అమితాబ్= సల్మాన్ @ 7 | Amitabh, Salman, Akshay among world's top ten highest-paid actors | Sakshi
Sakshi News home page

అమితాబ్= సల్మాన్ @ 7

Published Wed, Aug 5 2015 11:36 AM | Last Updated on Thu, Oct 4 2018 4:43 PM

అమితాబ్= సల్మాన్ @ 7 - Sakshi

అమితాబ్= సల్మాన్ @ 7

వాషింగ్టన్: ధనార్జనలో ప్రపంచ టాప్-10 హీరోల జాబితాలో బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లకు చోటు దక్కింది. అమితాబ్, సల్మాన్ సంయుక్తంగా ఏడో స్థానంలో ఉండగా, అక్షయ్ కుమార్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.

హాలీవుడ్ నుంచి హాంకాంగ్, బాలీవుడ్ వరకు అత్యధిక ధనార్జన గల హీరోల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. గతేడాది అమితాబ్, సల్మాన్ దాదాపుగా చెరో 213 కోట్ల రూపాయలను సంపాదించినట్టు వెల్లడించింది. ఇక అక్షయ్ 207 కోట్ల రూపాయలను ఆర్జించారు. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోలు షారుక్ ఖాన్ 18, రణబీర్ కపూర్ 30 వ స్థానాల్లో ఉన్నారు. షారుక్ ఖాన్ను 'భారత్ లియెనార్డో డికాప్రియో'గా ఫోర్బ్స్ అభివర్ణించింది. ఈ జాబితాలో రాబర్ట్ డోనీ జూనియర్, జాకీచాన్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. గతేడాది రాబర్ట్ 510, జాకీచాన్ 320 కోట్ల రూపాయల చొప్పున సంపాదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement