అలసట భలే ఉంది!
పాపం.. అనుష్కా శర్మ అరక్షణం కూడా తీరిక లేకుండా ఉన్నట్లున్నారు. ఇటు మేకప్ వేసుకుని ఒక సినిమా షూట్‌లో పాల్గొంటూనే మరో సినిమా ప్రమోషన్స్‌లో ఎలా అదరగొట్టాలా? అని ఆలోచిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో రూపొందుతోన్న సంజయ్ దత్ బయోపిక్‌లో ఆమె ఓ రోల్ చేశారు. ఆ షూటింగ్ కంప్లీట్ చేసుకుని షారుక్ ఖాన్ సరసన తాను నటించిన ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.
ఈ చిత్రానికి ఇంతియాజ్ అలీ దర్శకుడు. ‘‘సంజయ్‌దత్ బయోపిక్ షూటింగ్‌లో పాల్గొన్నాను. న్యూయార్క్‌లో ఈ షూటింగ్ జరిగింది. ఇప్పుడు షారుక్ సినిమా ప్రమోషన్ కోసం ముంబై వెళుతున్నా. బాగా అలసటగా ఉంది. అయినా సరే బిజీ లైఫ్ భలే ఉంది’’ అని పేర్కొన్నారు అనుష్కా శర్మ.