‘ఆదోని’ సంఘటనలతో... | "ADONI 'with the events ... | Sakshi
Sakshi News home page

‘ఆదోని’ సంఘటనలతో...

Published Mon, Mar 21 2016 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

‘ఆదోని’ సంఘటనలతో...

‘ఆదోని’ సంఘటనలతో...

‘‘పాటల చిత్రీకరణ కనువిందుగా ఉంది. కమర్షియల్ సినిమాకు అవసరమైన అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నాయి. కన్నడంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ కావాలి’’ అని  దర్శకుడు శ్రీవాస్ పేర్కొన్నారు. నీరజ్ శామ్, సాయికుమార్, నేహా సక్సేనా, దిశ ప్రధాన పాత్రల్లో సంజీవ్ మేగోటి సంగీతం, దర్శకత్వం వహించిన ‘దండు’పాటలను విడుదల చేశారు.

దర్శకులు ముప్పల నేని శివ, శ్రీవాస్ బిగ్ సీడీ, పాటల సీడీలను నిర్మాతలు ‘మల్టీ  డైమన్షన్’ వాసు, రామ సత్యనారాయణ, మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు.1970 నుంచి 1996 వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందించానని దర్శకుడు అన్నారు.      సహ నిర్మాతలు మేగోటి ఉమామ హేశ్వరి, సత్యవతి, ఇ.రాము, లండన్ గణేష్ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement