భాగమతిగా అనుష్క? | Anushka Shetty as Bhagmati in her upcoming film | Sakshi
Sakshi News home page

భాగమతిగా అనుష్క?

Published Thu, Dec 5 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM

Anushka Shetty as Bhagmati in her upcoming film

‘అరుంధతి’ సినిమా తర్వాత అనుష్క నట జీవితమే మారిపోయింది. కేవలం గ్లామర్ పాత్రలకే పనికొస్తుందనుకున్న అనుష్కతో నాయికా ప్రాధాన్య చిత్రాలు చేయొచ్చనే భరోసా దర్శక నిర్మాతలకు కలిగింది. తాజాగా ‘రుద్రమదేవి’గా చేస్తున్నారామె. మరోపక్క ‘బాహుబలి’లో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా భాగమతి పాత్ర అనుష్కను వరించిందని సమాచారమ్.  16వ శతాబ్దంలో హైదరాబాద్ ప్రాంతాన్ని ఏలిన మహమ్మద్ కులీ కుతుబ్‌షా చరిత్ర చాలామందికి తెలిసే ఉంటుంది.
 
కులీ, ఆయన భార్య భాగమతిల ప్రేమ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని వినికిడి. భాగమతి పాత్రను అనుష్క పోషించబోతున్నారట. ఈ కథ మొత్తం దాదాపు భాగమతి చుట్టూ తిరుగుతుందని, టైటిల్ కూడా ‘భాగమతి’ అని ఫిల్మ్‌నగర్ టాక్. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట. ప్రభాస్, అనుష్క జంటగా ‘మిర్చి’ చిత్రాన్ని నిర్మించిన వంశీ, ప్రమోద్ ఈ  చిత్రాన్ని నిర్మించబోతున్నారట. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement