
బిగ్‌బాస్ షోలో జరిగే ఎలిమినేషన్ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నది తెలుస్తోంది.
గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ పదోవారానికి ఓ విశిష్టత ఉంది. అదేంటంటే.. లీకువీరుల కంటే ముందే ప్రేక్షకులూ గెస్ చేశారు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన మరుక్షణమే ఎవరు ఎలిమినేట్ కానున్నారో అందరూ పసిగట్టేశారు. పదోవారానికి గానూ బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్, రవికృష్ణలు నామినేట్ అయ్యారు.
ఆ నలుగురిలో రవికృష్ణకే కాస్త తక్కువ ఫాలోయింగ్ ఉన్నది అందరికీ తెలిసిందే. దీంతో రవికృష్ణ ఈ వారం ఇంటి నుంచి వెళ్లడం ఖాయమని ప్రేక్షకులు ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. ప్రేక్షకుల ఊహకు తగ్గట్టే రవికృష్ణ ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఒక్కసారైనా కెప్టెన్ అవుదామని అనుకున్న రవి ఆశలు అడియాశలయ్యాయి. నిన్నటి కెప్టెన్సీ టాస్క్‌లో కెప్టెన్ అయ్యే అవకాశం లభించినా.. అది తృటిలో చేజారిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment