నటి దుస్తులపై క్యాబ్ డ్రైవర్ కామెంట్స్ | Actor Frances Barber claims Uber driver said she was 'disgustingly dressed' | Sakshi
Sakshi News home page

నటి దుస్తులపై క్యాబ్ డ్రైవర్ కామెంట్స్

Published Wed, Nov 25 2015 10:46 AM | Last Updated on Thu, Aug 30 2018 9:05 PM

నటి దుస్తులపై క్యాబ్ డ్రైవర్ కామెంట్స్ - Sakshi

నటి దుస్తులపై క్యాబ్ డ్రైవర్ కామెంట్స్

లండన్: తన దస్తులు అసహ్యంగా ఉన్నాయని ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఒకరు కామెంట్ చేశారని బ్రిటీష్ నటి ఫ్రాన్సెస్ బార్బర్ ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు ఉబర్ సంస్థ ప్రకటించింది. లండన్ ఈవెనింగ్ స్టాండర్డ్ థియేటర్ అవార్డుల వేడుకలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్లేందుకు ఓల్డ్ విక్ ధియేటర్ వద్ద కారు ఎక్కిన తనపై ఉబర్ డ్రైవర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడని బార్బర్ తెలిపింది. తన డ్రెస్ అసహ్యంగా ఉందని, రాత్రిపూట ఆడవాళ్లు బయటకు రాకూడని 'షరియా ఉబర్ డ్రైవర్' కామెంట్స్ చేశాడని ట్విటర్ ద్వారా వెల్లడించింది.

అతడి వ్యాఖ్యలు తనను షాక్ కు గురిచేశాయని తెలిపింది. 'మనం ఇలాంటి ప్రపంచంలో నివసిస్తున్నా' అని వాపోయింది. ఫ్రాన్సెస్ బార్బర్  ట్వీట్స్ పై ఉబర్ సంస్థ వెంటనే స్పందించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన డ్రైవర్ పై చర్య తీసుకుంటామని హామీయిచ్చింది. తమ డ్రైవర్ తరపున బార్బర్ కు క్షమాపణ చెప్పింది. 'డాక్టర్ హు అండ్ సిల్క్' తదితర బీబీసీ డ్రామాల్లో ఫ్రాన్సెస్ బార్బర్ నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement