కజిరంగా పార్క్ లో అమీర్ ఖాన్, కరణ్ జోహార్! | Aamir Khan, Karan Johar visit Kaziranga National Park | Sakshi
Sakshi News home page

కజిరంగా పార్క్ లో అమీర్ ఖాన్, కరణ్ జోహార్!

Published Fri, Nov 8 2013 7:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM

కజిరంగా పార్క్ లో అమీర్ ఖాన్, కరణ్ జోహార్!

కజిరంగా పార్క్ లో అమీర్ ఖాన్, కరణ్ జోహార్!

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, దర్శకుడు కరణ్ జోహార్ లు అసోంలోని కజిరంగా జాతీయ పార్క్ ను సందర్శించారు. అమీర్ వెంట ఆయన సతీమణి కిరణ్ రావ్, కుమారుడు ఆజాద్ లు ఉన్నారు. 
 
తొలిసారి అసోంలో పర్యటిస్తున్న అమీర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. రైనో ఖడ్గ మృగాల సంరక్షణకు కజిరంగా అధికారులు తీసుకుంటున్న కృషిని అమీర్ ప్రశంసించారు. రైనో ఖడ్గమృగాల సంరక్షణ కోసం ఓ డాక్యుమెంటరీని తీయడానికి ప్రయత్నిస్తా అని అన్నారు. 
 
తన భార్య కిరణ్ పుట్టిన రోజున ఆశ్చర్యం కలిగించే విధంగా అసోం పర్యటనకు ప్లాన్ చేశాను అని అన్నారు. అసోం ప్రజలు చూపించిన ప్రేమ, అందించిన అపూర్వ స్వాగతం తనకు ఆనందం కలిగించింది అని అన్నారు. రైనోలను చూడటానికి అధికారులు తోడుండగా కిరణ్, కరణ్, ఆజాద్ లతో కలిసి జీప్ లో సఫారీకి వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement