అనుష్క లావైంది | anushka shetty zero size movie | Sakshi
Sakshi News home page

అనుష్క లావైంది

Published Sun, Aug 16 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 AM

అనుష్క లావైంది

అనుష్క లావైంది

ఆహా ఓహో అనుష్క చిత్ర ప్రముఖలే కాదు, సహ నటీమణుల నోట ఇప్పుడు ఇదే మాట. ఇంతకీ ఏమిటబ్బా నటి అనుష్క చేసిన ఘన కార్యం. ఎవరికయినా ఏమైనా సాయం చేశారా? లేక పారితోషికమే తీసుకోకుండా నటిస్తున్నారా? అని ఆరా తీస్తే అవేవీ కాదని తెలిసింది. ఇంతకీ ఏమయిందీ అంటే అనుష్క లావయ్యారు.ఇదీ మ్యాటర్. ఓస్ ఇంతేనా’ అని తేలిగ్గా తీసిపారేయకండి. సాధారణంగా పాత్రలకు తగ్గట్టుగా నటులే శారీరక హెచ్చు తగ్గులకు కసరత్తులు చేస్తుంటారు. కథానాయికలు అలా చేయడం అన్నది అరుదే కాదు అసలు జరిగిన దాఖలాలు లేవు. నటి అనుష్క ఇంజి ఇడుప్పళగి అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు.

తెలుగులో సైజ్ జీరో పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది.ఆర్య కథానాయకుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో అనుష్క రూపం చూసిన అభిమానులు,చిత్ర ప్రముఖులు,సహ నటీమణలూ  ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం. అనుష్కను అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తుంటారు. అంత అందం ఆమెది. అలాంటి అనుష్క ఊహించనంత బొద్దుగా కనిపించడమే వారి ఆశ్చర్యానికి కారణం. ఎంత పాత్ర కోసం అయినా అంత లావైపోవడమా వావ్ అనుష్కా అంటున్నారు.

లావుగా ఉండే యువతి సన్నగా తయారయ్యే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఇంజి ఇడుప్పళగి. ఈ చిత్రం కోసం అనుష్క సుమారు 100 కేజీల బరువుకు తన శరీరాని పెంచుకున్నారని సమాచారం. అంతే కాదు మళ్ల ఇదే చిత్రంలో జీరోసైజ్‌కు మారి అందాలారబోస్తారట. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో ఈత దుస్తుల్లోనూ అనుష్క అందాల్ని చూడవచ్చునట. ఏమిటీ ఇప్పుడే చిత్రాన్ని చూడాలనిపిస్తోందా? వచ్చేనెల ఆరవ తేదీన ఆడియోను విడుదల చేసి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున ఈ ద్విభాషా చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement