నిజజీవితంలో లిప్‌లాక్‌లు లేవా? | Actress Andrea interview | Sakshi
Sakshi News home page

నిజజీవితంలో లిప్‌లాక్‌లు లేవా?

Published Sun, Oct 29 2017 5:32 AM | Last Updated on Sun, Oct 29 2017 5:32 AM

Actress Andrea  interview

తమిళసినిమా: నటుడు కమలహాసన్‌ తరువాత అంతగా కంఫర్టబుల్‌గా నటించిన నటుడు ఎవరన్న ప్రశ్నకు నటి ఆండ్రియా చెప్పిన పేరు ఎవరిదనుకుంటున్నారు? వాస్తవానికి తాను చాలా పిరికిదానిని అంటున్న ఆ సంచలన నటి వివాదాస్పద పాత్రల్లో నటించడానికి మాత్రం చాలా ధైర్యంగా ముందుకొస్తుంది. ఈత దుస్తుల్లో, లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం వెనుకాడని ఆండ్రియా నటించిన తాజా చిత్రం అవళ్‌ నవంబర్‌ 3వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలకు ముస్తాబవుతోంది. మూడు పదుల పరువాల అండ్రియా నటిగా  దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ అమ్మడి ముచ్చట్లు చూద్దాం.

ప్ర: మీరెందుకు మీడియాకు దూరంగా ఉంటారు? ఎప్పుడైనా మాట్లాడినా, చాలా కోపంగా బదులిస్తుంటారని జరుగుతున్న ప్రచారంపై మీ సమాధానం?
జ: మీడియాకి భేటీలు ఇచ్చే స్థాయికి నేనింకా ఎదగలేదు.పెద్దగా ఏమీ సాధించలేదని అనుకుంటున్నాను.ఇదే కారణం.అలాగని పూర్తిగా నేను పత్రికల వారిని పక్కన పెడుతున్నాననుకోకండి.

ప్రశ్న: ఇటీవల మీరు పోషిస్తున్న పాత్రలన్నీ మిమ్మల్ని వేరే లెవల్‌కు తీసుకెళ్లేవిగా ఉంటున్నాయి. తరమణి చిత్రంలో మీ నటనకు పలువురి ప్రశంసలు లభించాయి.అయినా మీలో ఆ సంతోషం కనిపించడంలేదే?
జ: నిజమే నేను నటించిన పాత్రలను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. తరమణి చిత్రం నా సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తరువాత కొత్తగా అవకాశాలు వస్తాయని ఆశించిన నాకు నిరాశే మిగిలింది.అలాంటిది సంతోషం ఎలా కలుగుతుంది?

ప్ర: మీరు నటించిన తాజా చిత్రం అవళ్‌ ఎలా ఉంటుంది?
జ: మీరు చూస్తున్న హాలీవుడ్‌ హర్రర్‌ చిత్రాల తరహాలో అవళ్‌ ఉంటుంది. మంచు ప్రాంత నేపథ్యంలో సాగే హర్రర్‌ కథా చిత్రం అవళ్‌.

ప్ర: ఈ చిత్రం టీజర్‌ నిడివి మొత్తం ముప్పావు నిమిషం ఉంటే అందులోనే నాలుగు లిప్‌లాక్‌ సన్నివేశాలు చోటుచేసుకున్నాయే?
జ: లిప్‌లాక్‌ సన్నివేశాల గురించి మీడియానే ఇంకా విమర్శనాత్మకంగా చేస్తోంది. రోడ్డుపైకి వచ్చి చూడండి ఈ కాలం యువత ఇలాంటివన్నీ చాలా సహజంగా భావిస్తున్నారు. లిప్‌లాక్‌ అశ్లీలం, అసభ్యం అనే వారంతా నిజజీవితంలో వారు లిప్‌లాక్‌ ముద్దులు పెట్టుకోవడం లేదా? లిప్‌లాక్‌ సన్నివేశాలున్నాయనడం పాత పంచాంగం లాంటి ప్రశ్న.

ప్ర: నటుడు సిద్ధార్థ్‌తో కలిసి నటించి అనుభవం?
జ: సిద్ధార్థ్‌ చాలా జాలీ టైప్‌. కమలహాసన్‌ షూటింగ్‌ సెట్‌ తరువాత నేను చాలా కంఫర్ట్‌పుల్‌గా ఫీలయ్యింది ఈ చిత్ర సెట్‌లోనే.

ప్ర: నటిగా, గాయనిగా రాణిస్తున్నారు.తదుపరి దర్శకత్వం వహించే ఆలోచన ఉందా.
జ: నాకు తెలియని వృత్తిని ఎందుకు చేయాలి? నటన, పాడడం పనులు చేయడానికి ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు.

ప్ర: నయనతార, అనుష్క, త్రిష వంటి నటీమణులు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలు చేస్తున్నారు. మీకలాంటి కోరిక లేదా?
జ: నటించనని నేను చెప్పానా? అలాంటి పాత్రలు అమరితే నేనూ మంచి కథా పాత్రలను ఎంచుకుని నటిస్తాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement