వర్మ కంపెనీలో బిగ్బి
Published Thu, Apr 7 2016 10:41 AM | Last Updated on Mon, May 28 2018 4:05 PM
కొద్ది రోజులుగా బాలీవుడ్ను పక్కన పెట్టి టాలీవుడ్లో మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ మరోసారి బాలీవుడ్ బాట పట్టాడు. తెలుగులో సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా కాలక్షేపం చేసిన ఈ క్రియేటివ్ డైరెక్టర్, తాజాగా వంగవీటి తెలుగులో తన చివరి చిత్రం అంటూ ప్రకటించేశాడు. అంతేకాదు తన మకాం కూడా ముంబైకి మార్చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ, అక్కడ ఓ ఆఫీస్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
కంపెనీ పేరుతో వర్మ ఏర్పాటు చేసిన ఈ కొత్త ఆఫీస్ను తాజాగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సందర్శించారు. వర్మ మార్క్ థికింగ్తో క్రియేటివ్ ఇంటిరియర్తో చాలా కొత్తగా ఆఫీస్ను డిజైన్ చేశారు. అమితాబ్ను స్వయంగా ఎదురొచ్చి ఆఫీస్లోకి తీసుకెళ్లిన వర్మ, ప్రతీ రూం తిప్పుతూ అక్కడి విశేషాలను వివరించారు. తర్వాత స్వయంగా ఆయనను సాగనంపారు. బాలీవుడ్లో వర్మ ఏర్పాటు చేసిన కంపెనీ టాలీవుడ్ లోలా వివాదాలతోనే సరిపెడుతుందో, లేక మంచి సినిమాలను కూడా అందిస్తుందో చూడాలి.
Advertisement
Advertisement