
‘గేమ్’కి రెడీ!
1942 -ఎ లవ్‌స్టోరీ, బొంబాయి, ఒకే ఒక్కడు తదితర చిత్రాలతో బోల్డంత క్రేజ్ తెచ్చుకున్నారు మనీషా కొయిరాలా. ఈ నేపాలీ బ్యూటీకి క్యాన్సర్ వ్యాధి సోకితే, ధైర్యంగా చికిత్స చేయించుకుని బయటపడ్డారు. ఇప్పుడు నూతనోత్సాహంతో మళ్లీ సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించనున్న ‘గేమ్’ అనే కన్నడ చిత్రంలో ఆమె నటించనున్నారు. ఇటీవలే లుక్ టెస్ట్ చేశారు. ఇక్కడ చూస్తున్నది ఆ లుక్ తాలూకు ఫొటోనే.