విశాల్‌కు జంటగా ఆండ్రియా | Andrea to romance with Vishal | Sakshi
Sakshi News home page

విశాల్‌కు జంటగా ఆండ్రియా

Published Mon, Dec 12 2016 2:49 AM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM

విశాల్‌కు జంటగా ఆండ్రియా

విశాల్‌కు జంటగా ఆండ్రియా

విశాల్‌తో స్టెప్స్ వేయడానికి రెడీ అవుతున్నారు నటి ఆండ్రియా. బోల్ట్ అండ్ బ్యూటీఫుల్ నటి ఆండ్రియా అన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు కమలహాసన్‌తో వరుసగా విశ్వరూపం, విశ్వరూపం-2, ఉత్తమవిలన్ చిత్రాల్లో నటించిన ఆండ్రియా ప్రస్తుతం తరమణి, వడచెన్నై చిత్రాలతో బిజీగా ఉన్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న వడచెన్నై చిత్రంలో స్లమ్ ఏరియా యువతిగా నటిస్తున్నారని సమాచారం. పాత్ర పరంగా వేశ్య కావడంతో చాలా మోడ్రన్‌గా కనిపిస్తారని తెలిసింది. తాజాగా విశాల్‌ను డీప్‌గా ప్రేమించే వన్ సైడ్ ప్రేయసిగా నటించనున్నారని సమాచారం.
 
  ఇందులోనూ ఆండ్రియా అం దాలారబోతతో అలరించనున్నట్లు సమాచారం. విశాల్ నటించిన కత్తిసండై ని ర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సంక్రాంతి బరిలోకి దూకడానికి సి ద్ధం అవుతోంది. విశాల్ ప్రస్తుతం మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చి త్రంలో నటిస్తున్నారు. దీన్ని ఆయన తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకం పై నిర్మిస్తున్నారన్నది గమనార్హం. ఇందులో నాయకిగా నటి రకుల్ ప్రీత్‌సింగ్ నటించనున్నట్లు ప్రచారంలో ఉంది. మరో కీలక పాత్రలో కమలహాసన్ రెండవ వారసురాలు అక్షరహాసన్ న టించనున్నారు. తాజాగా ఆండ్రియా చేరడంతో తు ప్పరివాలన్ చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement