అమెరికన్ టీవీ షో లో నిర్మత్ కౌర్! | Ali Fazal 'happy' about Nimrat's role in 'Homeland' | Sakshi
Sakshi News home page

అమెరికన్ టీవీ షో లో నిర్మత్ కౌర్!

Published Mon, Aug 11 2014 4:52 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అమెరికన్ టీవీ షో లో నిర్మత్ కౌర్! - Sakshi

అమెరికన్ టీవీ షో లో నిర్మత్ కౌర్!

న్యూఢిల్లీ: అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ టీవీ సిరీస్ నిర్మిస్తున్న హోమ్ ల్యాండ్ తదుపరి ఎడిషన్ లో బాలీవుడ్ నటి నిర్మత్ కౌర్ కు అవకాశం దక్కడం పట్ల బాలీవుడ్ నటుడు ఆలీ ఫజల్ ఆనందం వ్యక్తం చేశాడు.  ప్రింట్ మోడల్ గా కెరీర్ ను ఆరంభించి తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న నిర్మత్ కౌర్ కు  ఈ అవకాశం రావడం వెనుక ఆమె కష్టం చాలానే ఉందన్నాడు. 'హోమ్  ల్యాండ్ సిరీస్ లో నిర్మత్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. బాలీవుడ్ లో ఆమె చేసిన పలు ప్రాజెక్టులతోనే ఆ అవకాశాన్ని దక్కించుకుంది. మేమిద్దరం కలిసి చాలా కార్యక్రమాలు చేశాం. నాకు ఆమె మంచి స్నేహితురాలు. ఈ చక్కటి అవకాశం ఆమెకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది' అని జాతీయ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు.

 

తాను ప్రస్తుతం ఖామోషియాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని ఆలీ ఫజల్ తెలిపాడు. 'బాబీ జాసెస్ విడుదలకు ముందే ఈ చిత్రాన్ని అంగీకరించినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. తాను నటించిన 'సోనాలి కేబుల్' చిత్రం అక్టోబర్ లో విడుదలవుతుందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement