందానికి అక్కడికి వెళ్లకుండా రెడ్ సిగ్నల్ వేసింది. నిమిషను రక్షించేందుకు అనధికారిక మార్గాలైనా చూడాలని సుప్రీం కోర్టు సూచించినప్పటికీ.. విదేశాంగ శాఖ వెనకడుగు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.న్యూఢిల్లీ: కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందానికి యెమెన్ వెళ్లేందుకు భారత విదేశాంగ శాఖ(MEA) అనుమతి నిరాకరించింది. ఐదుగురు ప్రతినిధులతో కూడిన ఆ బృందానికి.. భద్రతా కారణాలు, అలాగే.. యెమెన్ ప్రభుత్వంతో అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమతించలేమని స్పష్టం చేసింది.సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ బృందం ఆమె శిక్షను తప్పించేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తోంది. ఆమె కుటుంబానికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ వస్తోంది. మొన్నీమధ్యే సుప్రీం కోర్టులోనూ పిటిషన్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ బృందాన్ని యెమెన్ రాజధాని సనాకు వెళ్లేందుకు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అయితే సుప్రీం కోర్టు ఆదేశాలున్నా అందుకు తాము అనుమతించలేమని విదేశాంగశాఖ ఆ బృందానికి లేఖ ద్వారా బదులిచ్చింది.‘‘సనాలో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. అందుకే యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని రియాద్‌కు మార్చాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం మరింత ప్రమాదకరం. నిమిష ప్రియ కుటుంబం, వాళ్ల తరఫున అధికార ప్రతినిధులే చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ వ్యవహారంలో విదేశాంగ శాఖ తరఫున మా వంతు ప్రయత్నాలూ చేస్తున్నాం. మన పౌరుల భద్రతను మేం ప్రాధాన్యంగా పరిగణిస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఆదేశాలున్నా.. మీ ప్రయాణానికి మేం అనుమతించలేం’’ అని స్పష్టం చేసింది.ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ కేసులో తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెబుతూ వస్తోంది. అయితే తాము చేయాల్సిందంతా చేశామని, మిగిలిన మార్గం బ్లడ్ మనీనే అని, అయితే అది ప్రైవేట్ వ్యవహారమని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలోనే చెప్పింది. ఈ తరుణంలో ఇతర మార్గాలనైనా చూడాలంటూ సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది.ఈలోపు ఆమె మరణశిక్ష వాయిదా పడింది. అయితే యెమెన్ బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీ చర్చలు, శిక్షరద్దు అయ్యిందంటూ రోజుకో ప్రచారం తెరపైకి వస్తుండగా.. వాటిని కేంద్రం ఖండిస్తూ వస్తోంది. తాజాగా.. శుక్రవారం విదేశాంగ శాఖ ‘యెమెన్‌కు మిత్రదేశాల ప్రభుత్వాలతో టచ్‌లో ఉన్నాం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం.కేరళకు చెందిన నిమిష ప్రియ నర్స్ కోర్సు పూర్తిచేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకొంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్ తెరవాలనుకొంది. కానీ, ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని నిమిష-థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొని అల్‌అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలోనే ఉండిపోయారు. మెహది దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతోపాటు వేధించినట్లు ప్రియా కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెను తన భార్యగా మెహది చెప్పుకోవడం మొదలుపెట్టి, పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను లాక్కొన్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబసభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై ప్రియా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ, వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ, ఆ డోస్ ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్‌లో పారేసింది. చివరికి అక్కడినుంచి సౌదీకి వెళ్లిపోతుండగా.. సరిహద్దుల్లో ఆమెను అరెస్టు చేశారు. 2020లో అక్కడి ట్రయల్ కోర్టు, 2023లో సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ శిక్షను ఖరారు చేశాయి. ఆమె శిక్షను రద్దు చేయించేందుకు కుటుంబం చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. ఈ తరుణంలో ఈ ఏడాది జులై 16వ తేదీ మరణశిక్ష అమలు కావాల్సి ఉండగా.. సరిగ్గా దానికి ఒక్కరోజు ముందు(జులై 15వ తేదీ) మత పెద్దల జోక్యంతో మరణ శిక్ష వాయిదా పడింది. అప్పటి నుంచి తలాబ్ కుటుంబంతో బ్లడ్ మనీకి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మధ్యలో కేరళ కాంతాపురం AP అబూబకర్ ముస్లియార్ శిక్ష రద్దైందని ఓ ప్రకటన చేసినప్పటికీ.. అందులో వాస్తవం లేదని కేంద్రం తర్వాత మరో ప్రకటన చేసింది. బ్లడ్‌మనీ అంటే.. హత్య లేదంటే తీవ్రమైన నేరాల్లో ఇచ్చే పరిహారం. హత్యకు గురైన కుటుంబానికి నేరస్తుడు లేదంటే అతని కుటుంబానికి దక్కే సొమ్ము ఇది. ఆ క్షమాధనం అనేది ఎంత ఉండాలి?. ఎంత స్వీకరించాలి? అనేది ఈ రెండవైపులా కుదిరే ఒప్పందాన్ని బట్టి ఉంటుంది. బాధిత కుటుంబం గనుక అంగీకరించకుంటే శిక్ష అమలు అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. ఇందులో ప్రభుత్వాల జోక్యం ఉండదు. నిమిష కేసులో ఇదే విషయాన్ని కేంద్రం సుప్రీం కోర్టుకు గతంలో స్పష్టం చేసింది.

అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ..
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్లో ఉంటున్నాడు.2023లో అక్కడి ఎఫ్‌బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్‌లో నిందితుడి అకౌంట్‌పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. చదవండి: ధర్మస్థళ మిస్టరీ.. కీలకంగా ఆ 5 ప్రాంతాలు?

తానా: నవ్వులు కురిపించిన ‘సాహిత్యంలో హాస్యం’
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదేం పాడుబుద్ధయ్యా.. పైలటూ!
న్యూయార్క్: విమానం ల్యాండయిన 10 నిమిషాలకే ఎన్నారై పైలట్‌ను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. చిన్నారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన పైలట్‌ను శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco) అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 26వ తేదీన ఉదయం 9.35 గంటల సమయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండవగా అధికారులు అందులోకి ఎక్కి పైలట్‌గా ఉన్న రుస్తొమ్ భగ్వాగర్(34)ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.పదేళ్లలోపు చిన్నారిపై అతడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు నమోదైంది. తన తల్లితో డేటింగ్ చేసిన రుస్తొమ్ భగ్వాగర్ (Rustom Bhagwagar) తనను లైంగికంగా వేధించినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆరేళ్లప్పుడు మొదలైన వేధింపులు తనకు 11 ఏళ్లు వచ్చేవరకు సాగించాడని, ఈ విషయం తన తల్లికీ తెలుసునని ఆమె పేర్కొంది. ఆమె సమక్షంలోనూ ఇవి సాగాయని ఫిర్యాదు చేసిందని అధికారులు వెల్లడించారు.కెనడా విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి ఒట్టావా: కెనడాలోని న్యూఫౌండ్‌ల్యాండ్ ప్రాంతంలో చిన్న విమానం కూలిన ఘటనలో భారతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. డీర్ లేక్ సమీపంలో ఈ నెల 26న ఈ ఘటన చోటుచేసుకుంది. డీర్ లేక్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే విమానం కూలింది.చదవండి: ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తిపై అమానుషంఈ ఘటనలో విమానంలో ఉన్న ఏకైక వ్యక్తి గౌతమ్ సంతోష్(27) ప్రాణాలు కోల్పోయారని టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో విమానం పైలట్ సైతం అక్కడికక్కడే చనిపోయారని పేర్కొంది. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉందని తెలిపింది.
క్రైమ్

సుశీల్ మళ్లీ జైలుకు...
న్యూఢిల్లీ: భారత ప్రముఖ రెజ్లర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్‌పై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. హత్య కేసులో నిందితుడైన సుశీల్‌కు ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చి న బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన బెంచ్ ఈ తీర్పునిచ్చి ంది. వారం రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశించడంతో సుశీల్ మళ్లీ జైలుపాలు కానున్నాడు. యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో జైల్లో ఉన్న సుశీల్‌కు ఐదు నెలల క్రితం బెయిల్ లభించగా... దీనిని వ్యతిరేకిస్తూ సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ కోర్టుకెక్కడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఆటగాడిగా సుశీల్ స్థాయి, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన అతను ఘనతలను కూడా ప్రత్యేకంగా ఉదహరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరారీ తర్వాత లొంగిపోయి... కేసు వివరాల్లోకెళితే... 2021 మే నెలలో సుశీల్ కుమార్‌తో పాటు పలువురు రెజ్లర్లు సాధన చేసే ఛత్రశాల్ స్టేడియం ముందు ఈ ఘటన జరిగింది. ఒక ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారంలో సుశీల్ తదితరులు కలిసి సాగర్ ధన్కర్, అతని మిత్రులపై తీవ్ర దాడికి పాల్పడ్డారు. గాయాలతో ఆ తర్వాత సాగర్ మృతి చెందాడు. దాంతో సుశీల్‌పై కేసు నమోదైంది. దాదాపు ఇరవై రోజుల పాటు పరారీలో ఉన్న తర్వాత చివరకు సుశీల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ సందర్భంగా హత్యతో పాటు అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం తదితర అంశాలతో పోలీసులు ఛార్జ్ïÙట్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సుశీల్‌ను తీహార్ జైలుకు పంపించారు. అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వేర్వేరు కారణాలతో అతను ఐదుసార్లు స్వల్పకాలిక బెయిల్ పొందాడు. హైకోర్టు తప్పు చేసింది... సుశీల్‌కు గత మార్చిలో ఢిల్లీ కోర్టుపై బెయిల్ మంజూరు చేయడం తనకు తీవ్ర వేదన కలిగించిందని, తనకు న్యాయం చేయాలంటూ ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాగర్ తండ్రి అశోక్ ధన్కర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. సుశీల్‌కు బెయిల్ ఇచ్చిన ప్రతీసారి అతను సాక్షులను ప్రభావితం చేశాడని... 35 మంది సాక్షుల్లో 28 మంది ఇప్పుడు గతంలో తాము ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పిటిషనర్ ఆరోపించారు. అనంతరం కేసుపై కోర్టు తమ అభిప్రాయాలు వెల్లడించింది. ‘నిందితుడు అగ్రశ్రేణి రెజ్లర్. ప్రపంచ స్థాయిలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కాబట్టి సమాజంలో కూడా వ్యక్తిగతంగా కూడా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అతను సాక్షులను, విచారణను ప్రభావితం చేయవచ్చు. ఎఫ్ఐఆర్ తర్వాత కూడా అతను పరారీలో ఉన్న విషయంలో మర్చిపోవద్దు. అతనిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.కేసు తీవ్రత తగ్గించే విధంగా బెయిల్ ఉండరాదు. సత్ప్రవర్తనలాంటి అంశాలను ఇలాంటి కేసుల్లో పరిగణలోకి తీసుకోవద్దు. ఈ కేసులో బెయిల్ ఇచ్చి న ఢిల్లీ హైకోర్టు తప్పుగా వ్యవహరించింది’ అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అయితే బెయిల్ ఇచ్చిన కారణాలను తప్పుగా చూపిస్తూ దీనిని రద్దు చేసిన సుప్రీంకోర్టు... మున్ముందు సుశీల్ కుమార్‌కు కొత్తగా మళ్లీ బెయిల్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం మాత్రం ఇచ్చి ంది.

అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
జగిత్యాల క్రైం: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువతి.. వీసా రాకపోవడం.. రూ.10 లక్షలు నష్టపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కాంగాడిపాలెం గ్రామానికి చెందిన నల్లమోతు శ్రీనివాస్, వెంకటఅరుణ దంపతులు 25 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి వచ్చారు. గ్రామ శివారులో పప్పు మిల్లు లీజుకు తీసుకున్నారు. అలాగే పశువులు పెంచుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె హర్షిత (25) డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లేందుకు గుర్తుతెలియని వ్యక్తికి రూ.10 లక్షలు చెల్లించింది. అతడు వీసా తెప్పించకపోవడంతో కొద్దికాలంగా జర్మనీ వెళ్తానని తండ్రి శ్రీనివాస్‌తో చెబుతోంది. డబ్బు లేదని ఈ ప్రతిపాదనకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత ఈనెల 6న పప్పుమిల్లు వద్ద గడ్డిమందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి.. అక్కడినుంచి కరీంనగర్‌కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. మంగళవారం వేకువజామున మృతిచెందింది. కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు.

నవ వధువుదారుణ హత్య, 12 ఏళ్లకు చిక్కాడిలా!
విశాఖపట్నం: ఓ హత్య కేసులో 12 ఏళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని న్యూపోర్టు పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు తెలిపిన వివరాలివి. 2013లో మండలంలో ఒక వీధిలోని నాలుగో అంతస్తు పెంట్‌హౌస్‌లో నవ వధువు త్రివేణి తన భర్తతో కలిసి నివసించేది. పక్కనే ఉన్న మరో పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటున్న నీలాపు లోకేష్ ఆమెపై కన్నేశాడు. ఇంట్లో త్రివేణి ఒంటరిగా ఉండటం గమనించి, ఆ ఇంట్లోకి చొరబడ్డాడు. త్రివేణిపై లైంగికదాడికి ప్రయతి్నంచగా, ఆమె ప్రతిఘటించి వంటగదిలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో లోకేష్ ఆమె మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహం పక్కన చున్నీని కాల్చివేసి, గ్యాస్ తెరిచి ఉంచాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. తర్వాత గాజువాకలోని ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలో ఆ బంగారు ఆభరణాలను కుదువ పెట్టి రూ.55వేలు తీసుకున్నాడు. ఆ డబ్బులో రూ.30వేలతో బైక్ కొనుగోలు చేయడానికి అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగతా రూ.25 వేలును తన స్నేహితునికి ఇచ్చి, ఏమీ తెలియనట్టుగా ఇంటికి చేరుకున్నాడు. పోలీసులు పట్టుకున్నారిలా.. నవ వధువు హత్య కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పటికే గాజువాక పోలీస్ స్టేషన్లో లోకేష్‌పై మోటార్ బైక్ దొంగతనం కేసు నమోదై ఉంది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అతన్ని విచారించగా.. త్రివేణిని తానే హత్య చేసినట్టు లోకేష్ అంగీకరించాడు. బెయిల్‌పై వచ్చి మళ్లీ.. వధువు హత్య కేసులో జైలుకెళ్లిన లోకేష్ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాలని కోర్టు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో లోకే‹Ùను వెతికి పట్టుకోవాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి న్యూపోర్టు పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో అతను విజయవాడలో ఉన్నాడని సమాచారం అందడంతో.. ఏఎస్ఐ మురళి, కానిస్టేబుల్ సింహాద్రిని న్యూపోర్టు సీఐ కామేశ్వరరావు అక్కడకు పంపించారు. 12 సంవత్సరాల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు లోకేష్ ను ఎట్టకేలకు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మాన ప్రాణాల కోసం పరిగెత్తి..
చట్టాలు, కఠిన శిక్షలు.. మానవ మృగాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒకమూల ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సీసీ కెమెరాల సాక్షిగా జరిగిన ఓ దాష్టీకం వెలుగులోకి వచ్చింది. తన మాన ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ యువతి రోడ్డుపై పరుగులు తీసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.కొందరు కీచకులు ఓ బధిర యువతిని బైకుల మీద వెంటాడి.. ఎత్తుకెళ్లి మరీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ప్రకటనకు విరుద్ధంగా.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ నేరానికి సంబంధించిన వాస్తవ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.ఉత్తర ప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం తన బంధువు ఇంటి నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వస్తున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది!. ఆమె ఎంతకీ ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనతో గాలించగా.. పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలోని పొదల్లో దుస్తులు చినిగిపోయి స్పృహ లేని స్థితిలో ఆమె కనిపించింది.వెంటనే బంధువులు ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి.. వైద్యపరీక్షల అనంతరం ఆమెపై అత్యాచారం జరిగిందని నిర్ధారించారు. బైక్ మీద వచ్చిన వ్యక్తి తన వెంటపడ్డాడని.. అతని నుంచి రక్షించుకునేందుకు పరిగెత్తానని ఆమె తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు ప్రకటించారు. అయితే.. ఈ కేసులో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఉండే బంగ్లా సమీపంలోనే ఈ దారుణం చోటు చేసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. అదే సమయంలో.. యువతిపై జరిగింది సామూహిక అత్యాచారమని బాధిత కుటుంబం అంటోంది. ఈలోపు స్థానికంగా ఉన్న ఓ సీసీటీవీ ఫుటేజీలో బైక్ మీద కొందరు ఆమెను వెంబడించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. దీంతో పోలీసులు ఆ ఫుటేజీని పరిశీలించి ఇప్పటిదాకా ఇద్దరిని అరెస్ట్ చేశారు.A 21-year-old disabled girl was allegedly gang raped in Balrampur. A video has surfaced before the alleged gang rape, in which the girl is seen running on the road to escape from the accused. 5-6 bikes can be seen coming from behind. Police have now released a statement that they… pic.twitter.com/YPRdsaWodJ— Mohammed Zubair (@zoo_bear) August 12, 2025