అడవిలో ఆత్మ | A Romantic Horror Story | Sakshi
Sakshi News home page

అడవిలో ఆత్మ

Published Fri, Oct 31 2014 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

A Romantic Horror Story

ఆ ఐదు జంటలు విహార యాత్ర కోసం ఓ దట్టమైన అడవికి వెళతారు. అక్కడో గెస్ట్‌హౌస్‌లో ప్రేమ ఊసులు చెప్పుకుంటుంటే, ఒకరిలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ’. శ్రీరామ్, నిరంజన, అయేషా ముఖ్య తారలుగా ఎస్.ఎస్. ప్రేమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో వెంకట్ రామిరెడ్డి, రవిశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తమిళంలో ‘ఫిబ్రవరి 31’ అనే టైటిల్ ఖరారు చేశాం. తెలుగు, హిందీ భాషలకు ఒకే టైటిల్ ఉంటుంది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement