ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఈ ఫొటోలో డిఫరెంట్ లుక్లో కనిపిస్తున్న ఈ యువతి ప్రముఖ హీరోయిన్. బాలీవుడ్తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచతం. ప్రముఖ నటి అనుష్కతో కలసి టాలీవుడ్లో అరంగేట్రం చేసింది. నాగార్జున సినిమాలో తళుక్కున మెరిసింది. ఈ పాటికి మీకు గుర్తుపట్టి ఉంటారు! అవును ఈ ఫొటోలో ఉన్న భామ సూపర్ సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ అయేషా టకియా.
సినిమాల్లో అయేషా బొద్దుగా కనిపించింది. బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించింది. ఏడేళ్ల క్రితం ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకున్నఅయేషా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మూడేళ్లుగా వెండితెరకు దూరమైన అయేషా ఇటీవల కొత్త లుక్లో కనిపించింది. అప్పటితో పోలిస్తే బాగా సన్నబడింది. హెయిర్ స్టెయిల్ మార్చింది. ఆమె ఫొటోలను చూసినవారు మొదట గుర్తుపట్టలేకపోయారు. పాత ఫొటో, కొత్త లుక్లో ఉన్న ఫొటోలను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులు అయేషాను గుర్తుపట్టారు.