
బాలయ్యను కాదని చిరుతో..!
ఖైదీ నంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మెగాటీం నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టింది. బాహుబలి జాతీయ స్థాయిలో హైప్ క్రియేట్ చేయటంతో ఉయ్యాలవాడను కూడా అదే స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జాతీయ స్థాయి నటులను కీలక పాత్రలకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సినిమాలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటిస్తుందన్న వార్త కొద్ది రోజులు ఫిలిం నగర్లో హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నడట. ఇప్పటికే కథ విన్న బిగ్ బి, నటించేందుకు సుముఖంగానే ఉన్నా.. ఖచ్చితంగా చేస్తానని మాత్రంచెప్పలేదంటున్నారు.
గతంలో కృష్ణవంశీ, బాలకృష్ణ కాంబినేషన్లో ప్లాన్ చేసిన రైతు సినిమా కోసం అమితాబ్ను సంప్రదించారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కావటం లేదన్న కారణంతో బాలయ్యకు నో చెప్పాడు అమితాబ్. దీంతో రైతు సినిమాను పక్కనపెట్టి పూరి సినిమా స్టార్ట్ చేశాడు బాలకృష్ణ. బాలయ్యను కాదని ఇప్పుడు చిరు సినిమాలో నటించేందుకు అమితాబ్ అంగీకరిస్తాడా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.