జగన్నాథమ్‌ స్మైల్‌! | Allu Arjun's 'Duvvada Jagannadham' to have a song shooting | Sakshi
Sakshi News home page

జగన్నాథమ్‌ స్మైల్‌!

Published Wed, Mar 29 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM

జగన్నాథమ్‌ స్మైల్‌!

వందమందికి వంట చేసినా... ఓ అమ్మాయితో లవ్‌లో పడినా... ఒకడికి వార్నింగ్‌ ఇచ్చినా... కామెడీ చేసినా... ఆ మాటకొస్తే జగన్నాథమ్‌ఏం చేసినా భలే స్టైల్‌గా ఉంటుంది. డీజే (దువ్వాడ జగన్నాథమ్‌)గా అల్లు అర్జున్‌ చేస్తున్నప్పుడు ఆ మాత్రం స్టైల్‌ తప్పదు మరి అంటున్నారు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. అల్లు అర్జున్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న సినిమా ‘దువ్వాడ జగన్నాథమ్‌’. ఇటీవల అబుదాబిలో ఓ షెడ్యూల్‌ పూర్తయింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ మాట్లాడుతూ – ‘‘అల్లు అర్జున్‌ స్టైల్‌కి తగ్గట్టు కమర్షియల్‌ అంశాలతో పాటు సినిమాలో మంచి వినోదం ఉంటుంది.  ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయిస్తుంది. ప్రస్తుతం దినేష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఓ పాటను తెరకెక్కిస్తున్నాం. సినిమాలో ముఖ్యమైన అంశాలన్నీ హైలైట్‌ అయ్యేలా శ్రీమణి ఈ పాట రాశారు. బన్నీ డ్యాన్స్, సాంగ్‌ పిక్చరైజేషన్‌ అభిమానులకు కన్నుల పండగలా ఉంటుంది.

దేవిశ్రీ ప్రసాద్‌ మంచి పాటలు ఇచ్చారు’’ అన్నారు. జగన్నాథమ్‌గా ఆల్రెడీ విడుదలైన గెటప్‌కి భిన్నమైన మరో గెటప్‌లో బన్నీ కనిపిస్తారని సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి కళ: రవీందర్, కూర్పు: ఛోటా కె. ప్రసాద్, కథనం: రమేశ్‌రెడ్డి–దీపక్‌రాజ్, కెమేరా: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement