అక్షర అవుట్‌ ఆండ్రియా ఇన్? | Andrea in Akshara out? | Sakshi
Sakshi News home page

అక్షర అవుట్‌ ఆండ్రియా ఇన్?

Published Sat, Jan 7 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM

అక్షర అవుట్‌ ఆండ్రియా ఇన్?

అక్షర అవుట్‌ ఆండ్రియా ఇన్?

హిందీ చిత్రం షమితాబ్‌ చిత్రం ద్వారా నటిగా పరిచయమైన విశ్వనటుడు కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ కోలీవుడ్‌ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని తమిళ సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్షర ఒకే సారి అజిత్, విశాల్‌ చిత్రాలతో తమిళ తెరపైకి రానున్నారనే వార్త ఇక్కడి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించింది.అయితే ఆ ఆనందం సగానికే పరిమితం అవుతోందన్నది తాజా సమాచారం.అవును విశాల్‌ చిత్రం నుంచి అక్షర వైదొలిగినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. విశాల్‌ హీరోగా నటిస్తూ తన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం తుప్పరివాలన్. మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుఇమ్మానువేల్‌ హీరోయిన్ గా నటిస్తున్నారు. కే.భాగ్యరాజ్‌ విలన్ గా నటిస్తున్న ఇందులో ప్రసన్న, వినయ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఒక కీలక పాత్రలో అక్షరహాసన్ ను ఎంపిక చేశారు. చిత్రం సగానికి పైగా చితీరకరణ పూర్తి చేసుకున్న తరుణంలో నటి అక్షరహాసన్  చిత్రం నుంచి వైదొలగారని తెలిసింది.ఇప్పుడా పాత్రను నటి ఆండ్రియా పోషించనున్నారట. అక్షర ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నాయి. అజిత్‌ 57వ చిత్రంలో నటించడం వల్లే ఈ చిత్రానికి కాల్‌షీట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో తుప్పరివాలన్  చిత్రాన్ని వదులుకున్నారని ఒక ప్రచారం.ఇక తన తండ్రి కమలహాసన్  హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం శభాష్‌ నాయుడు చిత్ర షూటింగ్‌ అమెరికాలో ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న తరువాత కమల్‌ అనూహ్యంగా ప్రమాదానికి గురై చికిత్స కోసం ఆస్పత్రిలో చేరి అనంతరం కొంత విశ్రాంతి తరువాత మళ్లీ చిత్ర షూటింగ్‌కు సిద్ధం అవుతున్నారు.

కమల్‌ పెద్ద కూతురు శ్రుతిహాసన్  తొలిసారిగా ఆయనతో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి అక్షరహాసన్  సహాయ దర్శకురాలిగా పనిచేస్తున్నారు.కాబట్టి శభాష్‌నాయుడు చిత్ర షూటింగ్‌లో తన తండ్రి కమల్‌కు తన సహాయం చాలా అవసరం అని భావించిన అక్షర విశాల్‌ చిత్రం నుంచి వైదొలగినట్లు జరుగుతున్న మరో ప్రచారం. ఏదేమైనా ధనుష్‌తో వడచెన్నై, రామ్‌ దర్శకత్వంలో తరమణి చిత్రాల్లో నటిస్తున్న నటి ఆండ్రియాకు తాజాగా విశాల్‌తో నటించే అవకాశం వచ్చిందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement