నయనానందంగా..
పాత్రల్లో ఇమిడి పోవడానికి ఇంతకు ముందు కథానాయకులే శా రీరక వ్యాయామం లాంటి కసరత్తులు చేసేవారు. ఇప్పటి కథానయికలూ తామూ అందుకు రెడీ అంటున్నారు. పాత్ర లు డిమాండ్ చేస్తే బరువు పెరగడానికి, తగ్గడానికి సిద్ధం అంటున్నారు. ఆ మధ్య ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం నటి అనుష్క 80 కిలోల వరకూ బరువు పెరిగి నటించారు. తాజాగా నటి నయనతార జీరో సైజ్‌కు మారి మరింత నాజూగ్గా తయారయ్యారు. ఇదంతా నటుడు శివకార్తికేయన్ కోసమేనట. అదేమిటని ఆశ్చర్య పోతున్నారా? మరీ అంతగా ఇదైపోకండి.
నయనతార శివకార్తికేయన్‌కు జంటగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్నారు. శివకార్తికేయన్ లాంటి యువ హీరోతో జత కట్టడానికి నయనతార తన అందాలను మెరుగు పరచుకోవాలని భావించారట. దీంతో కేరళలో ఆయుర్వేద చికిత్స పొంది మరింత నాజూగ్గా తయారై వచ్చారని కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలే అందగత్తె.. అందులోనూ టాప్‌మోస్ట్ హీరోయిన్. అలాంటి చక్కనమ్మ మరింత చిక్కితే ఆ నయనానందమే వేరులే అంటున్నారు ఆమె తాజా చిత్ర యూనిట్ వర్గాలు.