కమర్షియల్ చిత్రంగా సవాలే సమాళి | Challenging commercial film samali | Sakshi
Sakshi News home page

కమర్షియల్ చిత్రంగా సవాలే సమాళి

Published Sat, Aug 15 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM

కమర్షియల్ చిత్రంగా సవాలే సమాళి

కమర్షియల్ చిత్రంగా సవాలే సమాళి

సవాలేసమాళి చిత్రం జనరంజక అంశాలతో పక్కా కమర్షియల్ చిత్రం గా ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సత్యశివ తెలిపారు. ఈయన కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని నటుడు అరుణ్‌పాండియన్ సమర్పణలో ఏ అండ్ పీ గ్రూప్ పతాకంపై కవితాపాండియన్, ఎస్‌ఎన్.రాజరాజన్ నిర్మిస్తున్నారు. అశోక్ సెల్వన్, బిందుమాధవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగన్, నాజర్, కరుణాస్, స్వాతి, గంజాకరుప్పు, ఎంఎస్.భాస్కర్, మనోబాలా, ప్రీతీదాస్, వైయాపురి, పరవై మునియమ్మ ముఖ్యపాత్రలు పోషించారు. కీర్తిపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ఎస్‌ఎస్.తమన్ సంగీత స్వరాలందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సవాలేసమాళి చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రం అని చెప్పారు. చిత్రంలో నటించిన ప్రతి నటుడు, నటి పాత్రలుగా మారి వినోదంలోనూ దుమ్మురేపారని తెలిపారు.

  ఎస్‌ఏ.సూర్య ప్రశంసలు
 చిత్రంలోని నల్లవనా కెట్టవనా ఆంబళ తెరియామ తవిక్కిరాడా పొంబళ పాట విన్న నటుడు, దర్శకుడు ఎస్‌ఏ సూర్య చాలా బాగుందని మెచ్చుకుంటూ పాట చిత్రీకరణ ఎప్పుడో చెప్పండి తాను వస్తానని అన్నారన్నారు. అలాగే మహాబలిపురంలో అశోక్ సెల్వన్, జగన్, ఐశ్వర్యలపై ఈ పాటను చిత్రీకరించినప్పుడు ఎస్‌ఏ.సూర్యకు చెప్పగా షూటింగ్ స్పాట్‌కు వచ్చి చూసి చిత్రీకరణ బాగుందంటూ అభినందించారని చెప్పారు. నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య ప్రత్యేక పాటలో నటించడం ఇదే తొలిసారి అని అన్నారు.చిత్రాన్ని సెప్టెంబర్ 4 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement