
అనుకున్నదే జరిగింది. ఇంటి నుంచి మూడో వ్యక్తిగా తమన్నా ఎలిమినేట్ అయిందనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ షోలో భాగంగా ఉండే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఉత్కంఠగా సాగితే.. వీక్షకుడు కూడా అంతే ఆత్రుతతో ఈ కార్యక్రమాన్ని చూస్తాడు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ గురించి ముందే లీకవుతోంది. మొదట్నుంచీ లీకుల బారిన పడిన ఈ షో పరిస్థితి మరీ దిగజారిపోయింది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ల నుంచి మొదటి ఎలిమినేషన్, వైల్డ్ కార్డ్‌ఎంట్రీతో సహా.. అన్నీ లీకవుతూనే వచ్చాయి. రెండో వారంలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడనే వార్త శనివారం రాత్రే బయటకు వచ్చేసింది. తాజాగా ఇలాంటి పరిస్థితే నెలకొంది.
తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు తమన్నాపై ట్వీట్లు, ఫోటోలు, మీమ్స్ తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తమన్నా ఎలిమినేట్ అయిందంటూ శనివారం రాత్రి నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఏ ఇతర కంటెస్టెంట్లకు రానన్ని తక్కువ ఓట్లు తమన్నాకు వచ్చాయని తెలుస్తోంది. హౌస్‌లో తన ప్రవర్తన, అందరితో అమర్యాదగా ప్రవర్తించడం, ఇతర హౌస్‌మేట్స్‌తో గొడవలు పెట్టుకోవడం.. ముఖ్యంగా రవికృష్ణ విషయంలో తమన్నా ప్రవర్తించిన తీరే.. తన ఎలిమినేషన్‌కు ముఖ్య కారణమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలిమినేట్ కాబోతోన్న కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కాబట్టి నేటి ఎపిసోడ్‌లో తమన్నా ఇంటి బయటకు వచ్చి.. హౌస్‌మేట్స్ గురించి ఎటువంటి ఆసక్తికర కామెంట్లు చేస్తుందో చూడాలి. నేటి ఎపిసోడ్‌లో సందడి చేసేందుకు వెన్నెల కిషోర్‌ను తీసుకొచ్చిన నాగ్.. హౌస్‌మేట్స్‌తో పాటు, ప్రేక్షకులనూ ఎంటర్‌టైన్ చేయనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment