దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ | another Bollywood Beauty entry to tollywood | Sakshi
Sakshi News home page

దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ

Published Thu, Dec 24 2015 3:20 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దక్షిణాదికి  మరో బాలీవుడ్ బ్యూటీ - Sakshi

దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ బ్యూటీ దక్షిణాదిలో మెరవడం కొత్తేమి కాదు. దీపికాపడుకునే, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, కంగనారావత్, ఇలియానా, తాప్సీ, కాజల్ ఇక చాలా మంది దక్షిణాది ప్రేక్షకులను తమ అందచందాలతో ముగ్ధుల్ని చేశారు. తాజాగా ఆష్‌కి - 2 చిత్ర నాయకి శ్రద్ద కపూర్‌కు దక్షిణాది నుంచి పిలుపొచ్చిందన్నదే తాజావార్త. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహష్‌బాబుకు కోలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దాన్ని మరింత పంచుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. మహేష్ తన చిత్రాలను తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్నారిప్పుడు. ప్రస్తుతం నిర్మాణంలో వున్న బ్రహ్మోత్సవం చిత్రాన్ని ద్విభాషా చిత్రంగా చేస్తున్నారు. తదుపరి తమిళ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇది భారీ కమర్షియల్ అంశాలతో కూడిన జనరంజక కథా చిత్రంగా ఉంటుందంటున్నారు. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దకపూర్‌ను ఈ చిత్రం ద్వారా ఏఆర్ మురుగదాస్ దక్షిణాదికి పరిచయం చేయబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం హిందీలో ఆష్‌కి-2 చిత్రాన్ని పూర్తి చేసిన ఏఆర్ మురుగదాస్ మహేష్‌బాబుతో చేసే ద్విభాషా చిత్ర కథకు మెరుపులద్దే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement