‘దిల్’రాజుకి అవార్డ్ | Award to dilraju | Sakshi
Sakshi News home page

‘దిల్’రాజుకి అవార్డ్

Published Tue, Oct 25 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 6:11 PM

‘దిల్’రాజుకి అవార్డ్

‘దిల్’రాజుకి అవార్డ్

తొలి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ దర్శక-నిర్మాత హెచ్.యం.రెడ్డి (హనుమంతప్ప మునియప్ప రెడ్డి) పేరుతో, సాంస్కృతిక సంస్థ ‘ఆకృతి’ గత 23 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన దర్శక-నిర్మాతలకు పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాది ‘దిల్’ రాజు ప్రతిష్టాత్మక హెచ్.యం.రెడ్డి అవార్డు అందుకోనున్నారు.

ఈ నెల 28న హైదరాబాద్, రవీంద్ర భారతిలో జరగబోయే కార్యక్రమంలో తెలంగాణ శాసనసభా స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి అవార్డు ప్రదానం చేయనున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement