Ravi Shekhar
-
గంగవ్వకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
బుల్లి తెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 4 సందడి మొదలైంది. తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన బిగెస్ట్ హిట్ షో ఆదివారం అట్టహాసంగా మొదలైంది. వరుసగా రెండోసారి వ్యాఖ్యాతగా వ్యవహించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున 16 మంది కంటెస్టెంట్లును బుల్లితెరకు పరిచయం చేశారు. అయితే వీరిలో చాలామంది వివిధ రంగాల్లో ప్రముఖ గుర్తింపు పొందినవారు కాగా... అందరికంటే ప్రత్యేకంగా నిలిచారు గిరిజన పల్లెల నుంచి వచ్చిన గంగవ్వ. గంగవ్వను బిగ్ బాస్ హౌజ్‌లో చూడగానే ఆమె ఫ్యాన్స్, సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. షో మొదలవ్వడమే ఆలస్యం #Gangavva #BiggBossTelugu4 హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. అంతేకాదు గంగవ్వ ఆర్మీ వచ్చేసిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు. తెలంగాణనే కాకుండా ఏపీ నుంచి కూడా ఆమెకు చాలా మంది మద్దతు తెలుపుతున్నారు. (బిస్‌బాస్-4 : ఇదిగో 16 మంది కంటెస్టెంట్స్) హౌస్‌లోకి వెళ్లేముందు కొంచెం భయంగా ఉందంటూ ఆమె పేరుపై వచ్చిన ట్వీట్‌కు విపరీతమైన స్పందన వస్తోంది. అవ్వా.. అస్సలు భయపడ్డొద్దు.. ఇరగొట్టేయ్.. నీకు మేమున్నాం అంటూ ట్విటర్, ఫేస్బుక్లో అభిమానులు పోస్టులు పెడుతున్నారు. నాకు బిగ్ బాస్ చూడడం ఇష్టం లేదని కానీ అత్యంత సామాన్య నేపథ్యం నుంచి బిగ్‌బాస్ షో వరకు ఎదిగిన గంగవ్వకు ఓట్లు మాత్రం వేస్తామని కొండంత భరోసా ఇస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చొప్పదంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సైతం గంగవ్వకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేస్తూ.. ‘మా చొప్పదండి నియోజకవర్గ అవ్వ గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు. మారుమూల పల్లె నుండి తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. గంగవ్వ విజేతగా నిలుస్తుందని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చేసిన ట్వీట్‌ను గంగవ్వ ఫ్యాన్స్ విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు. -
ఒక్కడు.. అంతులేని నేరాలు
సాక్షి, నాగోలు: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడి, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యార్థిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘరానా నేరస్తుడిని రాచకొండ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఒక కారు, రెండు బంగారు ఉంగరాలు, వెండి ఉంగరం, నాలుగు సెల్ ఫోన్లు, ఎనిమిది సిమ్ కార్డ్ లు, రూ.47 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం దవలూరుకు చెందిన ఇత్తెం రవి శేఖర్ అలియాస్ రవి అలియాస్ సతీశ్ అలియాస్ శశిధర్‌రెడ్డి మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. 1994లో వివాహం కాగా 2014 లో భార్య చనిపోయింది. 2011 లో రవిశేఖర్ దగ్గరి బంధువుకు ఉయ్యూరు కేసీపీలో ఉద్యోగం పెట్టిస్తానని రూ.30 వేలు నగదు తీసుకుని మోసం చేయగా ఈ కేస్‌లో అరెస్ట్ అయి జైల్‌కు వెళ్ళివచ్చాడు. మరో కేస్ లో ఓ మహిళను మోసం చేసి జైల్‌కు వెళ్ళి విడుదలయ్యాడు. పలు అధికారులుగా అవతారాలు.. జైలు నుంచి వచ్చిన అనంతరం రవి శేఖర్ రైస్ మిల్లర్స్, రేషన్ డీలర్స్, ఫర్టిలైజర్స్ షాపుల వద్దకు విజిలెన్స్, ఇన్‌కంటాక్స్ అధికారినని, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ నని, జడ్జిలు తనకు బంధువులని చెబుతూ డబ్బు తీసుకుని మోసాలకు పాల్పడేవాడు. నిరుద్యోగ యువకులకు కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకుని మొహం చాటేసేవాడు. విశాఖపట్నంలో ఓ మోసపూరిత వ్యవహారంలో మే 23న కాకినాడ కోర్ట్ నుంచి విశాఖపట్నం జైల్‌కు తరలిస్తుండగా ఎస్కార్ట్ వాహనం నుంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం జూన్‌లో రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కర్నాటక కొప్పల్ జిల్లాకు చెందిన మహిళతో తాను సెక్యూరిటీ ఆఫీసర్నని పరిచయం పెంచుకున్నాడు. తన వద్ద రూ.3 కోట్ల మేర డబ్బు వుండగా దాంతో స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు నమ్మించి అక్కడి స్థలాలకు చెందిన పత్రాలను, కొంత నగదుతో మరో వ్యక్తితో ఐ 20 కారు ను తీసుకుని వస్తూ కార్ డ్రైవర్‌ను మధ్యలో వదిలి కారుతో సహా ఉడాయించాడు. ఆ కారుతో కర్నూలు జిల్లాకు వచ్చి నెంబరు మార్చుకుని తాను గోదావరి జిల్లా సీబీఐ ఆఫీసర్ నని చెప్పి నితిన్ కుమార్ అనే వ్యక్తి వద్ద రూ.50వేలు, ఒక సెల్ ఫోన్ తీసుకుని పారిపోయాడు. ఇలా పలు నేరాలు చేశాడు. గత నెల బొంగులూరు గేట్ సమీపంలో ఓ విద్యార్థికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాలికను కిడ్నాప్ చేశాడు. అక్కడ నుంచి కడపలో తెలిసిన బంధువులతో జాబ్ గురించి మాట్లాడే పని వుందని చెప్పి కడప, కర్నూల్, ప్రకాశం జిల్లాల్లో ఆ విద్యార్థిని తిప్పుతూ ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 28 న బాధితురాలిని కారులోనే బంధించి ఆ వాహనం నెంబర్‌ను తిరిగి మార్చి ఎరువుల దుకాణం వద్దకు వెళ్ళి తాను విజిలెన్స్ అధికారినని బెదిరించి వారి నుంచి రూ.82 వేల నగదు, బంగారం, వెండి వుంగరాలు తీసుకుని పరారయ్యాడు. అప్పటికే హయత్ నగర్ పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో గత నెల 30న కిడ్నాప్ చేసిన విద్యార్థిని హైదరాబాద్ బస్ ఎక్కించి ‘నువు వెళ్ళిపో.. నేను నీ వెనక వచ్చేస్తా..’ నని చెప్పి అక్కడ నుంచి ఉదాయించాడు. పోలీసులు జీపీఆర్ సిస్టమ్ ద్వారా రవి శేఖర్ ను పంతంగి టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేసి అతడి నుంచి కారు, నగదు, బంగా రం స్వాధీనం చేసుకుని విచారించగా ఇతడిపై తెలంగాణలో 10 కేస్లు, ఆంధ్రప్రదేశ్‌లో 38 కేస్ లు, కర్నాటకలో 1 కేస్లు నమోదైనట్లు గుర్తించారు. రవిశేఖర్ ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ధారాళంగా మాట్లాడుతూ మోసాలకు పాల్పడటంలో దిట్ట అని పేర్కొన్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్చర్యపరుస్తోన్న రవి శేఖర్ నేర చరిత్ర
-
రాష్ట్రానికో వేషం.. భారీగా మోసం
సాక్షి, హైదరాబాద్: గత నెల 23వ తేదీన హయత్‌నగర్ యువతి కిడ్నాప్‌కు పాల్పడిన రవి శేఖర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేష్ భగవత్ మాట్లాడుతూ.. ‘రవి శేఖర్ మే 23న విజయవాడ పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని రైలు ఎక్కాడు. ఈ క్రమంలో రైలులో కర్ణాటక కోప్పల్కు చెందిన ఓ కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. చర్చి కట్టడానికి సాయం చేస్తానని మాయ మాటలు చెప్పి వారి ఇంటికి వెళ్లాడు. బళ్లారిలో తనకు రూ. 3 కోట్ల డబ్బు ఉందని.. వెళ్లి తీసుకొస్తానని చెప్పి.. వారి ఐ20 కారుతో ఉడాయించాడు’ అని తెలిపారు. ‘జూలై 21వ తేదీన రవి శేఖర్ హైదరాబాద్‌లో ప్రత్యక్షం అయ్యాడు. సబ్ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చానని చెప్పి డబ్బులు వసూలు చేసి.. అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. జూలై 23న హయత్‌నగర్‌లో సోనిని కిడ్నాప్ చేశాడు. రవి శేఖర్ కోసం కడప, ఒంటిమిట్ట, తిరుపతిలో గాలించాము. 29 తేదీన నల్గొండ వాడపల్లిలో ఓ ఎరువులు దుకాణం దగ్గరికి వెళ్లి తనిఖీల పేరుతో రూ.80 వేల నగదుతో పరారయ్యాడు రవి శేఖర్. విజయవాడ వైపుగా వెళ్లాడని తెలియడంతో ఏపీ పోలీసులు సాయం తీసుకున్నాం. ఎనిమిది రోజుల తర్వాత జూలై 30న సోనిని వదిలేశాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేశాం. రవి శేఖర్‌ను పట్టుకోవడంలో ఏపీ పోలీసులు బాగా సహకరించారు’ అని భగవత్ తెలిపారు. అంతేకాక ‘రవి శేఖర్ మీద తెలుగు రాష్ట్రాలతో పాటు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కలుపుకుని 65కు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏపీలోనే ఇతడి మీద 50 కేసులు నమోదయ్యాయి. 2001 నుంచి రవి శేఖర్ నేరాలకు పాల్పడుతున్నాడు. 2006-2017 వరకూ తెలంగాణలో విజిలెన్స్ ఆఫీసర్, జడ్జీ కుమారుడిని, ఏసీబీ అధికారిని అంటూ మోసాలకు పాల్పడ్డాడు. 2014లో భువనగిరిలో పీడీఎస్‌లో అవకతవకలు అంటూ వెళ్లి షాప్ యజమానిని బెదిరించాడు. అనంతరం యజమాని భార్యతో బైక్ పైన ఉడాయించి, రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళిపోయాడు. రెండు రోజులు తరువాత ఆమెను విడిచి పెట్టాడు’ అని భగవత్ తెలిపారు. రవి శేఖర్ డబ్బులు వసూలు చేయడమే కాక పాటు మహిళలను మోసం చేస్తున్నాడన్నారు. అంగన్వాడి వర్కర్స్‌ను ట్రాప్ చేసి మోసం చేశాడని తెలిపారు. బ్యాక్ డోర్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ మోసం చేస్తున్నాడు. ఇలాంటి వారిని నమ్మవద్దు అని మహేష్ భగవత్ ప్రజలను కోరారు. -
కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్ట్
-
ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్
సాక్షి, హైదరాబాద్ : ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను హయత్‌నగర్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఈ నెల 23న హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థిని రవిశేఖర్ కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి పారిపోయాడు. ప్రస్తుతం సోనీ పోలీసుల సంరక్షణలో హైదరబాద్‌కు వస్తున్నారు. (చదవండి : కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..) -
అడవిలో ఆత్మ
ఆ ఐదు జంటలు విహార యాత్ర కోసం ఓ దట్టమైన అడవికి వెళతారు. అక్కడో గెస్ట్‌హౌస్‌లో ప్రేమ ఊసులు చెప్పుకుంటుంటే, ఒకరిలో ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎ రొమాంటిక్ హారర్ స్టోరీ’. శ్రీరామ్, నిరంజన, అయేషా ముఖ్య తారలుగా ఎస్.ఎస్. ప్రేమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో వెంకట్ రామిరెడ్డి, రవిశేఖర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తమిళంలో ‘ఫిబ్రవరి 31’ అనే టైటిల్ ఖరారు చేశాం. తెలుగు, హిందీ భాషలకు ఒకే టైటిల్ ఉంటుంది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు.