మిల్కీబ్యూటీకి మరో చిత్రం | Another movie for tamanna | Sakshi
Sakshi News home page

మిల్కీబ్యూటీకి మరో చిత్రం

Published Tue, Jan 31 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

మిల్కీబ్యూటీకి మరో చిత్రం

మిల్కీబ్యూటీకి మరో చిత్రం

కోలీవుడ్‌లో మిల్కీబ్యూటీ తమన్నా జోరు కొనసాగుతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న బాహుబలి–2 చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. నటిగా పునర్జన్మనిచ్చిన బాహుబలి చిత్ర సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై తమన్నా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా బాహుబలి–2 ఏప్రిల్‌లో తెరపైకి రానుంది. ప్రస్తుతం తమన్నా శింబుకు జంటగా అన్భానవన్ అసరాదవన్  అడంగాదవన్  చిత్రంలో నటిస్తున్నారు.

కాగా ఈ మధ్య విశాల్‌తో రొమాన్స్  చేసిన కత్తిసండై ఆశించిన విజయం సాధించకపోవడంతో తమన్నా జోరు తగ్గిందనే టాక్‌ వచ్చింది. వేరే అవకాశాలు కూడా రాకపోవడం ఈ ప్రచారానికి ఒక కారణం కావచ్చు. తాజాగా సియాన్  విక్రమ్‌తో డ్యూయెట్లు పాడే అవకాశం ఈ భామను వరించిందన్నది కోలీవుడ్‌ వర్గాల సమాచారం. విక్రమ్‌ వాలు చిత్రం ఫేమ్‌ విజయ్‌చందర్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇందులో ఆయనకు జంటగా ప్రేమమ్‌ చిత్రం ఫేమ్‌ సాయిపల్లవి నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె కాల్‌షీట్స్‌ సమస్య కారణంగా నటించలేని పరిస్థితి అని ఇప్పుడా పాత్రకు తమన్నాను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం విక్రమ్‌ గౌతమ్‌మీనన్  దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత విజయ్‌చందర్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఇక పోతే నటి తమన్నా మరో తమిళ చిత్రంలో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ప్రభుదేవాతో కలిసి దేవి చిత్రంలో నటించారు. ఇదే జంట మళ్లీ కొత్త చిత్రంలో రిపీట్‌ కానుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement