
సీనియర్స్‌తో సై...
అక్షరా హాసన్ సెలైంట్‌గా తమిళంలో బిజీ అయిపోతోంది. ‘షమితాబ్’ చిత్రం ద్వారా హిందీ తెరకు నాయికగా పరిచయమైన అక్షర ఆ తర్వాత అక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. ఈ మధ్యే తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అంగీకరించింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ నాయిక. తాజాగా విశాల్ హీరోగా రూపొందుతోన్న ‘తుప్పరివాలన్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తుప్పరివాలన్ అంటే డిటెక్టివ్ అని అర్థం.
ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. రకుల్ కంటే కాజల్ సీనియర్. రకుల్ వచ్చి నాలుగైదేళ్లవుతోంది. ఈ ఇద్దరితో పోల్చితే అక్షర జూనియర్. మరి.. ఇద్దరు సీనియర్ నాయికలున్న సినిమాలో ఓ నాయికగా నటించడమంటే అక్షరకు సవాలే. అయినా.. లోక నాయకుడు కమల్‌హాసన్ కూతురు కదా... సీనియర్స్‌కి ధీటుగా అక్షర నటిస్తుందని ఊహించవచ్చు.