అతడి విషయంలో ప్రస్తుతానికి మౌనమే: కాజోల్‌ | Best Thing To Do Right Now Is Stay Silent: Kajol On Ex-Friend Karan Johar | Sakshi
Sakshi News home page

అతడి విషయంలో ప్రస్తుతానికి మౌనమే: కాజోల్‌

Published Wed, Apr 5 2017 11:02 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అతడి విషయంలో ప్రస్తుతానికి మౌనమే: కాజోల్‌ - Sakshi

అతడి విషయంలో ప్రస్తుతానికి మౌనమే: కాజోల్‌

ముంబయి: తన చిరకాల స్నేహితురాలు ప్రముఖ బాలీవుడ్‌ నటి కాజోల్‌ తన నుంచి విడిపోవడంపట్ల ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహార్‌ పెద్ద మొత్తంలోనే బహిరంగ వివరణ ఇచ్చినప్పటికీ కాజోల్‌ మాత్రం ఈ విషయంలో సహనంగానే ఉంటోంది. ఈ విషయంలో ప్రస్తుతం మౌనంగా ఉండటం, శాంతియుతంగా ఉండటమే తనకు మంచిదని భావిస్తున్నట్లు తాజాగా ఓ మీడియాకు వెల్లడించింది. ఒక వేళ దీనిపై మాట్లాడాలని అనిపించిన రోజు ఈ ప్రపంచం తన మాటలను తప్పకుండా వింటుందని కూడా చెప్పింది.

'ఈ మొత్తం వ్యవహారంపై గత కొంతకాలంగా కాస్త ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే సరైన చర్య. ఒక ప్రత్యేక అంశంపై నేను మాట్లాడి నా అభిప్రాయాన్ని చెప్పాలనుకున్నప్పుడు నాకు ఈ ప్రపంచంపై నమ్మకం ఉంది నా మాటలు తప్పకుండా వింటుందని' అని కాజోల్‌ చెప్పింది.

ఇక కరణ్‌ ఇటీవల సరోగసీ ద్వారా పొందిన కవలను చూసేందుకు వెళతారా అన్న ప్రశ్నకు సమాధానం దాట వేశారు. వీరిద్దరి మధ్య 25 ఏళ్ల స్నేహం చెడిపోయిన విషయం తెలిసిందే. అందుకు కాజోల్‌ భర్త అజయ్‌ దేవగన్‌ అని కరణ్‌ తాను రాసిన పుస్తకంలో ఆరోపించగా ఆ పుస్తకాలు అమ్ముడు పోయేందుకే ఆయన అలా రాశారంటూ కాజోల్‌ భర్తకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement