
అమితాబ్ బచ్చన్, అయాన్ ముఖర్జీ, రణ్‌బీర్ కపూర్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఏదో చెబుతుంటే హీరో రణ్‌బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎలా ఆలకిస్తున్నారో చూశారుగా! ఇంతకీ అమితాబ్ ఏం చెబుతున్నారు? ఈ ముగ్గురూ ఎక్కడ కలిశారు? దేని గురించి డిస్కస్ చేస్తున్నారు అంటే... ‘బ్రహ్మాస్త్ర’ కోసం.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ‘‘బ్రహ్మాస్త్ర. ఎగై్జటింగ్ జర్నీ స్టారై్టంది’’ అని ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ పేర్కొంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం సౌరవ్ గుర్జార్‌ను తీసుకున్నారని బాలీవుడ్ సమాచారం. హిందీ బుల్లితెరపై రావణ, భీమ క్యారెక్టర్స్‌లో నటించారు సౌరవ్. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను మూడు పార్ట్స్‌గా తీయాలనుకుంటున్నారు. 150 కోట్లతో రూపొందించనున్న తొలి పార్ట్‌ను వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ఎనౌన్స్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment